ఖేలో ఇండియాతో క్రీడాభివృద్ధి
– డీఎస్డీఓ లక్ష్మినారాయణశర్మ
కడప స్పోర్ట్స్: ఖేలో ఇండియా పథకం క్రీడల అభివృద్ధికి దోహదం చేస్తుందని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి లక్ష్మినారాయణశర్మ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని వైఎస్ఆర్ క్రీడాపాఠశాలలో జిల్లాస్థాయి ఖేలో ఇండియా క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్డీఓ మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లకు జిల్లాస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ నెలలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం ఫుట్‌బాల్, వాలీబాల్, తైక్వాండో క్రీడాంశాల్లో అండర్–14, అండర్–17 విభాగాల్లో బాలబాలికలకు పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్ఏ కోచ్‌లు గౌస్‌బాషా, షఫీ, సిబ్బంది అక్బర్, సూర్యనారాయణరాజు, మార్కర్బాషా, క్రీడాపాఠశాల కోచ్‌లు చంద్రమోహన్, తైక్వాండో అసోసియేషన్ కోశాధికారి విజయభాస్కర్‌రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.