ECS
-
సీఈసీ, ఈసీల నియామక చట్టంపై స్టే ఇవ్వలేం: సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ: ‘ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (అపాయింట్మెంట్, కండీషన్స్ ఆఫ్ సరీ్వస్, టర్మ్స్ ఆఫ్ ఆఫీస్) చట్టం–2023’పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీఈసీ, ఈసీల నియామకానికి సంబంధించిన సెలక్షన్ కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత జయ ఠాకూర్, ఇటీవల ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ఇతర పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. పిటిషనర్లలో ఒకరి తరఫున సీనియర్ లాయర్ వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సీజేఐలతో కూడిన కమిటీ సిఫార్సుల మేరకు సీఈసీ, ఇతర కమిషనర్ల నియామకాలు చేపట్టాలని అనూప్ బరన్వాల్ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచి్చందని గుర్తుచేశారు. కొత్త చట్టంపై స్టే విధించాల్సిందేనని అసోసియేషన్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ప్రభుత్వ పాలనాయంత్రాంగం కింద పని చేస్తోందని ఆరోపించారు. అయితే, ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ అని, పాలనాయంత్రాంగం కింద పనిచేస్తోందని అనడం సరికాదని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యా నించారు. ‘‘ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్లు ఇప్పటికే నియమితులయ్యారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. నియమితులైన ఇద్దరు కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్సింగ్ సంధూపై ఎలాంటి ఆరోపణలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో చట్టంపై మధ్యంతర ఉత్తర్వు ద్వారా స్టే విధించడం గందరగోళానికి దారి తీస్తుంది. అలాగే వారి నియామకాన్ని నిలిపివేయలేం’’ అని జస్టిస్ సంజీవ్ ఖన్నా తేల్చిచెప్పారు. నూతన చట్టం ప్రకారం ఎంపికైన ఇద్దరు కమిషనర్ల నియామకంపై స్టే ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరింది. అయితే, ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన ప్రధాన పిటిషన్లను పరిశీలిస్తామని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా స్పందించాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 5 తేదీకి వాయిదా వేసింది. -
డీఆర్డీఓ డీ-4 డ్రోన్ టెక్నాలజీతో డ్రోన్ల దాడికి చెక్
కొద్ది రోజుల క్రితం జమ్ము ఎయిర్‌బేస్‌పై డ్రోన్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే, భవిష్యత్ కాలంలో డ్రోన్ల ద్వారా దాడి ఎక్కువ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దాడులను తిప్పికొట్టేందుకు ఇజ్రాయిల్ తరహా "ఐరన్ డోమ్" వ్యవస్థ రూపొందించాలని దేశంలోని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ డ్రోన్ల దాడులను నివారించేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) యాంటీ డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. డీ-4 యాంటీ డ్రోన్ వ్యవస్థ ద్వారా దేశంలోని కీలక రక్షణ కేంద్రాలను రక్షించుకోవచ్చు. డీఆర్డీఓలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్(ఈసీఎస్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ జిల్లెలమూడి మంజుల తెలిపిన వివరాల ప్రకారం.. "డీ-4 డ్రోన్ వ్యవస్థ ఆదివారం జమ్మూలో జరిగిన డ్రోన్ దాడులను ఇది గుర్తించగలదు. 4 కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లను గుర్తించి వాటిపై దాడి చేస్తుంది. అత్యంత దుర్బల ప్రదేశాలపై దాడి చేసే అవకాశం ఉన్న రోగ్ డ్రోన్లను గుర్తించి నాశనం చేయడమే ఈ వ్యవస్థ లక్ష్యం. రోగ్ డ్రోన్లను నాశనం చేయడానికి ఈ వ్యవస్థలో బహుళ సెన్సార్లు, రెండు వేర్వేరు విధ్వంసకర పరికరాలు ఉన్నట్లు" ఆమె తెలిపారు. డి-4 డ్రోన్ వ్యవస్థ ద్వారా శత్రు డ్రోన్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ జామ్ చేయడంతో పాటు, మైక్రో డ్రోన్ల హార్డ్ వేర్ నాశనం చేయగలదని డాక్టర్ మంజుల తెలిపారు. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ఈ ఏడాది జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా భద్రత కోసం ఈ డి-4 డ్రోన్ వ్యవస్థను ఉపయోగించారు. డి-4 డ్రోన్ వ్యవస్థతో ప్రమాదకర డ్రోన్ల ఉనికిని త్వరగా గుర్తించి ధ్వంసం చేయడం ద్వారా వాటి దాడుల నుంచి ప్రముఖ ప్రాంతాలను రక్షించుకోవచ్చని ఆమె వివరించారు. చదవండి: ఆకట్టుకుంటున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ -
తీర్మానం లేకుండానే బిల్లుల చెల్లింపు
రేగోడ్ : పంచాయతీ తీర్మానం లేకుండానే అధికారులు బిల్లులు చేస్తున్నారని సర్పంచ్ శామయ్య మండిపడ్డారు. మండలంలోని చౌదర్పల్లి గ్రామంలో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. వచ్చే ఏడాది ఈసీఎస్ ద్వారా కూలీలకు ఏఏ పనులు చేపట్టాలనే విషయంపై చర్చించారు. గ్రామంలో వ్యవసాయ క్షేత్రాలకు రోడ్లు, ఊటకుంటలు, కుంటల వంటి పనులు చేయాలని గుర్తించారు. గ్రామంలో గత వేసవిలో ట్యాంకర్ ద్వారా నీళ్ల సరఫరా చేశామని, బిల్లులు నేటికీ ఎందుకు మంజూరు చేయలేదని సర్పంచ్ అధికారులను నిలదీశారు. ఈ క్రమంలో సర్పంచ్, అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. బిల్లులు మంజూరు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. పంచాయతీ తీర్మానం లేకుండానే అధికారులు ఇతరులకు బిల్లులు చేల్లిస్తూ తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ణప్తి చేశారు. గ్రామసభలో ఎంపీడీఓ బస్వన్నప్ప, ఏపీఓ జగన్, పంచాయతీ కార్యదర్శి కృష్ణాచారి, ఫీల్డ్ అసిస్టెంట్ జైపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రీమియంల చెల్లింపులకు ‘ఈ’ దారి రహదారి..
కృష్ణకు కూతురంటే ఎంతో ఇష్టం. ఆమె ఉన్నత విద్యకు చైల్డ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. మూడు నెలలకు ఒకసారి ప్రీమియం చెల్లిస్తున్నాడు. పాలసీ మురిగిపోకుండా సమయానికి ప్రీమియం చెల్లించడం ఆయన పద్ధతి. అయితే ఇందుకు భిన్నంగా జరిగిపోయింది. రెండు ప్రీమియంలు వరుసగా చెల్లించలేకపోయాడు. మార్కెటింగ్ ఉద్యోగంలో పలు ప్రాంతాలు తిరగాల్సిరావడం దీనితో సంబంధిత కార్యాలయానికి వెళ్లి ప్రీమియం చెల్లించడానికి తగిన సమయం అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం. ఫలితం పాలసీ మురిగిపోయే పరిస్థితి ఏర్పడింది. తిరిగి పునరుద్ధరించుకోడానికి కొంత సమయం, ప్రయాస తప్పదు. కృష్ణకే కాదు. చాలా మందికి ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే ఉంటుంది. అయితే ఇలాంటి వారికందరికీ ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ (ఈసీఎస్) చక్కని మార్గం. ఆటోమేటిక్ ప్రీమియం చెల్లింపులకు సులభమైన పద్ధతి. ఇక బిజీ కస్టమర్లకు ఈసీఎస్ ఎంతో సౌకర్యవంతం. ఈసీఎస్ అంటే ఏమిటి? ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరొక అకౌంట్‌కు ఆటోమేటిక్‌గా డబ్బు బదలాయింపునకు ఉద్దేశించినదే ఈసీఎస్. బీమా ప్రీమియంల నుంచి మరే ఇతర బిల్లు చార్జీల చెల్లింపులైనా క్రమబద్ధంగా జరపడానికి ఇది చక్కని మార్గం. ఉదాహరణకు నిర్ణీతకాలంలో క్రమానుగుణంగా ప్రీమియం సొమ్ము చెల్లింపునకు వీలుగా మీ బ్యాంక్ అకౌంట్‌కు పాలసీ నంబర్‌కు అనుసంధానం చేయడం, దీనివల్ల ఎటువంటి ఇబ్బందీ లేకుండా సంబంధిత మొత్తం గడువుతేదీనాటికి మీ ప్రీమియం కింద జమవుతుంది. ఈ అనుసంధానం తరువాత, డిఫాల్ట్, ల్యాప్స్... వంటి పదాలకే అవకాశం ఉండదు. వ్యక్తిగత శ్రమా తప్పుతుంది. డబ్బుకూ భరోసా ఉంటుంది. ఈ విధానంలో పాలసీ హోల్డర్ అకౌంట్, పాలసీ వివరాలు సైతం రహస్యంగానే ఉండడం మరో ప్రత్యేకత. పైగా ఈ సౌకర్యం వినియోగించుకున్నందుకు అటు బ్యాంక్ గానీ, ఇటు బీమా కంపెనీగానీ మీపై ఎటువంటి అదనపు చార్జీల భారం విధించబోవు. బ్యాంక్, బీమా వంటి సంస్థలకు కూడా ఈ విధానం విస్తరణ వల్ల వ్యయ, నిర్వహణా పరమైన ఇబ్బందులు చాలా వరకూ తగ్గిపోతాయి. ప్రారంభం ఎలా..! ఈసీఎస్ సౌలభ్యం పొందడానికి తొలుత మీరు పాలసీ కడుతున్న బీమా సంస్థ ద్వారాగానీ లేక మీ అకౌంట్ ఉన్న బ్యాంక్ ద్వారాకానీ ఆన్లైన్లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. లేదా స్వయంగా ఆయా సంస్థల నిర్దేశిత దరఖాస్తులను పూర్తిచేసి సమర్పించినా తదుపరి ఆన్లైన్ అనుసంధాన వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఆయా సందర్భాల్లో కొన్ని సంస్థలు ఒక కేన్సిలేషన్ చెక్‌ను కూడా కోరుతున్నాయి. డబ్బు జమకు సంబంధించిన వివరాలు సైతం మీ మొబైల్‌కు లేదా మీ ఈ మెయిల్‌కు వచ్చే వ్యవస్థ ఇప్పుడు అందుబాటులో ఉంది. పట్టణ స్థాయి నుంచి నగరస్థాయి వరకూ దాదాపు ఇప్పుడు కస్టమర్లు అందరికీ ఈసీఎస్ మార్గం అందుబాటులోకి వచ్చేసింది. చివరిగా చెప్పేదేమిటంటే... మీ బ్యాంక్ అకౌంట్లో ‘చెల్లింపులకు తగిన డబ్బు’ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలన్న విషయం మీరు సదా గుర్తుంచుకోవాలి.