జనవరి నుంచి ఈ-కేబినెట్
న్యూఢిల్లీ: జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ-కేబినెట్ సమావేశాలు నిర్వహించనుంది. పాలన సమర్థవంతంగా అందడానికి, నిర్ణయాలు వేగంగా అమలు కావడానికి కంప్యూటరీకరణ దోహదపడుతుందని కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ అన్నారు. కేబినెట్ సమావేశాల్లో సభ్యులకు ఇచ్చే సమాచారం, తీసుకునే నిర్ణయాలన్నీ జనవరి నుంచి కంప్యూటరీకరిస్తామన్నారు. తన ఆఫీసునూ కాగితరహితంగా చేయాలని అధికారులకు సూచించానన్నారు. ప్రధాని మోదీ సూచనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.