ఎంసెట్-2 లీకేజీలో మరొకరి అరెస్ట్
హైదరాబాద్ : ఎంసెట్-2 లీకేజీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. సీఐడీ పోలీసులు మంగళవారం మరొకరిని అరెస్ట్ చేశారు.
ఢిల్లీకి చెందిన ముకుల్ జైన్‌ను అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు విచారిస్తున్నారు. ముకుల్ ఆరుగురు విద్యార్థులకు ప్రశ్నాపత్రం లీక్ చేసినట్లు గుర్తించారు. దీంతో ఈ కుంభకోణంలో అరెస్టైన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. మిగతా నిందితుల కోసం సీఐడీ తీవ్రంగా గాలిస్తోంది.