Economic corridors
-
భారత్–నేపాల్–చైనాల మధ్య ఆర్థిక కారిడార్
బీజింగ్: హిమాలయ దేశమైన నేపాల్‌పై మరింత పట్టు బిగించేందుకు చైనా చురుగ్గా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా చైనా–నేపాల్–భారత్‌ల మధ్య కొత్త ఆర్థిక కారిడార్ నిర్మాణాన్ని డ్రాగన్ దేశం ప్రతిపాదించింది. నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యావలి చైనాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆ దేశం ఈ మేరకు స్పందించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో చర్చల అనంతరం కుమార్ బుధవారం సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘నేపాల్–చైనాలు బహుళార్థక ప్రయోజనాలున్న హిమాలయ అనుసంధాన వ్యవస్థ ఏర్పాటుకు అంగీకరించాయి’ అని చెప్పారు. అనంతరం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ స్పందిస్తూ.. నేపాల్ ఇప్పటికే వన్‌బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరిందన్నారు. ఇందులో భాగంగా నేపాల్‌లో రైలు, రోడ్డు మార్గాలు, విమానాశ్రయాలు, విద్యుత్, సమాచారం వంటి సౌకర్యాలను అభివృద్ధి చేస్తామన్నారు. దీనివల్ల చైనా–నేపాల్–భారత్‌లను అనుసంధానిస్తూ ఆర్థిక కారిడార్‌ను నిర్మించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. నేపాల్ అభివృద్ధికి భారత్, చైనాలు సాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ధర్మశాలలో ఉన్న బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామాను కలుసుకునేందుకు టిబెట్ శరణార్థులు తమ దేశం గుండా వెళ్లకుండా చర్యలు తీసుకునేందుకు నేపాల్ ఒప్పుకుందన్నారు. -
భారత్‌మాల : ఏపీకి 3, తెలంగాణకు 2
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ రహదారుల, మౌలిక వసతుల అబివృద్ధికి భారత్ ఒకసాక్షిలా మారనుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం దేశంలో నిర్మిస్తున్న ఆరు జాతీయ రహదారులే కాకుండా.. భారత్‌మాల ప్రాజెక్టు కింద మరో 44 ఎకనమిక్ కారిడార్ల అభివృద్ధికి కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు.. చెరో రెండు కారిడార్లను కేంద్రం ప్రకటించింది. భారత్ మాల ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది డిసెంబర్లో మొదలవుతాయని కేంద్రమంత్రి గడ్కరీ సూచనప్రాయంగా తెలిపారు. భారత్ మాల ప్రాజెక్టు కింద మొత్తం 44 ఎకనమిక్ కారిడార్లు, 65 ఇంటర్ కారిడార్లు, 115 ఫీడర్ కనెక్టివిటీ రోడ్లు నిర్మిస్తారు. ఇదే విషయాన్ని గడ్కిరీ తన ట్విటర్లో ప్రకటించారు. మొత్తం 7 లక్షల కోట్లతో కేంద్ర ప్రబుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రహదారులను నిర్మిస్తోంది. భారతదేశ మౌలిక వసతుల కల్పనలో ఇదొక సువర్ణ అధ్యాయమని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కారిడార్లు ఇవే: 1. ముంబై-కోల్‌కతా 2. ముంబై-కన్యాకుమారి 3. అమృత్సర్-జామ్‌నగర్ 4. కాండ్లా-సాగర్ 5. ఆగ్రా - ముంబై 6. పూణె- విజయవాడ 7. రాయ్‌పూర్-ధన్‌బాద్ 8. లూథియానా-అజ్మీర్ 9. సూరత్ - నాగ్‌పూర్ 10. హైదరాబాద్ - పనాజీ 11. జైపూర్ - ఇండోర్ 12. షోలాపూర్ - నాగ్‌పూర్ 13. సాగర్ -వారణాసి 14. ఖరగ్‌పూర్ - సిలిగురి 15. రాయ్‌పూర్ - విశాఖపట్నం 16. ఢిల్లీ - లక్నో 17. చెన్నై - కర్నూల్ 18. ఇండోర్ - నాగ్‌పూర్ 19. చెన్నై- మధురై 20. మంగళూరు - రాయ్‌చూర్ 21. ట్యుటికోరిన్ - కొచ్చిన్ 22. షోలాపూర్ - బళ్లారి 23. హైదరాబాద్ - ఔరంగాబాద్ 24. ఢిల్లీ - కాన్పూర్ 25. సాగర్ - లక్నో 26. సంభల్పూర్ - రాంచీ జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా.. బారత్మాల ప్రాజెక్టుకు మంగళవారంకేంద్రం ప్రభుత్వం ఆమెద ముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా.. 83,677 కిలోమీటర్ల రహదారిని రూ.7 లక్షల కోట్లతో కేంద్రం అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. భారత్‌మాల ప్రాజెక్టు వల్ల కోటి ఉద్యోగల సృష్టి జరుగుతుందని మంత్రి గడ్కరీ తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే.. భారత్ రహదారులు అమెరికా, జర్మనీల స్థాయికి చేరుతాయని ఆయన స్పష్టం చేశారు. BharatMala program includes development of 44 Economic Corridors, 66 Inter Corridor Routes & 116 Feeder Routes pic.twitter.com/fMBlHyUWuj — Nitin Gadkari (@nitin_gadkari) October 25, 2017 -
రాష్ట్రానికి రెండు ఎకనమిక్ కారిడార్లు
మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కొత్తగా రెండు ఎకనమిక్ కారిడార్ రహదారులు మంజూరయ్యాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. నార్కెట్‌పల్లి–నల్లగొండ–తిప్పర్తి–మిర్యాలగూడ–కొండ్రపోలు– పొందుగల మధ్య 98 కి.మీ. మేర, జడ్చర్ల– దామగ్నాపూర్–కర్ణాటక సరిహద్దు వరకు 109 కి.మీ. మేర రెండు రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. మంగళవారం ఈ మేరకు ఆయన రహదారులపై సమీక్షించారు. జూన్ 1వ తేదీ తర్వాత రోడ్లపై గుంతలు కనిపిస్తే అధికారులను సస్పెండ్ చేస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించిన నేపథ్యంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ రెండు ఎకనమిక్ కారిడార్లపై అధికారులతో చర్చించారు. సంబంధించిన డీపీఆర్‌లు సిద్ధం చేసి పంపాలని ఆదేశించారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.4,500 కోట్ల విలువైన పనులతో కూడిన వార్షిక ప్రణాళికకు అదనంగా ఆరాంఘర్, ఉప్పల్, ఎల్బీనగర్ కూడళ్లలో నిర్మించే మూడు ఎలివేటెడ్ కారిడార్లు జతయ్యాయని పేర్కొన్నారు. మొత్తంగా రూ.5,900 కోట్ల విలువైన పనులు రాష్ట్రానికి సాధించినట్టు వెల్లడించారు. జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణ ఇబ్బందులు అధిగమించేలా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. సీఎం ఆదేశించినట్టుగా రహదారులపై గుంతలు లేకుండా మే చివరి నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేల భవనాల నిర్మాణాన్ని వేగిరం చేసి సకాలంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో ఈఎన్సీలు రవీందర్రావు, గణపతిరెడ్డి, సీఈలు చంద్రశేఖరరెడ్డి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.