'నకిలీ బంగారం అమ్మి పోలీసుల కస్టడీకి'
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ కడప జిల్లా కేంద్రంలో నకిలీబంగారం కేసులో ఓ మహిళ, మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు చింత కొమ్మదిన్నె సీఐ యుగంధర్ తెలిపారు. బంగారు నగలు అంటూ పలువురికి నకిలీ నగలు అంటగట్టారు. వీరి దగ్గర నుంచి నగలు కొన్న పలువురు అవి నకిలీవి అని ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.95 వేల నగదు, 4 నకిలీ బంగారపు గాజులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.