తిరుమలలో దర్శనాల టికెట్ల దళారీ అరెస్ట్
తిరుపతి: తిరుమలలో దర్శనాల టికెట్ల దళారీని తిరుపతి ఈస్ట్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పోలీసులకు పట్టుబడిన నిందితుడు మదనపల్లెకు చెందిన సునీల్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు.
గత నెల 29న టీటీడీ విజిలెన్స్ అధికారుల ఆదేశాల మేరకు మోహన్‌బాబు అనే దళారీని ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. ఈ విచారణలో సునీల్ కుమార్ వ్యవహారం బట్టబయలు అయినట్టు పోలీసులు వెల్లడించారు.