వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఈ–ఆఫీస్ విధానం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం) :
జిల్లాలోని 20 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఈ–ఆఫీస్ విధానం అమలు చేస్తున్నట్లు జిల్లా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కేఆర్ కిషోర్ అన్నారు. రాజమహేంద్రవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ సమావేశ మందిరంలో 20 వ్యవసాయ మార్కెట్ కమిటీల కార్యదర్శులు, సూపర్వైజర్లు, ఇతర సిబ్బందికి ఈ–ఆఫీస్ విధానంపై మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ, ఈ–ఆఫీస్ విధానం వలన పనులు వేగవంతంగా జరుగుతాయన్నారు. ప్రస్తుత విధానంలో కార్యాలయాల్లో ఫైళ్లు భద్రపరచడం కష్టంగా ఉందన్నారు. ఇక నుంచి ఫైళ్లను భద్రపరచాల్సిన అవసరం ఉండదని, వచ్చే నెల మొదటి వారం నుంచి పూర్తిస్థాయిలో కాగిత రహిత పాలన సాగుతుందని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంపై వ్యవసాయ మార్కెటింగ్ సిబ్బంది పట్టు సాధించాలన్నారు.