ECG
-
ఒక్క లబ్డబ్తోనే గుట్టు పట్టేస్తుంది..
హార్ట్ ఫెయిల్యూర్‌ను ముందుగానే కచ్చితంగా గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పరికరాన్ని అభివృద్ధి చేశారు. కృత్రిమ మేధ సాయంతో పనిచేసే ఈ యంత్రం ఒకే ఒక్క లబ్డబ్తోనే సమస్యను గుర్తించగలగడం విశేషం. అరవై ఐదేళ్ల పైబడ్డ వారిలో కనీసం 10 శాతం మంది కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్‌తో మరణిస్తుంటారు. శరీరం మొత్తానికి రక్తాన్ని సరఫరా చేయడంలో గుండె విఫలం కావడం వల్ల ఇలా జరుగుతుంటుంది. కారణాలేవైనా.. ఈ పరిస్థితిని గుర్తించడం మాత్రం కష్టం. కొన్ని రోజులపాటు ఈసీజీ తీసి పరిశీలించడం ద్వారా డాక్టర్లు హార్ట్ ఫెయిల్యూర్‌కు ఉన్న అవశాలను అంచనా వేస్తారు. అయితే సర్రే యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజాగా ఈసీజీ సమాచారాన్ని వేగంగా విశ్లేషించే కృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం ద్వారా గుండె ఒక్కసారి కొట్టుకోగానే సమస్యను గుర్తించగలిగారు. దీనిపై మరిన్ని విస్తృత పరిశోధనలు చేపడతామని చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ కృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్‌ను స్మార్ట్‌వాచీలు, హెల్త్ బ్యాండ్స్లోకి చేర్చేందుకు ప్రయత్నిస్తామని పేర్కొంటున్నారు. చిన్ని గుండె సిద్ధమైంది త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో భారతీయ సంతతి శాస్త్రవేత్త డాక్టర్ రవి బిర్లా ఓ వినూత్న ఆవిష్కరణ చేశారు. ఒక వ్యక్తి నుంచి సేకరించిన కణాలతో చిన్న సైజు గుండెను అభివృద్ధి చేశారు. తెల్ల రక్త కణాలను మూలకణాలుగా మార్చడం ద్వారా ఈ ప్రక్రియ మొదలవుతుంది. దీంతో ఈ మూలకణాలు కార్డియో మయోసైట్స్గా రూపాంతరం చెందుతాయి. పోషకాలు కొన్నింటిని కలిపి.. ప్రత్యేకంగా తయారు చేసిన బయో ఇంక్ సాయంతో తాము పొరలు పొరలుగా గుండెను తయారు చేశామని, బయోలైఫ్ 4డీ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ అయిన రవి బిర్లా తెలిపారు. ఒక రోగి తాలూకూ నిజమైన గుండె వివరాల ఆధారంగానే ఈ కృత్రిమ గుండె తయారైందని తెలిపారు. నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత దాన్ని శరీరం లోపలి పరిస్థితులను తలపించే బయో రియాక్టర్లో ఉంచినప్పుడు కణాలన్నీ కండరాల మాదిరిగా దృఢంగా మారాయని, ఫలితంగా అనుకన్న పరిమాణం కంటే తక్కువ సైజు గుండె ఏర్పడిందని తెలిపారు. ఇదే టెక్నాలజీని మరింత అభివృద్ధి చేస్తే గుండెలను కృత్రిమంగా తయారు చేసి అమర్చుకునే రోజులు దగ్గరకొచ్చినట్లే అని అంచనా వేస్తున్నారు. -
ఈసీజీకి కృత్రిమ మేధ హంగు!
ఈసీజీ గురించి మీరు వినే ఉంటారు. గుండె పనితీరును అంచనా వేసేందుకు అందుబాటులో ఉన్న ఈ పురాతన పద్ధతిని పూర్తిగా మార్చేశారు మేయో క్లినిక్ శాస్త్రవేత్తలు. గుండె విద్యుత్ సంకేతాలను గుర్తించడానికి పరిమితం కాకుండా గుండెజబ్బులను చాలా తొందరగా గుర్తించడం ఈ కొత్త పద్ధతి ప్రత్యేకత. ఖరీదైన పరీక్షల ద్వారా మాత్రమే నిర్ధారించే వీలున్న లెఫ్ట్ వెంట్రిక్యులర్ డిస్ఫంక్షన్ను ఈ కొత్త పద్ధతి ద్వారా గుర్తించవచ్చు. ఎటువంటి సంకేతాలు కూడా చూపకపోవడం ఈ లెఫ్ట్ వెంట్రిక్యులర్ డిస్ఫంక్షన్.. రక్త పరీక్షల ద్వారా గుర్తించేందుకు అవకాశమున్నా ఫలితాలు ఎప్పుడూ ఒకేలా లేకపోవడం నేపథ్యంలో ఈ కొత్త ఈసీజీ పద్ధతి అందుబాటులోకి వచ్చింది. కృత్రిమ మేధ పద్ధతులను ఉపయోగించడం ద్వారా ఈ కొత్త ఈసీజీ పద్ధతి గుండెజబ్బు అవకాశాలను అంచనా వేస్తుందని చవకగా కేవలం పది సెకన్లలో అయిపోవడం మరో లాభమని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త పాల్ ఫ్రైడ్‌మ్యాన్ తెలిపారు. దాదాపు ఆరు లక్షల మంది ఈసీజీ వివరాల ఆధారంగా పనిచేసే ఈ కృత్రిమ మేధ వ్యవస్థను ఇప్పటికే 50 వేల మందిపై విజయవంతంగా పరీక్షించి చూశారు కూడా. అతిసున్నితమైన అంశాలను పసిగట్టడం ద్వారా గుండెజబ్బులను చాలాముందుగా గుర్తించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెప్పార -
మెడికల్ ఉత్పత్తుల అడ్డా ‘ఆర్కే’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్కానింగ్, ఈసీజీ వంటి వైద్య ఉత్పత్తులను సమీకరించుకోవటం కార్పొరేట్ ఆసుపత్రులకు పెద్ద కష్టమేమీ కాదు. కానీ, గ్రామాల్లోని ఆసుపత్రులకు కాస్త ఇబ్బందే. దీన్నే వ్యాపార వేదికగా ఎంచుకుంది ఆర్కే ఎంటర్ప్రైజెస్. బహుళ జాతి కంపెనీలతో ఒప్పందం చేసుకొని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో మెడికల్ ఉత్పత్తులను విక్రయించడమే దీని ప్రత్యేకత. మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్ రవి కిరణ్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది నెల్లూరు. బీ–ఫార్మసీ పూర్తయ్యాక.. విప్రో జీఈలో ఆంధ్రప్రదేశ్ బిజినెస్ మేనేజర్‌గా చేరా. తర్వాత శామ్సంగ్ మెడికల్ ఎక్విప్‌మెంట్‌లో సేల్స్ మేనేజర్‌గా పనిచేశా. అప్పుడు గమనించింది ఏంటంటే? గ్రామాల్లోని ఆసుపత్రుల్లో మెడికల్, డయాగ్నస్టిక్ ఉత్పత్తులు అందుబాటులో లేకపోవటంతో దగ్గర్లోని నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో వైద్య సేవలు ఆలస్యమవుతున్నాయని! దీనికి పరిష్కారం చూపించేందుకు 2017 డిసెంబర్లో నెల్లూరు కేంద్రంగా ఆర్కే ఎంటర్‌ప్రైజెస్‌ను ప్రారంభించాం. అందుబాటు ధరల్లో మెడికల్ ఉత్పత్తులు, మెడి కన్జ్యూమబుల్స్ని విక్రయించడం మా ప్రత్యేకత. 40కి పైగా వైద్య ఉత్పత్తులు.. స్కానింగ్ మిషన్స్, ఈసీజీ, ఫెటల్ మానిటర్స్, కార్డియో కేర్ వంటి 40 రకాలకు పైగా వైద్య ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. కేబుల్స్, ప్రింటర్స్, పేపర్స్ వంటి మెడి కన్జ్యూమబుల్స్ కూడా ఉంటాయి. ఉత్పత్తుల కోసం బయోనెట్, ఫెటల్, వాటెక్ ఇండియా, డాల్ఫిన్, ఫిలిప్స్, క్రౌన్డెంట్, ఆట్రియం వంటి 12 కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. త్వరలోనే సోనీ, సియామ్స్, సీమెన్స్తోనూ ఒప్పందం చేసుకోనున్నాం. నెలకు రూ.50 లక్షలు.. వైద్య ఉత్పత్తుల విక్రయంతో పాటూ ఇన్స్టలేషన్, సర్వీసింగ్ కూడా కంపెనీయే చూసుకుంటుంది. ప్రస్తుతం నెలకు రూ.50 లక్షల వ్యాపారం చేస్తున్నాం. ఇప్పటివరకు వందకు పైగా ఇన్స్టలేషన్ చేశాం. కర్నూల్, నెల్లూరులోని 6 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 14 మంది ఉద్యోగులున్నారు. మార్చి నాటికి ఆర్కేమెడిసాల్స్.కామ్ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెస్తాం. ఈ ఏడాదిలో రూ.20 కోట్ల ఆదాయాన్ని లకి‡్ష్యంచాం. మెడికల్ ఉత్పత్తుల నిల్వ కోసం నెల్లూరులో గిడ్డంగి ఏర్పాటు చేశాం. రూ.5 లక్షల లోపు ధర ఉంటే వైద్య ఉత్పత్తులను నిల్వ చేస్తాం’’ అని రవి కిరణ్ తెలిపారు. -
పీహెచ్‌సీల్లో ఈసీజీ సేవలు
నిజాంసాగర్(జుక్కల్) : కార్పొరేట్ ఆస్పత్రులతో పాటు జిల్లా కేంద్ర ఆస్పత్రులకే పరిమితమైన అధునాతన వైద్య సదుపాయాలు ప్రస్తుతం పల్లెలకు విస్తరిస్తున్నాయి. అమ్మఒడి, కేసీఆర్ కిట్లు, ఆరోగ్యలక్ష్మి తదితర ప్రతిష్టాత్మక పథకాలు తీసుకొచ్చిన .. ప్రా«థమిక ఆరోగ్య కేంద్రాల్లో అధునాతన సదుపాయాలను కల్పిస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈసీజీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆరోగ్య కేంద్రాల్లో ఈసీజీ సేవలు అందుబాటులోకి రావడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఛాతినొప్పి, గుండెనొప్పితో బాధ పడుతున్న రోగులు ఈసీజీ కోసం పట్టణ ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చేది. ఈసీజీ పరీక్షల కోసం వందల రూపాయలు వెచ్చించాల్సి వచ్చేది. నొప్పి వచ్చినప్పుడల్లా పట్టణాలకు పరుగులు తీస్తూ జేబులు గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అయితే, సర్కారు ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేసే క్రమంలో భాగంగా వైద్య సేవలను విస్తృతం చేస్తోంది. పీహెచ్సీలలో వసతులను మెరుగు పరిచిన ప్రభుత్వం.. మండల కేంద్రాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు రూ.50 వేల విలువ గల ఈసీజీ యంత్రాన్ని, ఇతర పరికరాలను సరఫరా చేసింది. దాంతో ఆయా మండల కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఈసీజీ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. గుండెనొప్పి వ్యాధిగ్రస్తులతో పాటు 45 సంవత్సరాల వయస్సు పై బడిన వారు ఈసీజీ పరీక్షలను చేయించుకుంటున్నారు. ఆరోగ్య కేంద్రాల్లో ఈసీజీ యంత్రాల ద్వారా రోగులకు స్థానిక వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. పల్లెల్లో ఈసీజీ సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య కేంద్రాల్లోనే పరీక్షలు మండల కేంద్రాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో ఈసీజీ పరీక్షలను ఉచితంగా చేస్తున్నాం. గుండెనొప్పి సంబంధిత వ్యాధుల నిర్దారణకు ఈసీజీ సేవలు దొహదపడుతున్నాయి. ఆరోగ్య కేంద్రాల్లో ఈసీజీ పరీక్షల ద్వారా రోగుల సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకమూ పెరుగుతుంది. – స్పందన, ఆరోగ్య కేంద్రం వైద్యురాలు, నిజాంసాగర్ -
గుండెపోటు.. పరీక్షలు
మనలోని ప్రతి అవయవానికి నిరంతరం రక్తం సరఫరా అయి తీరాలి. గుండెకు కూడా. గుండెకు రక్తం అందించే రక్తనాళాల్లో ఏదైనా అకస్మాత్తుగా మూసుకుపోతే గుండె కండరానికి రక్తసరఫరా నిలిచిపోయి రక్తం ద్వారా అందాల్సిన ఆక్సిజన్, పోషకాలు అందవు. దాంతో గుండె కండరం దెబ్బతినడం మొదలవుతుంది. అలాంటప్పుడు ఆరు నుంచి పన్నెండు గంటల్లో దానికి అందాల్సిన పాళ్లలో రక్తసరఫరాను పునరుద్ధరించలేకపోతే... ఇకపై మళ్లీ ఎప్పటికీ కోలుకోలేనంతగా శాశ్వతంగా గుండె కండరం చచ్చుబడిపోతుంది. ఒకసారి గుండెకండరం శాశ్వతంగా చచ్చుబడితే... దాని వల్ల శరీరంలోని మిగతా అన్ని అవయవాలకూ రక్తం అందకుండాపోయిన మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఎంత త్వరగా గుండెకు రక్తసరఫరాను పునరుద్ధరించగలిగితే అంత మంచిది. ఎంత త్వరగా గుండె కండరాన్ని చచ్చుబడకుండా చూస్తే అంత సమర్థంగా రోగికి మరణాన్ని తప్పించినట్లవుతుంది. అందుకే గుండెపోటును నిర్ధారణ చేసే పరీక్షలు వెంటనే చేయించాలి. హార్ట్ ఎటాక్ నిర్ధారణకు పరీక్షలు... ఈసీజీ: ఛాతీ నొప్పి వచ్చిన ప్రతి వ్యక్తి తప్పనిసరిగా చేయించుకోవాల్సిన పరీక్ష ఇది. గుండెపోటు అయితే 80, 90 శాతం కేసుల్లో ఆ విషయం నిర్ధారణ అవుతుంది. అంతేకాదు... గతంలో వారికి గుండెపోటు వచ్చి ఉండి, ఆ విషయం రోగికి తెలియకున్నా ఈ పరీక్షతో గతంలో వచ్చిన గుండెపోటునూ గుర్తించవచ్చు.అయితే కొన్నిసార్లు చాలా చిన్న గుండెపోటును ఈసీజీ గుర్తించలేకపోవచ్చు. అయితే ఈసీజీ గతంలోని గుండెజబ్బుల విషయంలో కొన్ని క్లూస్ ఇస్తుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. అది ఇచ్చే క్లూస్ అన్నీ నూరు శాతం కచ్చితం కాకపోవచ్చు. అయినప్పటికీ వాటిని నిర్లక్ష్యం చేయకుండా, వాటికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే గుండెపోటు వచ్చిన వెంటనే ఈసీజీ తీయించినా గుండెపోటు వల్ల కలిగే మార్పులను ఈ పరీక్ష వెంటనే నమోదు చేయలేకపోవచ్చు. అందుకే గుండెనొప్పి / ఛాతీనొప్పి వచ్చాక 45 నిమిషాల తర్వాత కనీసం 2 లేదా 3 ఈసీజీలను తీశాక కూడా అందులో మార్పులు లేవంటే అప్పుడు గుండెపోటు రాలేదని 99 శాతం కచ్చితత్వంతో చెప్పవచ్చు. ఎకో పరీక్ష : గుండెస్పందనల్లోని మార్పులు, గుండె కండరంలో వచ్చిన మార్పులను ఎకో పరీక్ష తెలుపుతుంది. ఇక గుండెపోటు వచ్చినప్పుడు గుండెస్పందనల్లో మార్పులు రావచ్చు కాబట్టి గుండెపోటు నిర్ధారణ కోసం ఎకో పరీక్షపైనా ఆధారపడవచ్చు. పైగా గుండెజబ్బు వల్ల ఛాతీ నొప్పి వచ్చినప్పుడు ఆ విషయం తెలుసుకునేందుకు ఎకో పరీక్షలో అవకాశాలు 95 శాతం కంటే ఎక్కువ. కాకపోతే ఈ పరీక్ష ఈసీజీ కంటే కాస్తంత ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. కాకపోతే దీన్ని తప్పనిసరిగా ఎకో పరీక్ష నిర్వహించడంలో తర్ఫీదు పొందిన నైపుణ్యం కలిగిన కార్డియాలజిస్టులే నిర్వహించాలి. హైసెన్సిటివిటీ ట్రోపోనిన్‌లు : గుండెపోటు వచ్చిన 4 గంటల లోపే రక్తంలో హైసెన్సిటివిటీ ట్రోపోనిన్ల పాళ్లు పెరుగుతాయి. ఈ పరీక్ష ద్వారా ఆ విషయం నిర్ధారణ అయితే, ఎంత చిన్న గుండెపోటు అయినప్పటికీ అది తప్పనిసరిగా గుండెపోటే అన్న విషయం కచ్చితంగా నిర్ధారణవుతుంది. యాంజియోగ్రామ్: గుండెపోటు అని సందేహం కలిగినప్పుడు వ్యాధి నిర్ధారణ కచ్చితంగా చేయగలిగే మరో పరీక్ష యాంజియోగ్రామ్. కొన్నిసార్లు ఈసీజీ మార్పులు స్పష్టంగా లేకపోయినా, ఎకో పరీక్ష మనకు సరైన క్లూస్ ఇవ్వలేకపోయినా ఈ పరీక్ష వాటిని సమకూరుస్తుంది. దాంతోపాటు గుండె రక్తనాళాల స్థితి, అందులోని అడ్డంకుల వంటివి కచ్చితంగా తెలుస్తాయి. అయితే ఈసీజీ, ఎకోలతో పోలిస్తే ఈ పరీక్షకు అయ్యే ఖర్చు ఎక్కువ. యాంజియోగ్రామ్‌లో వచ్చే ఫలితాలు 99 శాతం కంటే ఎక్కువగా నమ్మదగినవి. -డాక్టర్ అనుజ్ కపాడియా సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్ ,బంజారాహిల్స్ హైదరాబాద్.