రైతు నేస్తం డ్రమ్ సీడర్
అన్ని సమస్యలకు పరిష్కారం ఈ యంత్రం
ఖర్చు తక్కువ.. లాభమెక్కువ
రెండు గంటల్లో ఎకరం పొలంలో విత్తుకోవచ్చు
వరి విత్తనాలేసే కొత్త పరికరమే డ్రమ్ సీడర్
విత్తనాలు...సమయం ఆదా
పరిగి: రోజురోజుకు తగ్గుతున్న నీటి వనరులు...తలెత్తుతున్న కూలీల కొరత...పెరుగుతున్న సాగు వ్యయం... సమయానికి కురవని వర్షాలు... ఎండుతున్న నారుమళ్లు.. ఏడిపిస్తున్న కరంటు సమస్యలు ఇలా వరి పంటను సాగు చేయాలనుకునే రైతన్నను రోజుకో కొత్త సమస్య చుట్టుముడుతున్నారుు. ఈ నేపథ్యంలో అన్ని సమస్యలకు వరి విత్తనాలు నాటే కొత్త యంత్రం (డ్రమ్ సీడర్) పరిష్కారం చూపిస్తుందంటున్నారు వ్యవసాయ శాస్తవ్రేత్తలు, వ్యవసాయ అధికారులు. వరి పంట అధికంగా పండించే పరిగి ప్రాంతంలో కరెంటు, వర్షాభావం తదితర సమస్యలతో నార్లు పోసుకోలేక, సమయానికి రైతులు వరినాట్లు వేసుకోలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో డ్రమ్‌సీడర్ చాలావరకు సమస్యకు పరిష్కారం చూపించగలదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో డ్రమ్ సీడర్‌తో వరి విత్తే విధానంపై ఏడీఏ నగేష్‌కుమార్ రైతులకు సలహాలు అందిస్తున్నారు.
డ్రమ్‌సీడర్ ప్రత్యేకతలు...
డ్రమ్‌సీడర్ ప్లాస్టిక్‌తో తయారు చేయబడిన వరి విత్తనాలు విత్తుకునే తేలికై న యంత్రం. ఇది కేవలం ఎనిమిది కిలోలు బరువు ఉంటుంది. ఈ యంత్రాన్ని ఒకే వ్యక్తి సులువుగా ఎక్కడికై నా తీసుకు వెళ్లవచ్చు. ఈ యంత్రానికి నాలుగు ప్లాస్టిక్ డ్రమ్ములు ఉంటారుు. ప్రతి డ్రమ్ముకు 20 సెంటీమీటర్ల దూరంలో రెండు రంధ్రాలుంటారుు. ఈ డ్రమ్ముల్లో వరిగింజలు రాలడానికి వీలుగా మూడోవంతు మాత్రమే నింపాలి. వరి విత్తనాలు నింపిన డ్రమ్‌సీడర్‌ను ఇద్దరు పట్టుకుని లాగితే వరుసకు వరుసకు మధ్య 20 సెంటీమీటర్ల వెడల్పుతో ఒకేసారి ఎనిమిది వరుసల్లో విత్తనాలు పడతారుు. వరుసలో కుదురుకు కుదురుకు మధ్య 5నుంచి 8 సెంటీమీటర్ల వ్యత్యాసం ఉంటుంది. ఒక్కో కుదురులో ఐదునుంచి ఎనిమిది విత్తనాలు రాలుతాయి. ఈ డ్రమ్‌సీడర్‌తో ఇద్దరు వ్యక్తులను ఉపయోగించి రెండుగంటల వ్యవధిలో ఎకరం పొలంలో వరి విత్తనాలు విత్తుకునే వీలుంటుంది.
అనేక ఉపయోగాలు...
ఎక్కువగా కూలీలు అవసరం లేకుండానే రైతులు ఇద్దరు వ్యక్తుల సహాయంతో మొక్క దశలోనే వరి విత్తనాలను విత్తుకునే అవకాశం ఉంది. నారు ముదిరి పోవడం, సమయానికి కూలీలు దొరకక పోవటం, తదితర సమస్యలు లేకుండానే సకాలంలో ఇంకొకరిపై అధారపడకుండా విత్తనాలు విత్తుకునే వెసులుబాటు కలుగుతుంది. నారు వేయించేందుకు ఎకరానికి రూ.రెండువేల వరకు కూలీల ఖర్చు వస్తుండగా దీంతో కేవలం రెండు గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులతో ఎకరం పొలంలో విత్తనాలు వేసుకోవచ్చు. డ్రమ్‌సీడర్‌తో విత్తనాలు వేసుకుంటే ఏ రకమైన వరైన వారం నుంచి పది రోజులు ముందుగా కోతకు వస్తుంది. ఎకరానికి కేవలం 8 నుంచి 10 కిలోల విత్తనాలు మాత్రమే సరిపోతాయి. తద్వారా విత్తనాలు కూడా ఆదా అవుతారుు. ఖరీఫ్, రబీ సీజన్లలోనూ వరి విత్తనాలను విత్తుకునేందుకు డ్రమ్‌సీడర్ పద్ధతిని ఉపయోగించవచ్చు.
విత్తే విధానం...
సాధారణ సాగుకు దున్నినట్లే పొలాన్ని దున్నుకోవాలి. పొలమంతా సమానంగా ఉండేట్లు చూసుకోవాలి. విత్తన రకాన్ని బట్టి ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలను తీసుకుని నాన బెట్టుకోవాలి. పెద్దగా మొలకలు వస్తే డ్రమ్‌సీడర్ నుంచి కిందకు రాలవు. కాబట్టి విత్తు పగిలి మొలకలు వచ్చే వరకే విత్తనాలను నానబెట్టు కోవాలి. 24 గంటలు తగిన మోతాదులో నీళ్లుపోసి మండెకట్టి మొలకలు వచ్చేవరకు మత్రమే నానబెట్టాలి. విత్తనాలు విత్తే సమయంలో పొలంలో నీరు లేకుండా బురదగా ఉండేట్లు చూసుకోవాలి. విత్తే ముందు విత్తనాలను ఖచ్చితంగా విత్తనశుద్ధి చేసుకోవాలి. కిలో విత్తనానికి ఒక గ్రాము కార్బండిజం పొడిని నీటిలో కలిపి విత్తనాలను 24 గంటలు నానబెట్టుకోవాలి. అనంతరం విత్తనాలకు నిద్రావస్తను తొలగించేందుకు 24 గంటల పాటు నీటిలో నానబెట్టాలి.
50 శాతం రాయితీపై లభ్యం...
మిగతా వ్యవసాయ యంత్ర పరికరాల్లాగే డ్రమ్‌సీడర్లను కూడా వ్యవసాయ శాఖ అధికారులు 50 శాతం రాయితీపై అందిస్తున్నారు. ఒక డ్రమ్‌సీడర్ విలువ రూ.4 వేలు ఉండగా దాన్ని రారుుతీపై రూ.రెండు వేలకు అందజేస్తున్నారు. డ్రమ్ సీడర్ ద్వారా విత్తనాలు విత్తుకున్న పొలంలో కలుపు తీసేందుకు కూడా యంత్రాలను వినియోగించవచ్చు. స్టార్ వీడర్ అనే యంత్రాన్ని సైతం 50 శాతం రారుుతీపై అందజేస్తున్నారు. స్టార్‌వీడర్ ధర 1400 రూపాయలు ఉండగా దీన్ని రాయితీపై రూ.700కు అందజేస్తున్నారు.