తమ్ముళ్ల దాష్టికానికి వ్యక్తి ఆత్మహత్య
అనంతపురం: ఏపీలో తెలుగు తమ్ముళ్ల ఆకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమకు ఎవరైనా అడ్డొస్తే చావబాదుతున్నారు. పోలీసులు సైతం వారికి అండగా పలు అనుమానాలకు తావిస్తోంది. ఇందుకు నిదర్శనంగా తాజాగా అనంతపురం జిల్లాలోని శెట్టురు పోలీస్ స్టేషన్ వద్ద విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. ఆ వివరాలిలా ఉన్నాయి.. దుర్గేశ్ అనే వ్యక్తి కిమిడిపల్లెలో టీడీపీ కార్యకర్త నిర్వహిస్తున్న బెల్టుషాపు వివరాలపై గతంలో ఫిర్యాదు చేశాడు.
దీంతో బెల్టు షాపుపై ఫిర్యాదు చేసినందుకు కొన్ని రోజుల అనంతరం దుర్గేశ్ పై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు బాధితుడు వెళ్లగా ఫిర్యాదు నమోదుకు పోలీసులు నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన బాధితుడు దుర్గేశ్ శెట్టురు పోలీస్ స్టేషన్ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలోనే దుర్గేశ్ చనిపోయాడు.