చైనాలో 'బాహుబలి' జోష్
విడుదలకు ముందే ఎన్నో సంచనాలు క్రియేట్ చేస్తున్న 'బాహుబలి' క్రేజ్ చైనాలో కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. చైనా దేశంలో బాహుబలికి సంబంధించిన పోస్టర్లు పబ్స్ లో కనిపిస్తున్నాయట. చిత్రానికి సంబంధించిన స్టిల్స్ టాటూస్ రూపంలో చైనా సినీ అభిమానులు పోడిపించుకుంటున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఈగ చిత్రాన్ని 'కుంగ్ ఫూ ఫ్లై' డబ్బింగ్ చేసి చైనాలో విడుదల చేశారు.
'కుంగ్ ఫూ ఫ్లై' చిత్రం చైనాలో ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతోపాటు రాజమౌళిపై క్రేజ్ పెరిగింది. దాంతో చైనాలో బాహుబలిని విడుదల చేసేందుకు అక్కడి డిస్టిబ్యూటర్స్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. చైనా, జపాన్ భాషలతోపాటు 15 భాషల్లో 'బాహుబలి' చిత్రాన్ని విడుదలకు రాజమౌళి సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా తెలుగు సినీ చరిత్రలో వంద కోట్ల క్లబ్ లో చేరే తొలి చిత్రంగా 'బాహుబలి'ని అంచనా వేస్తున్నారు.