నేడు ఎంసెట్ సర్వం సిద్ధం | Today EAMCET | Sakshi
Sakshi News home page

నేడు ఎంసెట్ సర్వం సిద్ధం

Published Thu, May 14 2015 12:47 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

నేడు ఎంసెట్  సర్వం సిద్ధం - Sakshi

నేడు ఎంసెట్ సర్వం సిద్ధం

ఒక్క నిమిషం  ఆలస్యమైనా నో ఎంట్రీ
 ఒక సెంటర్‌కు బదులు  మరో కేంద్రానికి వెళ్లినా అనుమతి

ఏదైన సమస్య ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 18004252747
 
జిల్లాలో గురువారం జరిగే ఎంసెట్   పరీక్షకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. వరంగల్, జనగామ పరిధిలో ఇంజనీరింగ్, మెడిసిన్ పరీక్షకు 24,698 మంది విద్యార్థులు  హాజరుకానున్నారు. ఈసారి విద్యార్థులు   ఏ కేంద్రంలోనైనా పరీక్ష రాసే  వెసులుబాటు ఉంది.
 - కేయూ క్యాంపస్
 
 కేయూ క్యాంపస్ :  జిల్లాలో గురువారం జరగనున్న ఎంసెట్-15కు అధికారులు సర్వం సిద్ధం చేశారు.  వరంగల్, జనగామ రీజినల్ సెంటర్లలో ఇంజనీరింగ్, మెడిసిన్ అభ్యర్థులు మొత్తం  24,698 మంది పరీక్షకు హాజరుకానున్నారు. వరంగల్ రీజినల్‌సెంటర్ పరిధిలోని ట్రైసిటీ (వరంగల్, హన్మకొం డ, కాజీపేట)లో ఏర్పాటు చేసిన 23 పరీక్ష కేం ద్రాల్లో 13,990 మంది ఇంజనీరింగ్ అభ్యర్థులు  ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష రాయనున్నారు. 23 మంది చీఫ్ సూపరింటెండెంట్లతోపాటు  ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక్కో ఇన్విజిలేటర్.. ప్రతి 500 మంది అభ్యర్థులకు ఒక అబ్జర్వర్ చొప్పున నియమించారు.ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక ఎన్‌ఫోర్స్‌మెంట్ ఫ్లయింగ్‌స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. అగ్రికల్చర్, మెడిసిన్ విభాగంలో వరంగల్ రీజి యన్ పరిధిలో ఏర్పాటు చేసిన 17 పరీక్ష కేంద్రా ల్లో 8,600 మంది అభ్యర్థులు  మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష రాయనున్నారు. 17 మంది చీఫ్ సూపరింటెం డెంట్లతోపాటు 20 మంది అభ్యర్థులకు ఒక ఇన్విజిలేటర్, 500 మంది అభ్యర్థులకు ఒకఅబ్జర్వర్‌ను నియమించారు. ప్రతి పరీక్ష కేంద్రానికి  ఎన్‌ఫోర్స్‌మెంట్ ఫ్లయింగ్‌స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. జనగామ రీజియన్ సెంటర్‌పరిధిలోఎంసెట్ నిర్వహణకు ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పా టు చేశారు. ఇంజనీరింగ్‌కు మూడు కేంద్రాలను ఏర్పాటుచేయగా, ఇందులో  1314మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నారు. మెడిసిన్‌కు రెం డు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 794మంది అభ్యర్థులు పరీక్ష  రాయనున్నారు.

సూచనలు..

అభ్యర్థులను నిర్దేశించిన సమయూనికి గంట ముందుగా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు.ఇంజనీరింగ్ విద్యార్థులు ఉదయం 9గంటలకు, మెడిసిన్ అభ్యర్థులు మధ్యాహ్నం 1.30 గంటలకే పరీక్ష కేంద్రంలోకి చేరుకోవాలి.పరీక్ష సమయం ముగిసిన తర్వాత ఒక్క నిమిషం అలస్యమైనా అనుమతించరు.ఎవరైన అభ్యర్థి పొరపాటున ఒక పరీక్షాకేంద్రానికి బదులుగా మరో కేంద్రానికి వెళితే అక్కడా పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించారు.విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్‌ను తీసుకుని రావాలి.ఆన్‌లైన్‌లో తమ అప్లికేషన్ ఫామ్‌ను డౌన్‌లోడు చేసుకుని, ఫొటోజత చేసి, తమ కళాశాల ప్రిన్సిపాల్‌తో సంతకం చేయించుకుని రావాలి. లేనిపక్షంలో ఎవరైనా గెజిటెడ్ అధికారితో సంతకం తీసుకుని రావాలి.అప్లికేషన్ ఫామ్ లేకపోయినా అనుమతిస్తారు.. హాల్‌టికెట్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి. బ్లూ, బ్లాక్ పాయింట్‌పెన్‌లను విధిగా తెచ్చుకోవాలిపరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు రిస్ట్‌వాచ్‌ను (చేతిగడియారం) తీసుకుని రావొద్దు.మందం కలిగిన కళ్ల జోళ్లను అనుమతించరు.  వైద్యనిమిత్తం ప్రతిపరీక్షాకేంద్రంవద్ద ఏఎన్‌ఎంలు కూడాఅందుబాటులోఉంటారు. పరీక్ష కేంద్రాలవద్ద 144 సెక్షన్‌ను విధించారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయూలి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement