drum seeder Machine
-
పార్వతీపురం రైతుకు పేటెంట్ మంజూరు చేసిన భారత ప్రభుత్వం
బహుళ పంటలను ఒకేసారి విత్తుకునేందుకు అన్ని విధాలుగా రైతుకు ఉపయోగకరమైన వినూత్న పరికరం (డ్రమ్‌సీడర్)ను రూపొందించిన పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన గ్రామీణ ఆవిష్కర్త దమరసింగి బాబూరావుకు భారత ప్రభుత్వం పేటెంట్ మంజూరు చేసింది. తొలుత ఇనుముతో తయారు చేసిన ఈ పరికరంపై పేటెంట్‌కు 2015లోనే ఆయన దరఖాస్తు చేయగా, ఇటీవలే పేటెంట్ సర్టిఫికెట్ అందింది. తదనంతరం మరింత తేలిగ్గా ఉండాలన్న లక్ష్యంతో స్టెయిన్లెస్ స్టీల్‌తో తక్కువ బరువుతో ఉండేలా, ఎక్కువ కాలం మన్నిక ఉండేలా బాబూరావు దీన్ని మెరుగుపరిచారు. 2 ఎం.ఎం. సైజు నుంచి 16 ఎం.ఎం. సైజు వరకు ఎంత సైజు ఉన్న ఏ పంట విత్తనాలనైనా స్వయంగా రైతే స్వల్ప మార్పులు చేసుకోవటానికి, వరుసల మధ్య దూరాన్ని కూడా అనుకూలంగా సులువుగా మార్చుకోవటానికి ఈ డ్రమ్‌సీడర్ అనువుగా ఉంది. పత్తి, పెసలు, కందులు వంటి మూడు పంటలను ఒకేసారి విత్తుకోవడానికి ఈ ఆధునిక డ్రమ్‌సీడర్ ఉపయోగపడుతుండటం విశేషం. అన్ని రకాల చిరుధాన్యాలు, నువ్వులు, వేరుశనగ, బఠాణి, గోధుమ, వరి, పెసర, మినుము, పుల్లశనగ, పెద్ద బఠాణి, పెద్ద వేరుశనగలను సైతం దీనితో విత్తుకోవచ్చు. దీనికి ఏడు సీడ్ బాక్సులు అమర్చారు. రైతులే మార్పులు చేసుకోవచ్చు 2.5 అడుగులు (30 అంగుళాల) ఎత్తున ఇరువైపులా చక్రాలను అమర్చటం, 6 అంగుళాల వెడల్పు గల చక్రాలను అమర్చటంతో దీన్ని ఉపయోగించటం సులువు. పెద్ద చక్రాలను ఏర్పాటు చేయటం, పంటను బట్టి విత్తనం సైజును బట్టి, వరుసల మధ్య దూరాన్ని బట్టి మార్పులు చేసుకోవడానికి చక్రాలను ఇప్పి మార్పులు చేయాల్సిన అవసరం లేకుండా రెండు స్క్రూలు ఇప్పితే చాలు అవసరమైన మార్పులు మెకానెక్ అవసరం లేకుండా రైతే స్వయంగా చేసుకోవచ్చని, అందుకే ఈ డ్రమ్‌సీడర్ తక్కువ కాలంలోనే రైతుల ఆదరణ పొందిందని బాబూరావు ‘సాక్షి’తో చెప్పారు. నాలుగు వేరియంట్లు ఎకనామిక్ మల్టీపర్పస్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్ అని పిలుస్తున్నారు. ఇందులో నాలుగు వేరియంట్లను బాబూరావు రైతులకు అందుబాటులోకి తెచ్చారు. పొలంలో యంత్రాలు అవసరం లేకుండా ఇద్దరు మనుషులు సులువుగా లాగుతూ విత్తనాలు వేసుకునే విధంగా, జోడెడ్లకు కట్టి లాక్కెళ్లేలా, ట్రాక్టర్‌కు వెనుక బిగించే విధంగా, 6.5 హెచ్‌పి హోండా ఇంజన్‌తో అనుసంధానం చేసి ఒక మనిషి నడిపే విధంగా స్టెయిన్లెస్ స్టీల్‌తో డ్రమ్సీడర్లను ఆయన రూపొందించారు. వేరియంట్‌ను బట్టి దాని ధర, బరువు ఆధారపడి ఉంటుంది. మనుషులు లక్కెళ్లే దాని బరువు 25 కిలోలు ఉంటుంది. ట్రాక్టర్‌కు అనుసంధానం చేసేది 80 కిలోల బరువు ఉంటుంది. ‘ఆంగ్రూ’ పోషణ్ ఇంక్యుబేషన్ సెంటర్ బాబూరావుకు రూ. 4 లక్షల గ్రాంటు ఇవ్వటం విశేషం. పల్లెసృజన తోడ్పాటుతో రాష్ట్రపతి భవన్‌లోని ఇన్నోవేషన్ ఫెస్టివల్‌తో పాటు అనేక మేళాల్లో బాబూరావు (94409 40025) ఈ డ్రమ్‌సీడర్‌ను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. ప్రకృతి సేద్యంపై ఎన్‌ఐపిహెచ్‌ఎం సర్టిఫికెట్ కోర్సు ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం చేపట్టదలచిన/ చేపట్టిన కనీసం ఇంటర్ చదివిన యువతకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖకు అనుబంధ సంస్థ, హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని జాతీయ మొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ (ఎన్‌ఐపిహెచ్‌ఎం) సర్టిఫికెట్ కోర్సు నిర్వహించనుంది. ‘ప్రకృతి/సేంద్రియ వ్యవసాయంలో మొక్కల ఆరోగ్య యాజమాన్యం’ పేరుతో వచ్చే డిసెంబర్ నుంచి 3 నెలల సర్టిఫికెట్ కోర్సులో శిక్షణ ఇస్తారు. కోర్సు కాలపరిమితి డిసెంబర్ 6 నుంచి 2014 మార్చి 13 వరకు. యువతీ యువకులకు శిక్షణ ఇవ్వటం ద్వారా గ్రామస్థాయిలో మాస్టర్ ట్రైనర్లను తయారు చేయటం ఈ సర్టిఫికెట్ కోర్సు లక్ష్యం. తరగతి గదిలో పాఠాలతో పాటు పొలంలో పని చేస్తూ నేర్చుకునే పద్ధతులు కూడా ఈ కోర్సులో భాగం చేశారు. ఇంటర్ పూర్తి చేసిన లేదా వ్యవసాయ పాలిటెక్నిక్ పూర్తి చేసిన 18 ఏళ్లు నిండిన గ్రామీణ యువతకు ఈ కోర్సు అభ్యర్థుల ఎంపికలో ప్రాధాన్యం ఇస్తారు. కోర్సు ఫీజు రూ. 7,500. ఎన్‌ఐపిహెచ్‌ఎంలో ఉండి శిక్షణ పొందే రోజుల్లో ఉచిత వసతి కల్పిస్తారు. భోజన ఖర్చులు అభ్యుర్థులే భరించాల్సి ఉంటుంది. కోర్సు డైరెక్టర్‌గా డా. ఒ.పి. శర్మ వ్యవహరిస్తున్నారు. ఇతర వివరాలకు కోర్సు కోఆర్డినేటర్ డా. కె. దామోదరాచారి (95426 38020)ని సంప్రదించవచ్చు. నవంబర్ 20లోగా ఫీజు చెల్లించి, దరఖాస్తులు పంపాలి. డిసెంబర్ 22 నుంచి ఏపీ పుష్ప ప్రదర్శన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి నాలుగో పుష్ప ప్రదర్శన, అమ్మకం కార్యక్రమాన్ని డిసెంబర్ 22 నుంచి 27 వరకు జరగనుంది. విజయవాడలోని (పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు) సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజి గ్రౌండ్లో జరుగుతుంది. వివరాలకు.. 93935 77018. -
డ్రమ్ సీడర్ పద్ధతిలో వరి సాగు...!
-
రైతు నేస్తం డ్రమ్ సీడర్
అన్ని సమస్యలకు పరిష్కారం ఈ యంత్రం ఖర్చు తక్కువ.. లాభమెక్కువ రెండు గంటల్లో ఎకరం పొలంలో విత్తుకోవచ్చు వరి విత్తనాలేసే కొత్త పరికరమే డ్రమ్ సీడర్ విత్తనాలు...సమయం ఆదా పరిగి: రోజురోజుకు తగ్గుతున్న నీటి వనరులు...తలెత్తుతున్న కూలీల కొరత...పెరుగుతున్న సాగు వ్యయం... సమయానికి కురవని వర్షాలు... ఎండుతున్న నారుమళ్లు.. ఏడిపిస్తున్న కరంటు సమస్యలు ఇలా వరి పంటను సాగు చేయాలనుకునే రైతన్నను రోజుకో కొత్త సమస్య చుట్టుముడుతున్నారుు. ఈ నేపథ్యంలో అన్ని సమస్యలకు వరి విత్తనాలు నాటే కొత్త యంత్రం (డ్రమ్ సీడర్) పరిష్కారం చూపిస్తుందంటున్నారు వ్యవసాయ శాస్తవ్రేత్తలు, వ్యవసాయ అధికారులు. వరి పంట అధికంగా పండించే పరిగి ప్రాంతంలో కరెంటు, వర్షాభావం తదితర సమస్యలతో నార్లు పోసుకోలేక, సమయానికి రైతులు వరినాట్లు వేసుకోలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో డ్రమ్‌సీడర్ చాలావరకు సమస్యకు పరిష్కారం చూపించగలదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో డ్రమ్ సీడర్‌తో వరి విత్తే విధానంపై ఏడీఏ నగేష్‌కుమార్ రైతులకు సలహాలు అందిస్తున్నారు. డ్రమ్‌సీడర్ ప్రత్యేకతలు... డ్రమ్‌సీడర్ ప్లాస్టిక్‌తో తయారు చేయబడిన వరి విత్తనాలు విత్తుకునే తేలికై న యంత్రం. ఇది కేవలం ఎనిమిది కిలోలు బరువు ఉంటుంది. ఈ యంత్రాన్ని ఒకే వ్యక్తి సులువుగా ఎక్కడికై నా తీసుకు వెళ్లవచ్చు. ఈ యంత్రానికి నాలుగు ప్లాస్టిక్ డ్రమ్ములు ఉంటారుు. ప్రతి డ్రమ్ముకు 20 సెంటీమీటర్ల దూరంలో రెండు రంధ్రాలుంటారుు. ఈ డ్రమ్ముల్లో వరిగింజలు రాలడానికి వీలుగా మూడోవంతు మాత్రమే నింపాలి. వరి విత్తనాలు నింపిన డ్రమ్‌సీడర్‌ను ఇద్దరు పట్టుకుని లాగితే వరుసకు వరుసకు మధ్య 20 సెంటీమీటర్ల వెడల్పుతో ఒకేసారి ఎనిమిది వరుసల్లో విత్తనాలు పడతారుు. వరుసలో కుదురుకు కుదురుకు మధ్య 5నుంచి 8 సెంటీమీటర్ల వ్యత్యాసం ఉంటుంది. ఒక్కో కుదురులో ఐదునుంచి ఎనిమిది విత్తనాలు రాలుతాయి. ఈ డ్రమ్‌సీడర్‌తో ఇద్దరు వ్యక్తులను ఉపయోగించి రెండుగంటల వ్యవధిలో ఎకరం పొలంలో వరి విత్తనాలు విత్తుకునే వీలుంటుంది. అనేక ఉపయోగాలు... ఎక్కువగా కూలీలు అవసరం లేకుండానే రైతులు ఇద్దరు వ్యక్తుల సహాయంతో మొక్క దశలోనే వరి విత్తనాలను విత్తుకునే అవకాశం ఉంది. నారు ముదిరి పోవడం, సమయానికి కూలీలు దొరకక పోవటం, తదితర సమస్యలు లేకుండానే సకాలంలో ఇంకొకరిపై అధారపడకుండా విత్తనాలు విత్తుకునే వెసులుబాటు కలుగుతుంది. నారు వేయించేందుకు ఎకరానికి రూ.రెండువేల వరకు కూలీల ఖర్చు వస్తుండగా దీంతో కేవలం రెండు గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులతో ఎకరం పొలంలో విత్తనాలు వేసుకోవచ్చు. డ్రమ్‌సీడర్‌తో విత్తనాలు వేసుకుంటే ఏ రకమైన వరైన వారం నుంచి పది రోజులు ముందుగా కోతకు వస్తుంది. ఎకరానికి కేవలం 8 నుంచి 10 కిలోల విత్తనాలు మాత్రమే సరిపోతాయి. తద్వారా విత్తనాలు కూడా ఆదా అవుతారుు. ఖరీఫ్, రబీ సీజన్లలోనూ వరి విత్తనాలను విత్తుకునేందుకు డ్రమ్‌సీడర్ పద్ధతిని ఉపయోగించవచ్చు. విత్తే విధానం... సాధారణ సాగుకు దున్నినట్లే పొలాన్ని దున్నుకోవాలి. పొలమంతా సమానంగా ఉండేట్లు చూసుకోవాలి. విత్తన రకాన్ని బట్టి ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలను తీసుకుని నాన బెట్టుకోవాలి. పెద్దగా మొలకలు వస్తే డ్రమ్‌సీడర్ నుంచి కిందకు రాలవు. కాబట్టి విత్తు పగిలి మొలకలు వచ్చే వరకే విత్తనాలను నానబెట్టు కోవాలి. 24 గంటలు తగిన మోతాదులో నీళ్లుపోసి మండెకట్టి మొలకలు వచ్చేవరకు మత్రమే నానబెట్టాలి. విత్తనాలు విత్తే సమయంలో పొలంలో నీరు లేకుండా బురదగా ఉండేట్లు చూసుకోవాలి. విత్తే ముందు విత్తనాలను ఖచ్చితంగా విత్తనశుద్ధి చేసుకోవాలి. కిలో విత్తనానికి ఒక గ్రాము కార్బండిజం పొడిని నీటిలో కలిపి విత్తనాలను 24 గంటలు నానబెట్టుకోవాలి. అనంతరం విత్తనాలకు నిద్రావస్తను తొలగించేందుకు 24 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. 50 శాతం రాయితీపై లభ్యం... మిగతా వ్యవసాయ యంత్ర పరికరాల్లాగే డ్రమ్సీడర్లను కూడా వ్యవసాయ శాఖ అధికారులు 50 శాతం రాయితీపై అందిస్తున్నారు. ఒక డ్రమ్‌సీడర్ విలువ రూ.4 వేలు ఉండగా దాన్ని రారుుతీపై రూ.రెండు వేలకు అందజేస్తున్నారు. డ్రమ్ సీడర్ ద్వారా విత్తనాలు విత్తుకున్న పొలంలో కలుపు తీసేందుకు కూడా యంత్రాలను వినియోగించవచ్చు. స్టార్ వీడర్ అనే యంత్రాన్ని సైతం 50 శాతం రారుుతీపై అందజేస్తున్నారు. స్టార్వీడర్ ధర 1400 రూపాయలు ఉండగా దీన్ని రాయితీపై రూ.700కు అందజేస్తున్నారు.