drought group
-
వచ్చారు.. వెళ్లారు..
►జిల్లాలో ముగిసిన కరువు బృందం పర్యటన ►తూర్పు ప్రాంతాన్ని చూసిన కేంద్ర అధికారులు ►గతంలో పర్యటించినా వెలువడని నివేదిక ►అధికారుల తీరుపై అన్నదాత పెదవి విరుపు జిల్లాకు మరోసారి కరువు బృందం వచ్చింది. రెండు రోజులపాటు తూర్పు ప్రాంతాన్ని సందర్శించింది. బాధిత రైతులతో మాట్లాడింది. గతంలోనూ ఒక బృందం ఇదేతరహాలో వచ్చి వెళ్లింది. ఇదే పాత్రను పోషించింది. ఏ నివేదికను సమర్పించిందో తెలి యదు గాని అన్నదాతకు సాయమందలేదు. తాజా బృందం గురువారం వడమాలపేట..నగరి..నారాయణవనం మండలాల్లో పర్యటించింది. శుక్రవారం నాగలాపురం.. వరదయ్యపాళెం మండలాలను సందర్శించింది. తర్వాత నెల్లూరుకు పయనమైంది. చిత్తూరు: పచ్చని పైరుతో కళకళలాడే తూర్పు మండలాలు కరువుతో అల్లాడుతున్నాయి. చినుకు నేల రాలకపోవడంతో రైతులు కరువు దెబ్బకు చితికిపోతున్నారు. చెరువులు ఎండిపోయాయి. చేలుబీళ్లుగా మారాయి. దీంతో ప్రభుత్వం తూర్పు మండలాలను కూడా క్షామ ప్రాంతంగా ప్రకటించింది. కరువును అంచనా వేయడానికి రెండు రోజుల పర్యటనకు వచ్చిన కేంద్ర బృందానికి అక్కడి రైతులు సమస్యలు ఏకరువు పెట్టారు. ఈ బృందం శుక్రవారం నాగులాపురం, వదరయ్యపాళ్యం, సత్యవేడు మండలాల్లో పర్యటించింది. ఎప్పుడూ లేనివిధంగా తాగునీటికి కూడా ఇబ్బందులకు గురవుతున్నామని ప్రజలు మొరపెట్టుకున్నారు. ఎంత కరువులో అయినా పాడి ఆదుకునేదని.. కానీ సంవత్సరం గ్రాసం కొరత వల్ల పాల ఉత్పత్తి కూడా తగ్గిపోయిందని.. బతికే మార్గం కూడా కనిపించడం లేదని వాపోయారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వలసలు తప్పవని కొందరు రైతులు కరువు బందంతో చెప్పుకున్నారు. అక్కడ చేయలేదు.. మాకేం చేస్తారు.. ప్రతిసారీ కరువు కోర ల్లో చిక్కుకునే పడమర ప్రాంతాలకే ఇప్పటి వరకు ఎలాంటి సహాయం చేయలేదు. ఇక్కడికొచ్చి ఏం చేస్తారని తూర్పు మండలాల రైతులు పెదవి విరుస్తున్నారు. పంటలు లేని ప్రాంతాలు కాకుండా పందిరి పంటలు పండించే రైతుల వద్దకు బందాన్ని తీసుకెళ్లడంపై కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చని ప్రాంతాల్లో బందాన్ని తీసుకెళ్లితే కరువుపై ఎలా అంచనాకు వస్తారని ఆందోళన ప్రశ్నిస్తున్నారు. పడమర మండలాలను కరువు ప్రాంతంగా ప్రకటించినా ఇన్పుట్ సబ్సిడీ, బ్యాంకు రుణం రీషెడ్యూల్, అప్పుపై మారిటోరియం లాంటి వాటిపై ప్రభుత్వం ఇప్పటికీ దష్టి కేంద్రీకరించకపోవడంతో సర్కారు నుంచి సహాయం అందుతుందన్న ఆశ ఏమాత్రం లేదని రైతులు అంటున్నారు. ఇదిలాఉండగా‘ పైర్లుబాగానే ఉన్నట్లున్నాయి.. ఎందుకు కరువు ప్రాంతంగా ప్రకటించారు?’ అని కేంద్ర బందం వ్యవసాయ అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. శుక్రవారం ఉదయం నాగులాపురం మండలం రాజుల కండ్రిగ మండలంలో కరువు అంచనా బందం పర్యటించింది. రైతులతో బంద సభ్యులు మాట్లాడారు. తెలుగుగంగను సద్దికూటిమడుగుకు అనుసంధానం చేస్తే మంచి ఫలితం ఉంటుందని బందానికి రైతులు చెప్పారు.నాగులాపురం మండలం టీపీ కోటలో రైతులతో సమావేశమయ్యారు. గ్రామాల్లో జరుగుతున్న అభివద్ధి పనులు, పంచాయతీల ఆదాయం గురించి తెలుసుకున్నారు.వదయ్యపాళ్యం మండలం టీపీ కోటలో రైతు గోవిందస్వామి నిర్మిస్తున్న పంట సంజీవని గుంటను పరిశీలించారు. పీవీపురంలో అరుదూరు చెరువును పరిశీలించారు. నీరు లేకపోవడంతో గ్రాసం కొరత పీడిస్తోందని రైతులు కరువు బందం దష్టికి తీసుకొచ్చారు. కంచరపాళ్యంలో కూడా రైతులతో మాట్లాడారు. -
సమయమిదే.. స్పందించాలి మరి!
అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్‌ను అత్యంత దారుణంగా కాటేసిన కరువు రక్కసి రబీ సీజన్‌నూ వెంటాడుతోంది. జులై తర్వాత ఒక్కరోజు కూడా సరైన వర్షం కురవకపోవడంతో ‘అనంత’ అతలాకుతలమైంది. పంట తొలగింపు ఖర్చులు కూడా దక్కే పరిస్థితి కనిపించకపోవడంతో కొన్ని చోట్ల వేరుశనగను పశువులు, గొర్రెలకు వదిలేశారు. సాగుకే కాదు.. తాగునీటికీ కటకట మొదలైంది. చలికాలంలోనే తాగునీరు లభించడం కష్టంగా మారింది. అననుకూల వర్షాలు, సుదీర్ఘ వర్షపాత విరామాల (డ్రైస్పెల్స్) కారణంగా ఈ ఖరీఫ్‌లో 6.09 లక్షల హెక్టార్లలో వేరుశనగ దెబ్బతినింది. 1.50 లక్షల హెక్టార్లలో ఇతర పంటలు కూడా 90 శాతం వరకు దెబ్బతిన్నాయి. ఇప్పటికీ వర్షాలు లేకపోవడంతో 1.50 లక్షల హెక్టార్లలో సాగులోకి రావాల్సిన రబీ పంటల విత్తనమే ఆగిపోయింది. ఇంతటి దుర్భర పరిస్థితులు నెలకొన్న ప్రస్తుతం తరుణంలో కరువు పరిశీలనార్థం కేంద్ర బృందాలను జిల్లాకు తీసుకురాగలిగితే దుర్భిక్ష పరిస్థితుల తీవ్రత వారికి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఖరీఫ్, రబీ రెండు సీజన్లకూ సంబంధించి అన్ని పంటల పరిస్థితి, రైతుల స్థితిగతులు వారిని చలింపజేస్తాయనడంలో సందేహం లేదు. తద్వారా జిల్లాకు మేలు కలిగే అవకాశాలూ ఉంటాయి. అలాకాకుండా పంటలన్నీ తొలగించిన తర్వాత, ఎక్కడా పంటలు లేని సమయంలో కరువు బృందాలు పర్యటిస్తే ఒనగూరే ప్రయోజనాలేవీ ఉండవని రైతుసంఘాల నాయకులు చెబుతున్నారు. కరువు నివేదికలు బుట్టదాఖలు జిల్లాకు వచ్చి వెళుతున్న కేంద్ర బృందాలు చేసిన సిఫారసులు కూడా అమలు కావడం లేదు. వారికి ఇచ్చిన కరువు నివేదికలు బుట్టదాఖలవుతూనే ఉన్నాయి. భారత వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్ సారథ్యంలోని 18 మంది నిపుణులతో కూడిన ‘హైపవర్ టెక్నికల్ కమిటీ’ 2012 జనవరి, ఫిబ్రవరి మాసాల్లో రెండు దఫాలుగా జిల్లాలో పర్యటించింది. ఆ కమిటీ చేసిన సిఫారసుల అమలు కోసం రూ.7,676 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన ‘ప్రాజెక్టు అనంత’ కూడా అనతికాలంలోనే కాలగర్భంలో కలిసిపోయింది. 2013 ఏప్రిల్ 18న భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) రాష్ట్ర జనరల్ మేనేజర్ కళ్యాణ చక్రవర్తి నేతృత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారుల బృందం జిల్లాలో పర్యటించింది. తక్షణసాయంగా రూ.1,065 కోట్లు కావాలని జిల్లా అధికారులు కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. 2013 డిసెంబర్లో కేంద్రానికి చెందిన కమిషన్ ఫర్ సెంట్రల్ క్రాప్స్ అండ్ ప్రైసెస్ కమిషనర్ అశోక్‌గులాటే బృందం పర్యటించింది. 2014 ఏప్రిల్ 22, 23 తేదీల్లో ‘ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం’ పేరుతో మరోసారి కేంద్ర బృందం జిల్లాకు వచ్చింది. తక్షణం రూ.1,147.50 కోట్లు అవసరమని జిల్లా అధికారులు నివేదిక అందజేశారు. 2015 ఏప్రిల్ 1న కేంద్ర వ్యవసాయశాఖ జాయింట్ సెక్రటరీ షకీల్‌అహ్మద్ నేతృత్వంలో మరో బృందం పర్యటించగా జిల్లా తరపున రూ.1,404 కోట్లు తక్షణసాయం కావాలని కోరారు. కానీ ఏ ఒక్కసారీ రూపాయి కూడా మంజూరు చేయలేదు. కేంద్ర కరువు, విపత్తు నివారణ కమిషనర్ రాఘవేంద్ర సింగ్, కేంద్ర హార్టికల్చర్ డైరెక్టర్ అతుల్పాట్నేలతో కూడిన మరో బృందం కూడా కరువును పరిశీలించి వెళ్లింది. ఫలితం మాత్రం శూన్యం.