Durantho express
-
ప్రయాణీకులకు షాకిచ్చిన ఐఆర్సీటీసీ
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ బోర్డు భారీ షాకిచ్చింది. పర్యాటక, క్యాటరింగ్ రైల్వే బోర్డు డైరెక్టర్ గురువారం విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం, రాజధాని, శాతాబ్ది, దురంతో ఎక్స్‌ప్రెస్‌లలో టీ, టిఫిన్, భోజనం రేట్లను పెంచింది. నవంబర్ 14 నుంచి రాజధాని / శతాబ్ది /దురంతో రైళ్లలో ప్రామాణిక భోజనంపై క్యాటరింగ్ సేవల రేట్లను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) విడుదల చేసిన ఒక సర్క్యులర్‌లో తెలిపింది. కొత్త మెనూ, రేట్లు టికెటింగ్ విధానంలో 15 రోజుల తరువాత అందిస్తామని, పెంచిన రేట్లు సర్క్యులర్ జారీ చేసిన తేదీ నుండి 120 రోజుల తరువాత వర్తిస్తాయని తెలిపింది. రేట్ల సవరణ తరువాత రాజధాని, దురంతో, శాతాబ్డి ఎక్స్‌ప్రెస్‌లలో ఒక కప్పు టీ ధర రూ .10 నుండి రూ .15 కు పెంచారు. అదే స్లీపర్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏసీ బోగీల్లో అయితే టీ ధర రూ .20. ఇక భోజనం విషయానికొస్తే, దురంతో ఎక్స్‌ప్రెస్ స్లీపర్ క్లాస్‌లో లంచ్/ డిన్నర్‌కు రూ. 120 రూపాయిలు చెల్లించాల్సిందే. మునుపటి ధర. రూ.80. ఈ రైళ్లలో సాయంత్రం వేళలో ఫస్ట్ క్లాస్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో టీ ధర రూ.35 (రూ .6 పెంపు) అల్పాహారం రూ. 140, (రూ .7 పెంపు) లంచ్ డిన్నర్ రూ .245 (రూ .15 పెరిగింది) -
దురంతో ఎక్స్‌ప్రెస్‌లో లగేజీల చోరీ
సికింద్రాబాద్: బెంగుళూరు నుంచి విశాఖపట్టణం వెళుతున్న దురంతో ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం ఉదయం చోరీ జరిగింది. పలు బోగీల్లో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు వారికి సంబంధించిన లగేజి బ్యాగులను దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ విషయం ఉదయం గమనించిన ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. -
కర్ణాటకలో ఘోర రైలు ప్రమాదం
-
కర్ణాటకలో ఘోర రైలు ప్రమాదం
-పట్టాలు తప్పిన సికింద్రాబాద్- ముంబై (కుర్లా) ఎల్టీటీ దురంతో ఎక్ప్ ప్రెస్ రైలు - ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు - సహాయక చర్యల్లో ఆలస్యం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కర్ణాటకలో శనివారం తెల్లవారుజామున రైలుప్రమాదం సంభవించింది. రాత్రి 11.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన సికింద్రాబాద్-ముంబై ఎల్టీటీ దురంతో ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ షాహబాద్ స్టేషన్ దాటిన తర్వాత తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో మార్టూర్ వద్ద 9 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందగా, పలువురు తీవ్రగాయాలయినట్టు రైల్వే అధికారులు తెలిపారు.110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ నుంచి కుర్లా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం తెలిసిన వెంటనే రైల్వే శాఖ సహాయక బృందాలు ప్రమాద స్థలికి పరుగుతీశాయి. అయితే అర్థరాత్రి చిమ్మచీకటి కావడంతో సహాయచర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. శిథిలాల్లో ఇరుక్కుపోయినవారి ఆర్తనాదాలు, తమవారు ఎక్కడున్నారో తెలియక పలువురు ప్రయాణికులు రోదించడం అక్కడ కనిపించినట్లు రైల్వే అధికారులు చెప్పారు. ఈ ప్రమాదం కారణంగా చెన్నై, ముంబై సికింద్రాబాద్ ప్రధాన రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం రిస్క్యూ టీం, రైల్వే పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాగా ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.