ప్రయోగాత్మక పరిశీలనలో ఈ–టాయిలెట్స్
శ్రీశైలం స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా దేవస్థానం పరిధిలోని పలు రద్దీ ప్రదేశాల సమీపంలో ప్రయోగాత్మకంగా ఈ –టాయిలెట్స్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని ఈఓ నారాయణ భరత్ గుప్త గురువారం తెలిపారు. ఇందులో భాగంగా గంగా గౌరి సదన్ రోడ్డుమార్గంలోని కర్ణాటక గెస్ట్ హౌస్ సమీపంలోని రోడ్డుమార్గం పక్కనే ఈ–టాయిలెట్స్‌ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కొ యూనిట్ రూ. 6.30 లక్షలు ఖర్చు అవుతుందని, ఈ టాయిలెట్లను రూ. 2 లేదా రూ. 5 కాయిన్ ద్వారా వినియోగించుకోవచ్చునన్నారు. ప్రస్తుతం రెండు పురుషులకు, ఒకటి స్త్రీలకు నిర్మిస్తున్నామన్నారు. దాతల సహకారం దొరికితే క్షేత్రవ్యాప్తంగా అవసరమైన అన్ని ప్రదేశాలలో 50 నుంచి 60 ఈ టాయిలెట్స్ నిర్మించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. భక్తులందరికీ మినిరల్ వాటర్ అందించాలనే సంకల్పంతో సింటెక్స్ ట్యాంకులకు స్వస్తి చెప్పి ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు ఈఓ పేర్కొన్నారు.