లక్ష ఉద్యోగాలు ఇచ్చే వరకు పోరాటం
ఏఎస్‌రావునగర్(హైదరాబాద్‌సిటీ) : తెలంగాణ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు ఇచ్చే వరకు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) పోరాటం కోనసాగుతుందని సంస్థ రాష్ట్ర అధ్యక్షులు కె. విజయ్‌కుమార్ స్పష్టం చేసారు. మంగళవారం కమలానగర్‌లోని డీవైఎఫ్ఐ కార్యాలయంలో జరిగిన డీవైఎఫ్ఐ కాప్రా జోన్ మహసభకు ముఖ్యఅతిధిగా హజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ కాప్రా జోన్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహించటం అభినందనీయమని అన్నారు.
సంస్థ జోన్ కార్యదర్శి ఎన్. బాబారావు మాట్లాడుతూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు వివరించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడుగా డి. ప్రవీణ్, కార్యదర్శిగా ఎస్. బాబురావు, ఉపాధ్యక్షులుగా కష్ణ, సహయ కార్యదర్శులుగా సురేష్, బాలకష్ణ, మణికంఠ, సభ్యులుగా రాజు, మనోజ్, పావన్ మందులను ఎన్నకున్నారు.