ఈసెట్ ఫలితాలు విడుదల
అనంతపురం: జేఎన్టీయూలో ఈసెట్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ విజయ్ ప్రకాశ్ శుక్రవారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 91.7 శాతం ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా ఈసెట్ ఫలితాల్లో కూడా బాలికలే పైచేయి సాధించినట్టు ఆయన తెలిపారు. ఈసెట్ అర్హత పొందిన విద్యార్థులు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంతో నేరుగా చేరవచ్చని విజయ్ ప్రకాశ్ అన్నారు.
జూన్ 12 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశామని, ఆ తర్వాతనే ఈసెట్ ఆడ్మిషన్లు ఉంటాయని ఆయన తెలిపారు. అందుకు సంబంధించిన ర్యాంకు కార్డులను ఈ (మే) నెల 25 నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని విజయ్ ప్రకాశ్ మీడియా సమావేశంలో వెల్లడించారు.