ఇండోనేషియాలో భూకంపం
ఇండోనేషియాలోని తూర్పు తైముర్ రాజధాని డిలీకి 351 కిలోమీటర్ల దూరంలో ఈ రోజు ఉదయం భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే ఆదివారం వెల్లడించింది. దాని తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 6.3గా నమెదు అయిందని తెలిపింది. అయితే భూకంపం తీవ్రత వల్ల ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ చాలా తక్కువ సంభవించిందని పేర్కొంది.
సునామీ వచ్చే అవకాశాలు లేవని పేర్కొంది. అయితే ఈ ఏడాది జులైలో సుమిత్రా ప్రావెన్స్లో సంభవించిన భూకంపంలో 35 మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులైన సంగతి తెలిసిందే.