దిగ్విజయ్‌కు డీఎస్ షాక్ !
హైదరాబాద్ : ఏఐసీసీ ప్రధానకార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌పై అసంతృప్తితో ఉన్న పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మరోసారి షాక్ ఇచ్చారు. గాంధీభవన్‌లో ఆదివారం జరిగిన పీవీ నరసింహారావు జయంతి కార్యక్రమానికి డీఎస్ హాజరు కాలేదు. శాసనమండలి టికెట్ రాకపోవడానికి మీరే కారణమని డీఎస్ అసంతృప్తితో ఉన్నారని, అందుకే ఆయన ఈ సమావేశానికి హాజరుకాలేదని అక్కడ ఉన్న పీసీసీ నేతలు దిగ్విజయ్‌కు చెప్పారు.
దీంతో డీఎస్ ఇంటికి పోదామని, ఫోన్ కలిపి ఇవ్వాలని పీసీసీ ప్రొటోకాల్ విభాగానికి చెందిన నేతకు ఆయన సూచించారు. వెంటనే డీఎస్‌కు ఆ నాయకుడు ఫోన్ చేశారు. దిగ్విజయ్ మాట్లాడతారని చెప్పగానే.. డీఎస్ విముఖత వ్యక్తం చేశారు. పార్టీకి కీలకమైన ఈ సమయంలో తీరని నష్టం చేసిన దిగ్విజయ్‌తో ఫోన్లో మాట్లాడటం కూడా ఇష్టంలేదని, ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వస్తాడని డీఎస్ ఘాటుగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో చేసేదేమీలేక దిగ్విజయ్ మౌనం వహించారు.