కలిసి తింటే కలదు ఆరోగ్యం!
న్యూయార్క్: కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తాజా అధ్యయనంలో తేలింది. తినే రుగ్మత(అతిగా తినడం.. లేదంటే అసలు తినకపోవడం) బారిన పడకుండా ఉండడానికి, భవిష్యత్తులో స్థూలకాయులుగా మారే ప్రమాదాన్ని తప్పించుకోవడానికి ఈ పద్ధతే ఉత్తమమైనదని అమెరికా పరిశోధకులు చెబుతున్నారు.
దాదాపు 200 కుటుంబాలపై అధ్యయనం చేసి ఈ నిర్ధారణకు వచ్చారు. అమ్మ, నాన్న, నానమ్మ, తాతయ్య, అక్క, చెల్లి, తమ్ముడు, బంధువులు.. ఇలా అందరితో కలిసి కూర్చుండి తినడమే మేలంటున్నారు. ఇలా తినేటప్పుడు పిల్లల ఆహార అలవాట్లను తల్లిదండ్రులు దగ్గరగా పరిశీలిస్తారని, ఒకరు కాకపోయినా మరొకరు వారి తీరును పరిశీలించి సరిదిద్దడమే ఇందుకు కారణమని ఇల్లినాయిస్ యూనివర్సిటీకి చెందిన బార్బారా తెలిపారు.