కట్నం వేధింపులకు ముగ్గురి బలి
వేర్వేరు చోట్ల ఘటనలు
వర్ధన్నపేటలో క్రిమి సంహారక మందు తాగి వివాహిత ఆత్మహత్య
వర్ధన్నపేట టౌన్ : అదనపు కట్నం కోసం అత్తవారింటి వేధింపులు ఓ యువతి ప్రాణాలను బలిగొన్న సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వర్ధన్నపేట ఎస్సై ఉపేందర్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన తొర్రి కుమారస్వామి, రజిత దంపతుల కూతు రు వీణ(20)ను జఫర్గడ్ మండలం గర్మిళ్లపెల్లికి చెందిన పిడుగు కేతమ్మ లక్ష్మయ్య దంపతుల కుమారుడు వేణుగోపాల్‌కు ఇచ్చి ఏడాదిన్నర క్రితం కట్న కానుకలు ఇచ్చి వైభవంగా పెళ్లి చేశారు. పెళ్లి అనంతరం నాలుగు నెలలు సజావుగా కాపురం సాగింది. ఆ తర్వాత భర్త, బావ మరిది అదనపు కట్నం తేవాలంటూ వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. దీంతో పంచాయతీ పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. వారు ఇద్దరికి నచ్చజెప్పి కాపురానికి పంపించారు. ఈ క్రమంలో వేణుగోపాల్ తాను హైదరాబాద్‌కు వెళ్లి ఉద్యోగం చేస్తానని, భార్య వీణను డిగ్రీ పూర్తి చేయమని ఆమె తల్లి వద్దకు పంపించాడు. హన్మకొండలో హాస్టల్లో ఉంటూ హన్మకొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం కోర్సు చదువుతోంది. రెండు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లి వచ్చింది. అప్పటి నుంచి ఎవరితోనూ పెద్దగా మాట్లాడటం లేదు. భర్త వేణుగోపాల్ శుక్రవారం ఉదయం వీణకు ఫోన్ చేసి సుమారు ఓ గంట సేపు అదనపు కట్నం కోసం మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం తల్లిదండ్రులు కుమారస్వామి, రజిత వ్యవసాయ పనులకు వెళ్లగా, మృ తురాలి సోదరుడు ఇంటికి వచ్చే సరికి వీణ క్రిమిసంహారక మందు తాగి అపస్మా ర స్థితికి చేరుకుంది. ఆమెను హుటాహుటిన స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలిస్తుండగా వీణ మృతిచెందింది. మృతురాలి తల్లి రజిత ఫిర్యాదు మేరకు శవ పంచనామా నిర్వహించారు. మృతురాలి భర్త వేణుగోపాల్, తండ్రి లక్ష్మయ్య, తల్లి కేతమ్మ, సోదరులు రాజు, రంజిత్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జయ్యారంలో ఇంకొకరు..
మరిపెడ: అత్తవారింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత(21) ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని జయ్యారంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. జయ్యారం గ్రామానికి చెందిన ఎసల్ల పద్మ, వెంకన్న దంపతుల కూతురు యమున, అదే గ్రామానికి చెందిన నరిగె యాకమ్మ కుమారుడు సంపత్‌కు పెద్దల అంగీకారంతో ఆరు నెలల క్రితం ప్రేమవివాహం జరిగింది. కాగా, యమున తల్లిదండ్రులు తమ స్తోమతకు తగిన విధంగా అబ్బాయికి కట్నకానుకలు ఇచ్చారు. వివాహం అనంతరం సంపత్ కుటుంబసభ్యులు వరకట్నం తేవాలంటూ యమునను వేధించసాగారు. దీంతో ఆమె గత నెల 27న ఇంట్లో ఉరి వేసుకుంది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఖమ్మం, వరంగల్ ఆస్పత్రులకు ఆమెను తరలించినా ఆరోగ్యం మెరుగుపడలేదు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యమున మృతిచెందింది. దీనిపై స్థానిక పోలీస్‌స్టేçÙన్లో ఫిర్యాదు చేయనున్నట్లు మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు.
కోగిల్వాయిలో మరొకరు..
ఆత్మకూరు : అదనపు కట్నం వే«ధింపులు తాళలేక ఓ వివాహిత పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని కోగిల్వాయిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హసన్పర్తికి చెందిన మేడం నందం–పద్మ దంపతుల కుమార్తె కవిత (26)ను మండలంలోని కోగిల్వాయికిచెందిన సుధీర్‌కు ఇచ్చి 9 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఓ కుమార్తె, కుమారుడు జన్మిం చారు. ఐదేళ్లదాకా కాపురం బాగానే సాగింది. గత నాలుగేళ్లుగా భర్త, అత్తమామలు, కుటుంబసభ్యులు అదనపు కట్నం కావాలని వేధిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేక శనివారం ఉదయం కవిత పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా గమనించిన బంధువులు చికిత్సనిమిత్తం ఎంజీఎంకు తరలిస్తుండగా మృతిచెందింది. ఆత్మకూరు ఎస్ఐ విఠల్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.