EAMCET test
-
నేడు ఎంసెట్ సర్వం సిద్ధం
ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ ఒక సెంటర్‌కు బదులు మరో కేంద్రానికి వెళ్లినా అనుమతి ఏదైన సమస్య ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 18004252747 జిల్లాలో గురువారం జరిగే ఎంసెట్ పరీక్షకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. వరంగల్, జనగామ పరిధిలో ఇంజనీరింగ్, మెడిసిన్ పరీక్షకు 24,698 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈసారి విద్యార్థులు ఏ కేంద్రంలోనైనా పరీక్ష రాసే వెసులుబాటు ఉంది. - కేయూ క్యాంపస్ కేయూ క్యాంపస్ : జిల్లాలో గురువారం జరగనున్న ఎంసెట్-15కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. వరంగల్, జనగామ రీజినల్ సెంటర్లలో ఇంజనీరింగ్, మెడిసిన్ అభ్యర్థులు మొత్తం 24,698 మంది పరీక్షకు హాజరుకానున్నారు. వరంగల్ రీజినల్‌సెంటర్ పరిధిలోని ట్రైసిటీ (వరంగల్, హన్మకొం డ, కాజీపేట)లో ఏర్పాటు చేసిన 23 పరీక్ష కేం ద్రాల్లో 13,990 మంది ఇంజనీరింగ్ అభ్యర్థులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష రాయనున్నారు. 23 మంది చీఫ్ సూపరింటెండెంట్లతోపాటు ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక్కో ఇన్విజిలేటర్.. ప్రతి 500 మంది అభ్యర్థులకు ఒక అబ్జర్వర్ చొప్పున నియమించారు.ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక ఎన్ఫోర్స్మెంట్ ఫ్లయింగ్స్క్వాడ్ను ఏర్పాటు చేశారు. అగ్రికల్చర్, మెడిసిన్ విభాగంలో వరంగల్ రీజి యన్ పరిధిలో ఏర్పాటు చేసిన 17 పరీక్ష కేంద్రా ల్లో 8,600 మంది అభ్యర్థులు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష రాయనున్నారు. 17 మంది చీఫ్ సూపరింటెం డెంట్లతోపాటు 20 మంది అభ్యర్థులకు ఒక ఇన్విజిలేటర్, 500 మంది అభ్యర్థులకు ఒకఅబ్జర్వర్ను నియమించారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఎన్ఫోర్స్మెంట్ ఫ్లయింగ్స్క్వాడ్ను ఏర్పాటు చేశారు. జనగామ రీజియన్ సెంటర్పరిధిలోఎంసెట్ నిర్వహణకు ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పా టు చేశారు. ఇంజనీరింగ్‌కు మూడు కేంద్రాలను ఏర్పాటుచేయగా, ఇందులో 1314మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నారు. మెడిసిన్‌కు రెం డు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 794మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. సూచనలు.. అభ్యర్థులను నిర్దేశించిన సమయూనికి గంట ముందుగా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు.ఇంజనీరింగ్ విద్యార్థులు ఉదయం 9గంటలకు, మెడిసిన్ అభ్యర్థులు మధ్యాహ్నం 1.30 గంటలకే పరీక్ష కేంద్రంలోకి చేరుకోవాలి.పరీక్ష సమయం ముగిసిన తర్వాత ఒక్క నిమిషం అలస్యమైనా అనుమతించరు.ఎవరైన అభ్యర్థి పొరపాటున ఒక పరీక్షాకేంద్రానికి బదులుగా మరో కేంద్రానికి వెళితే అక్కడా పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించారు.విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్‌ను తీసుకుని రావాలి.ఆన్లైన్లో తమ అప్లికేషన్ ఫామ్‌ను డౌన్లోడు చేసుకుని, ఫొటోజత చేసి, తమ కళాశాల ప్రిన్సిపాల్‌తో సంతకం చేయించుకుని రావాలి. లేనిపక్షంలో ఎవరైనా గెజిటెడ్ అధికారితో సంతకం తీసుకుని రావాలి.అప్లికేషన్ ఫామ్ లేకపోయినా అనుమతిస్తారు.. హాల్‌టికెట్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి. బ్లూ, బ్లాక్ పాయింట్పెన్లను విధిగా తెచ్చుకోవాలిపరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు రిస్ట్‌వాచ్‌ను (చేతిగడియారం) తీసుకుని రావొద్దు.మందం కలిగిన కళ్ల జోళ్లను అనుమతించరు. వైద్యనిమిత్తం ప్రతిపరీక్షాకేంద్రంవద్ద ఏఎన్ఎంలు కూడాఅందుబాటులోఉంటారు. పరీక్ష కేంద్రాలవద్ద 144 సెక్షన్‌ను విధించారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయూలి. -
చేరుకోవడమే అసలు పరీక్ష..!
రోడ్డెక్కని బస్సులు.. ఆందోళనలో విద్యార్థులు నగరంలో నేడు ఏపీ ఎంసెట్ హాజరుకానున్న 26,948 మంది విద్యార్థులు ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లే దిక్కు సిటీబ్యూరో: నగరంలో ఏపీ ఎంసెట్ పరీక్ష రాసే విద్యార్థులకు తిప్పలు తప్పేలా లేవు. పరీక్ష రాయడం ఒకెత్తయితే.. పరీక్ష సెంటర్‌కు చేరుకోవడమే అసలు పరీక్షగా మారింది. శుక్రవారం నగరంలో ఏపీ ఎంసెట్ పరీక్ష జరగనుంది. దాదాపు 27 వేల మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు సన్నద్ధమయ్యారు. వీరందరికీ ఆయా ప్రాంతాల్లో కేటాయించిన కేంద్రాలకు ఎలా చేరుకోవాలని ఆందోళనలో పడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా మూడు రోజులుగా బస్సులు రోడ్లెక్కని విషయం తెలిసిందే . యథావిథిగా బస్సులు నడవడం, ప్రత్యేక బస్సులు వేస్తేనే నగరంలో పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోవడం కష్టం. అసలు పూర్తిగా బస్సులు నడవకపోవడంతో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రైవేటు సిబ్బందిపైనే ఆర్టీసీ ఆధారపడింది. వారు ఎంత మంది విధులకు హాజరైతే.. ఆ మేరకు బస్సులు నడుపుతామని ఆర్టీసీ చెబుతోంది. ఏ రూట్లలో, ఎన్ని బస్సులు అనేది స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులపై విద్యార్థులు ఆధారపడకపోవడమే మంచిది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడమే ఉత్తమం. ఎవరికివారు సొంత ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటే సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కావడంతో నగరంలో చదువుకున్న విద్యార్థులతో పాటు విజయవాడ, కర్నూల్ వంటి ప్రాంతాల్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులంతా ఇక్కడే పరీక్ష రాయనున్నారు. వీరికీ కష్టాలు తప్పేలా లేవు. పరీక్ష సమయానికంటే గంట ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకోవాలని ఓ వైపు అధికారులు ఘంటాపథంగా చెబుతున్నప్పటికీ.. ఎలా వెళ్లాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. మెడికల్ విద్యార్థులే అధికం... విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నగరంలో మూడు జోన్లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ జోన్ల పరిధిలో మొత్తం 22 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంజినీరింగ్, మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5.30 గంటలకు మెడికల్ అండ్ అగ్రికల్చర్ పరీక్ష జరగనుంది. నగరంలో మొత్తం 26,948 మంది ఏపీ ఎంసెట్ రాస్తుండగా.. అందులో మెడికల్ విద్యార్థుల సంఖ్యే అధికం. ఇంజినీరింగ్‌కు 9,028 మంది, మెడికల్ అండ్ అగ్రికల్చర్ పరీక్షకు 17,718 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరితోపాటు మరో 101 మంది విద్యార్థులు ఇంజినీరింగ్, మెడికల్ అండ్ అగ్రికల్చర్ రెండు పరీక్షలు రాయనున్నారు. కో ఆర్డినేటర్లు వీరే.. జోన్ 1 - రీజినల్ కో ఆర్డినేటర్: డాక్టర్ బి. బాలు నాయక్, 9949499038 జోన్ 2 - రీజినల్ కో ఆర్డినేటర్: డాక్టర్ పి. శ్రీనివాస రావు, 9949485554 జోన్ 3 - రీజినల్ కో ఆర్డినేటర్ : డాక్టర్ ఏ ప్రభుకుమార్, 8008103810 పకడ్బందీగా ఏర్పాట్లు.. కేపీహెచ్‌బీకాలనీ: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏపీ ఎంసెట్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ బి.బాలు నాయక్ తెలిపారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు కనీసం అరగంట ముందే చేరుకునేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ముందస్తు రవాణా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తుల నకలు కాపీలు, ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు తమ కుల ధ్రువీకరణ పత్రాల నకలు కాపీలను తీసుకురావాలని డాక్టర్ బాలూనాయక్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు పూర్తిస్థాయిలో భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తమతో పాటు పరీక్షా కేంద్రాలకు తీసుకురాకూడదని చెప్పారు. - డాక్టర్ బాలు నాయక్, ఏపీ ఎంసెట్ రీజినల్ కో ఆర్డినేటర్ ఎంసెట్ విద్యార్థులకు విజ్ఞాన జ్యోతి కళాశాల బస్సులు సిటీబ్యూరో: ఏపీ ఎంసెట్ పరీక్ష రాసే విద్యార్థుల పట్ల వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల ఉదారత చాటింది. ఆ కళాశాలకు చెందిన బాచుపల్లి, నిజాంపేట సెంటర్లలో ఏపీ ఎంసెట్ పరీక్ష రాసే విద్యార్థులకు బస్సు సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం ఉదయం 8.30 గంటలకు కూకట్పల్లి జేఎన్టీయూ వద్ద, మియాపూర్ జంక్షన్ వద్ద కళాశాలకు చెందిన బస్సులు సిద్ధంగా ఉంటాయి. మధ్యాహ్నం పరీక్ష రాసే మెడికల్ విద్యార్థుల కోసం ఆ ప్రాంతాల్లోనే మధ్యాహ్నం ఒంటి గంటకు బస్సులు అందుబాటులో ఉంటాయని విజ్ఞాన కళాశాల యాజమాన్యం పేర్కొంది. -
ప్రశాంతంగా ఎంసెట్
ఆలంపల్లి, న్యూస్‌లైన్: వికారాబాద్‌లోని రెండు సెంటర్లలో గురువారం నిర్వహించిన ఎంసెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నిమిషం ఆలస్యమైనా అనుమతించమని అధికారులు నిబంధన పెట్టడంతో విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. కొందరు ఐదు పది నిమిషాలు ఆలస్యంగా రావడంతో వారిని పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతించలేదు. దీంతో వారు నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. వికారాబాద్ ఎంసెట్ రీజనల్ కో-ఆర్డినేటర్, ఎస్ఏపీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రకాష్ పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు. రెండు సెంటర్లలో మెడికల్, ఇంజినీరింగ్ పరీక్ష ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షను ఉదయం 10గంటలకు వికారాబాద్‌లోని రెండు సెంటర్లలో నిర్వహించారు. మొత్తం 1,012 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 963 మంది హాజరయ్యారు. రెండు సెంటర్లలో కలిసి 49 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ధన్నారం అన్వర్ ఉలూమ్ కళాశాల పట్టణానికి దూరంగా ఉండడంతో విద్యార్థులు ప్రైవేటు వాహనాలను, ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ఎస్ఏపీ కళాశాలలో, అన్వర్ ఉలూం కాలేజీలో మెడిసిన్ విభాగం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 694మంది విద్యార్థులకు 655 మంది హాజరయ్యారు. 39 మంది గైర్హాజరయ్యారు. ఆలస్యంగా వచ్చి పరీక్ష రాయలేకపోయిన విద్యార్ధులు అన్వర్ ఉలూమ్ కళాశాలలో నిర్వహించిన ఇంజినీరింగ్ పరీక్షకు జ్యోతి అనే విద్యార్థినితోపాటు మరో ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు వారిని పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. టెంటు కూడా వేయలేదు.. వికారాబాద్ అన్వర్ ఉలూమ్ కళాశాల పరీక్ష కేంద్రం వద్ద కనీసం షామియానా కూడా ఏర్పాటు చేయలేదు. ముందుగానే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎండలోనే నిరీక్షించాల్సి వచ్చింది. కళాశాలకు దూరంగా పంటపొలాల్లో ఉన్న చెట్ల కింద గడిపారు. సీఎంఆర్‌లో పరీక్ష రాసిన 3,250 మంది.. మేడ్చల్: మండలంలోని కండ్లకోయ సీఎంఆర్ గ్రూపు కళాశాలలోని నాలుగు సెంటర్లలో నిర్వహించిన ఎంసెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. సీఎంఆర్‌ఐటిలో ఒకటి, సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలో ఒకటి, సీఎంఆర్ సెట్లో రెండు సెంటర్లను ఏర్పాటు చేశారు. సెట్ కళాశాలలోని రెండు సెంటర్లలో 500 మంది విద్యార్థుల చొప్పున, మిగతా సెంటర్లలో 450 మంది విద్యార్థుల చొప్పున 3,250 విద్యార్థులు పరీక్ష రాశారు.