వచ్చారు.. వెళ్లారు.. | The drought group tour ended in the district | Sakshi
Sakshi News home page

వచ్చారు.. వెళ్లారు..

Published Sat, Jun 3 2017 1:07 AM | Last Updated on Mon, Oct 1 2018 2:27 PM

వచ్చారు.. వెళ్లారు.. - Sakshi

వచ్చారు.. వెళ్లారు..

జిల్లాలో ముగిసిన కరువు బృందం పర్యటన
తూర్పు ప్రాంతాన్ని చూసిన కేంద్ర అధికారులు
గతంలో పర్యటించినా వెలువడని నివేదిక
అధికారుల తీరుపై అన్నదాత పెదవి విరుపు


జిల్లాకు మరోసారి కరువు బృందం వచ్చింది. రెండు రోజులపాటు తూర్పు ప్రాంతాన్ని సందర్శించింది. బాధిత రైతులతో మాట్లాడింది. గతంలోనూ ఒక బృందం ఇదేతరహాలో వచ్చి వెళ్లింది. ఇదే పాత్రను పోషించింది. ఏ నివేదికను     సమర్పించిందో తెలి యదు గాని అన్నదాతకు సాయమందలేదు. తాజా బృందం గురువారం వడమాలపేట..నగరి..నారాయణవనం మండలాల్లో పర్యటించింది. శుక్రవారం నాగలాపురం..  వరదయ్యపాళెం మండలాలను సందర్శించింది. తర్వాత నెల్లూరుకు పయనమైంది.

చిత్తూరు:  పచ్చని పైరుతో కళకళలాడే తూర్పు మండలాలు కరువుతో అల్లాడుతున్నాయి. చినుకు నేల రాలకపోవడంతో రైతులు కరువు దెబ్బకు చితికిపోతున్నారు. చెరువులు ఎండిపోయాయి. చేలుబీళ్లుగా మారాయి. దీంతో ప్రభుత్వం తూర్పు మండలాలను కూడా క్షామ ప్రాంతంగా ప్రకటించింది. కరువును అంచనా వేయడానికి  రెండు రోజుల పర్యటనకు వచ్చిన కేంద్ర బృందానికి అక్కడి  రైతులు సమస్యలు ఏకరువు పెట్టారు. ఈ బృందం శుక్రవారం నాగులాపురం, వదరయ్యపాళ్యం, సత్యవేడు మండలాల్లో పర్యటించింది.  ఎప్పుడూ లేనివిధంగా తాగునీటికి కూడా ఇబ్బందులకు గురవుతున్నామని ప్రజలు మొరపెట్టుకున్నారు. ఎంత కరువులో అయినా పాడి ఆదుకునేదని.. కానీ సంవత్సరం గ్రాసం కొరత వల్ల పాల ఉత్పత్తి కూడా తగ్గిపోయిందని.. బతికే మార్గం కూడా కనిపించడం లేదని వాపోయారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వలసలు తప్పవని కొందరు రైతులు కరువు బందంతో చెప్పుకున్నారు.

అక్కడ చేయలేదు.. మాకేం చేస్తారు..
ప్రతిసారీ కరువు కోర ల్లో చిక్కుకునే పడమర ప్రాంతాలకే ఇప్పటి వరకు ఎలాంటి సహాయం చేయలేదు. ఇక్కడికొచ్చి ఏం చేస్తారని తూర్పు మండలాల రైతులు పెదవి విరుస్తున్నారు. పంటలు లేని ప్రాంతాలు కాకుండా పందిరి పంటలు పండించే రైతుల వద్దకు బందాన్ని తీసుకెళ్లడంపై కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చని ప్రాంతాల్లో బందాన్ని తీసుకెళ్లితే కరువుపై ఎలా అంచనాకు వస్తారని ఆందోళన ప్రశ్నిస్తున్నారు. పడమర మండలాలను కరువు ప్రాంతంగా ప్రకటించినా ఇన్‌పుట్‌ సబ్సిడీ, బ్యాంకు రుణం రీషెడ్యూల్, అప్పుపై మారిటోరియం లాంటి వాటిపై ప్రభుత్వం ఇప్పటికీ దష్టి కేంద్రీకరించకపోవడంతో సర్కారు నుంచి సహాయం అందుతుందన్న ఆశ ఏమాత్రం లేదని రైతులు అంటున్నారు. ఇదిలాఉండగా‘ పైర్లుబాగానే ఉన్నట్లున్నాయి.. ఎందుకు కరువు ప్రాంతంగా ప్రకటించారు?’ అని కేంద్ర బందం వ్యవసాయ అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది.

శుక్రవారం ఉదయం నాగులాపురం మండలం రాజుల కండ్రిగ మండలంలో కరువు అంచనా బందం పర్యటించింది.  రైతులతో బంద సభ్యులు మాట్లాడారు. తెలుగుగంగను సద్దికూటిమడుగుకు అనుసంధానం చేస్తే మంచి ఫలితం ఉంటుందని బందానికి రైతులు చెప్పారు.నాగులాపురం మండలం టీపీ కోటలో రైతులతో సమావేశమయ్యారు. గ్రామాల్లో జరుగుతున్న అభివద్ధి పనులు, పంచాయతీల ఆదాయం గురించి తెలుసుకున్నారు.వదయ్యపాళ్యం మండలం టీపీ కోటలో రైతు గోవిందస్వామి నిర్మిస్తున్న పంట సంజీవని గుంటను పరిశీలించారు. పీవీపురంలో అరుదూరు చెరువును పరిశీలించారు. నీరు లేకపోవడంతో గ్రాసం కొరత పీడిస్తోందని రైతులు కరువు బందం దష్టికి తీసుకొచ్చారు. కంచరపాళ్యంలో కూడా రైతులతో మాట్లాడారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement