ఎంసెట్ టాపర్లంతా ఐఐటీ, ఎన్‌ఐటీలవైపే!
మొదటి 1,000 ర్యాంకర్లలో 253 మందే వెరిఫికేషన్‌కు హాజరు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ టాపర్లు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరై వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థుల సంఖ్యే ఇందుకు ఉదాహరణ. ఎంసెట్‌లో మొదటి 1,000 ర్యాంకులను సాధించిన విద్యార్థుల్లో 75 శాతం మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరవలేదు.
కేవలం 25 శాతం (253) మందే వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. వారూ జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌కు హాజరైన విద్యార్థులే. వాటిల్లో టాప్ ర్యాంకులు సాధించిన వారూ ఉన్నారు. వీరంతా ఐఐటీలు, ఎన్ఐటీల్లో చేరేందుకే ఆసక్తి చూపుతున్నారు. వెరిఫికేషన్‌కు హాజరైన 2 వేల ర్యాంకులోపు విద్యార్థుల్లోనూ ఎక్కువ మంది ఎన్ఐటీ, ఐఐటీల్లోనే చేరే అవకాశం ఉంది.