శక్తిమంతమైన వస్తువుల వల్లే విమానం కూలింది
మలేసియా విమానం కూల్చివేతపై నిపుణుల నివేదిక
ద హేగ్(నెదర్లాండ్స్): ఉక్రెయిన్లో జూలై 17న 298 మందితో ప్రయాణిస్తున్న మలేసియా విమానం శక్తిమంతమైన వస్తువులు ఢీకొట్టడం వల్లే నేలకూలిందని డచ్ నిపుణుల కమిటీ ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. ఆ విమానాన్ని క్షిపణితోనే కూల్చివేశారన్న వాదనకు మంగళవారం డచ్ భద్రతా మండలి సమర్పించిన ఈ నివేదికతో మరింత బలం చేకూరినట్లైంది. విమానం బ్లాక్బాక్సుల సమాచారం, ఫొటోలు, వీడియోల ఆధారంగా ప్రాథమికంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు కమిటీ తెలిపింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. విమానాన్ని బయటి నుంచి బలమైన వస్తువులు ఢీకొట్టడం వల్లే కూలినట్లు తెలుస్తోందని, తుది నివేదికను 2015, జూలై నాటికి అందజేస్తామని కమిటీ వెల్లడించింది.