డా.రెడ్డీస్‌కు యూఎస్ఎఫ్డీఏ షాక్
హైదరాబాద్: దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ రెగ్యులేటరీ భారీ షాకిచ్చింది. దీంతో గురువారం నాటి మార్కెట్లో ఈ షేరు భారీగా నష్టపోతోంది. సంస్థకు చెందిన విశాఖపట్టణం స్పెషల్ ఎకనామిక్ జోన్ లోని దువ్వాడ అంకాలజీ ప్లాంటులో యూఎస్ఎఫ్డీఏ 13 లోపాలను(అబ్జర్వేషన్స్) గుర్తించారన్న వార్తలతో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో ఈ కౌంటర్లో్ అమ్మకాలకు తెరలేచింది. దాదాపు 4.2 శాతానికిపై నష్టపోయి 52 వారాల కనిష్టాన్ని నమోదు చేసింది.
వైజాగ్‌కు సమీపంలోని దువ్వాడ ఫార్ములేషన్ల తయారీ ప్లాంటులో తనిఖీలు నిర్వహించిన అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ 13 అబ్జర్వేషన్స్‌తో కూడిన ఫామ్ 483ని జారీ చేసింది. ఈ సమాచారాన్ని డాక్టర్ రెడ్డీస్ బీఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపింది. అలాగే వీటిని సరిదిద్దే చర్యలు చేపట్టినట్లు తెలియజేసింది. దిద్దుబాటు చర్య ప్రణాళిక తో వ్రాతపూర్వకంగా స్పందించనున్నామని, త్వరలోనే దీన్ని అమలు చేయనున్నామని చెప్పింది.
మరోవైపు రాష్ట్రంలోని మరో ముఖ్యమైన శ్రీకాకుళంప్లాంట్‌లో ఏప్రిల్ రెండవ వారంలో యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు చేపట్టనుంది. కాగా ఈ స్టాక్ గత నెలలో 8 శాతం పైగా క్షీణించింది.