Edi Nijam
-
పట్టాలు తప్పి పిచ్చి రాతలు!
► విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై పచ్చ పత్రికలు పట్టాలు తప్పాయి. విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అధ్యక్షతన ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన అజెండాలో అసలు రైల్వే జోన్ అంశమే లేదు. అజెండాలో లేని అంశాన్ని చర్చించినట్లుగా, రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం తేల్చేసినట్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడబలుక్కుని తప్పుడు రాతలు రాశాయి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లాలన్నది వాటి పన్నాగం. దీనిపై వైఎస్సార్సీపీపీ నేత విజయసాయిరెడ్డి దీటుగా స్పందించారు. రైల్వే జోన్ రాకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని, వస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతిని మాకు రాసిస్తారా? అని సవాల్ విసిరారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పందిస్తూ.. రైల్వే జోన్ కచ్చితంగా ఏర్పాటవుతుందన్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని.. కొన్ని పత్రికలు సృష్టిస్తున్న వదంతులు నమ్మవద్దన్నారు. రైల్వే జోన్ రాకుంటే రాజీనామా చేస్తా సాక్షి, అమరావతి: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ నూటికి నూరు శాతం వచ్చి తీరుతుందని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విశాఖ రైల్వేజోన్‌పై ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు అభూత కల్పనలతో అవాస్తవాలను ప్రచురించాయని ధ్వజమెత్తారు. విభజన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన సమావేశంలో విశాఖ రైల్వే జోన్ అంశం ప్రస్తావనకే రాలేదని వెల్లడించారు. రైల్వే జోన్ వస్తే రామోజీరావు, రాధాకృష్ణ వారి పత్రికలను మాకు అప్పగిస్తారా? అని సవాల్ చేశారు. ఒకవేళ రైల్వే జోన్ రాకుంటే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్ముతూ కుల ప్రాతిపదికన ముందుకెళ్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి రాతలను ప్రజలెవరూ విశ్వసించరని చెప్పారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తలు అవాస్తవం అని తేలితే రామోజీ, రాధాకృష్ణ బహిరంగ క్షమాపణలు చెబుతారా? అని నిలదీశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ► విశాఖ కేంద్రంగా రాష్ట్రానికి రైల్వే జోన్ రావట్లేదని, అది కలగా మిగిలిపోతుందని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు బ్యానర్ కథనాలను ప్రచురించాయి. రైల్వే మంత్రిని వైఎస్సార్సీపీ ఎంపీల బృందం కలిసినప్పుడు అతి త్వరలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ఆయన స్వయంగా స్పష్టమైన హామీ ఇచ్చారు. ► ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రైల్వే జోన్ రాదని ఊహల్లో బతుకుతూ వాటిని ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. వారి పత్రికల్లో అవాస్తవాలు ప్రచురిస్తున్నారు. కేంద్రం నిర్వహించిన సమావేశంలో విశాఖ రైల్వే జోన్ అంశం చర్చకు రాలేదని తేలితే వారిద్దరూ బహిరంగంగా క్షమాపణలు చెబుతారా? ► పునర్విభజన చట్టంలో రైల్వేజోన్‌కు సంబంధించి చాలా స్పష్టంగా ఉంది. రాజధాని ఎక్కడైతే ఉందో ఆ రాజధానిని కొవ్వూరు మీదుగా తెలంగాణ ప్రాంతాలతో కలిసే విధంగా రైల్వే లైన్ నిర్మించి హైదరాబాద్‌తో అనుసంధానించాలనే అంశంపై చర్చ జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్రం వాటా సొమ్ము ఇవ్వాలనేది కేంద్ర ప్రతిపాదన. పునర్విభజన చట్టంలోనే చాలా స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి కొవ్వూరు మీదుగా రైల్వే లైన్ ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు కనెక్ట్ చేయాలని, ఆ మొత్తం నిధులను కేంద్రమే భరించాలనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. దీనికి సంబంధించిన చర్చ వచ్చింది. అంతేకానీ విశాఖ రైల్వే జోన్‌కు సంబంధించిన చర్చ జరగలేదు. ► విశాఖ రైల్వే జోన్ తప్పకుండా వస్తుంది. రైల్వే జోన్ కోసం వైఎస్సార్సీపీ ఎన్నో పోరాటాలు చేసింది. అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నూటికి నూరుశాతం విశాఖ రైల్వే జోన్ వచ్చి తీరుతుంది. రామోజీ, రాధాకృష్ణ అవాస్తవాలను ప్రచురిస్తూ కులాభిమానంతో స్థాయిని దిగజార్చుకోవద్దు. -
తప్పు బాబుదైనా... నెట్టేస్తే సరి!!
సిగ్గూఎగ్గూ.. ఉచ్చంనీచం అన్నీ వదిలేసి రాసే రాతలెలా ఉంటాయో... ‘ఈనాడు’ను చూస్తే అర్థమవుతుంది. 2019 మేలో ఎగువ కాఫర్‌డ్యామ్‌లో ఉంచిన గ్యాప్‌లను సకాలంలో పూడ్చకపోవటంవల్లే ప్రాజెక్టు ప్రధాన డ్యాం నిర్మించే చోట పెద్దపెద్ద గుంతలు పడ్డాయని, నదీగర్భం కోతకు గురైందని హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందం చెప్పిందనేది రామోజీరావు మాట. ఇదంతా పాలకుల ప్రణాళిక లోపమేనని, వారి వైఫల్యమేనంటూ రామోజీ రెచ్చిపోయారు. అసలు ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిందెప్పుడు? 2019 మే 30న కదా? ఆ ఏడాది జూన్ 14 నుంచే ఊహించని రీతిలో రాష్ట్రానికి వరదలొచ్చాయి. ఎగువ కాఫర్ డ్యామ్‌లో గ్యాప్‌ల గుండా నీటి ప్రవాహం పెరిగి ప్రధాన డ్యామ్ నిర్మించే చోట పునాది (డయాఫ్రమ్ వాల్) దెబ్బతింది. పెద్దపెద్ద గోతులు పడ్డాయి. మరి ఆ వైఫల్యం అధికారంలో ఉండి ఐదేళ్లూ ఆ పని చేయని చంద్రబాబుదా? లేక 15 రోజుల్లో చేయలేకపోయిన వై.ఎస్.జగన్‌దా? ఎవరి పాపాలు ఎవరికి అంటగట్టాలని చూస్తున్నారు రామోజీరావు గారూ? పోలవరాన్ని ప్రాజెక్టులా కాకుండా చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పటం పచ్చి నిజం. చంద్రబాబు దీన్ని పద్ధతి ప్రకారం కట్టకుండా కమీషన్లు వచ్చే పనులే ముందు చేశారన్నది కాదనలేని నిజం. ఈ ప్రాజెక్టులో ఏకంగా రూ.3,302 కోట్ల విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో రామోజీ వియ్యంకులకు చెందిన నవయుగకు కట్టబెట్టడం తిరుగులేని నిజం. అది కూడా ఈపీసీ పద్ధతి కాకుండా లంప్సమ్ (ఎల్ఎస్) విధానంలో!!. సాగునీటి ప్రాజెక్టుల చరిత్రలో ఇదే అతిపెద్ద స్కామ్ కూడా. ఈ నిజాలు చెప్పకుండా పదేపదే అర్ధసత్యాలు, అసత్యాలు రాయాలని.. వారంలో ఒకసారైనా పోలవరంపై కథనం రాసి తప్పుడు ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లాలని రామోజీరావు తనవారికి హుకుం జారీ చేయటం పచ్చి నిజం. అంతేకాదు!! అసెంబ్లీ సాక్షిగా బాబు–రామోజీల దోచుకో–పంచుకో–తినుకో (డీపీటీ) విధానాన్ని ఎండగడుతూ ముఖ్యమంత్రి చెప్పినవన్నీ పచ్చి వాస్తవాలు. మంగళవారం ‘నిపుణుల మాట వేరు’ అంటూ ‘ఈనాడు’ అచ్చేసిన వార్తలో అసత్యాలు ఒక్కొక్కటీ చూద్దాం... భారీ కోత... బాబు అవివేకం వల్ల కాదా? ఈనాడు: పోలవరం ప్రాజెక్టులో ఏ నిర్మాణం చేపట్టాలన్నా ముందు కేంద్ర జలసంఘం, కేంద్రం నియమించిన డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) అనుమతులు తీసుకోవాలి. డమాఫ్రమ్ వాల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణ పనులు ప్రారంభించే క్రమంలో ముందే ఆ అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపట్టారు. వాస్తవం: గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా అప్రోచ్ ఛానల్, స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులు పూర్తి చేశాక.. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి. ఇవి జరిగాక.. ఒకే సీజన్లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులు పూర్తి చేయాలనే షరతుతో కేంద్ర జలసంఘం 2018లో అనుమతి ఇచి్చంది. కానీ చంద్రబాబు ఈ అనుమతులకు ముందే అంటే... 2017 జూన్ 8నే ఎగువ కాఫర్ డ్యామ్‌కు టెంకాయ కొట్టేశారు. 2018లో వరదలు తగ్గాక ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులు ప్రారంభించారు. కానీ.. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపైగానీ.. అప్రోచ్ ఛానల్, స్పిల్ వే, స్పిల్ ఛానల్లను పూర్తి చేయడం గానీ ఏమాత్రం చేయలేదు. ఇదే అంశంపై నిర్వాసితులు కేంద్ర జల్ శక్తి శాఖకు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి (పీపీఏ) ఫిర్యాదు కూడా చేశారు. దాంతో.. నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని, తాము విధించిన నిబంధనల మేరకు పనులు చేయాలని మరోసారి నాటి టీడీపీ సర్కార్‌ను కేంద్ర జల్ శక్తి శాఖ, పీపీఏ ఆదేశించాయి. వాటిని చేయలేక మధ్యలోనే చంద్రబాబు చేతులెత్తేశారు. ఎగువ కాఫర్ డ్యామ్‌కు ఒక చోట 380 మీటర్ల మేర, మరో చోట 300 మీటర్ల గ్యాప్‌లు వదిలేశారు. 2019 జూన్ మధ్య నుంచే వర్షాలు మొదలయ్యాయి. ఆ సీజన్లో భారీ వరదొచ్చింది. అది 2.1 కిలో మీటర్ల వెడల్పున ప్రవహించాలి. కానీ ఎగువ కాఫర్ డ్యామ్‌లో వదిలిన ఖాళీలు... అంటే 680 మీటర్ల వెడల్పునే ప్రవహించాల్సి వచ్చింది. దాంతో ఉద్ధృతి ఎక్కువై ఇసుక కోతకు గురైంది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో రెండు చోట్ల భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ఇదే అంశాన్ని శాసనసభలో సీఎం చెప్పారు. దీన్ని వివరించి... తప్పు ఎవరిదని ఏ సామాన్యుడిని ప్రశ్నించినా.. చంద్రబాబుదేనని ఠక్కున సమాధానం చెబుతారు. ఒక్క రామోజీ తప్ప. గ్యాప్‌లు పూడిస్తే కాఫర్ డ్యామ్‌లు కొట్టుకుపోవా? ఈనాడు 2019, మేలో ఎగువ కాఫర్ డ్యామ్‌లో ఉంచిన గ్యాప్‌లను సకాలంలో పూడ్చకపోవడం వల్లే విధ్వంసం జరిగిందని హైదరాబాద్ ఐఐటీ నిపుణులు తేలి్చచెప్పారు. 2020లో గోదావరికి భారీ వరదలు సంభవించాయి. 22 లక్షల క్యూసెక్కులకుపైగా ప్రవాహాలతో కాఫర్ డ్యామ్ దిగువన, ప్రధాన డ్యామ్ గ్యాప్–1, గ్యాప్–2 ప్రాంతాల్లో భారీ ఎత్తున ఇసుక కోత పడిందని హైదరాబాద్ ఐఐటీ నిపుణులు తేల్చారు. వాస్తవం: 2014, జూన్ 8 నుంచి 2019, మే 29 వరకూ చంద్రబాబే అధికారంలో ఉన్నారు. అధికారం చేపట్టినప్పటి నుంచి 2016, డిసెంబర్ 30 వరకూ అంటే 31 నెలలపాటు పోలవరంలో చంద్రబాబు తట్టెడు మట్టి పోయించింది లేదు. నిర్మాణ బాధ్యతలను కేంద్రమే తీసుకున్నా... ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్ను అడ్డంపెట్టుకుని పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి.. కాంట్రాక్టర్లకు బాగా మిగిలి్చ, అధికంగా కమీషన్లొచ్చే ఈజీ పనులకే చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారు. పైన స్పిల్ చానెల్ పూర్తి చేసి... స్పిల్ వే నిరి్మస్తే నీరు అటు మళ్లుతుంది. అప్పుడు కాఫర్ డ్యామ్‌లు నిర్మించి ప్రధాన డ్యాం పనులు చేపడితే ఇబ్బందులుండవు. కానీ స్పిల్ వే పునాది స్థాయిలో ఉన్నప్పుడే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులు చేపట్టారు చంద్రబాబు. వాటిని కూడా పూర్తి చేయలేక చేతులెత్తేశారు. చివరకు ఎగువ కాఫర్ డ్యామ్‌లో ఖాళీలు (300 మీటర్లు, 380 మీటర్లు చొప్పున) వదిలేశారు. జగన్ సీఎంగా 2019, మే 30న బాధ్యతలు స్వీకరించారు. వెంటనే... అంటే జూన్ 14 నాటికే గోదావరి వరద పోలవరాన్ని ముంచెత్తింది. ఎలాంటి పనులూ చేయలేని పరిస్థితి. ఆ 15 రోజుల్లో... చంద్రబాబు ఐదేళ్లలో పూర్తి చేయలేని పనిని సీఎం వైఎస్ జగన్ చేయగలరా? హైదరాబాద్ ఐఐటీ నిపుణులు సకాలంలో పనులు పూర్తి చేయలేదని ఎత్తిచూపింది చంద్రబాబు సర్కార్‌నే. కానీ.. దాన్ని రామోజీ వక్రీకరించి.. వైఎస్ జగన్ సర్కార్‌పైకి నెట్టడానికి గోబెల్స్‌ను తలదన్నే రీతిలో చెప్పిన అబద్ధాన్నే పదే పదే చెబుతున్నారు. పైపెచ్చు కాఫర్ డ్యామ్‌లో ఖాళీలు పూడ్చకపోవటం వల్లే ప్రాజెక్టులో విధ్వంసం జరిగిందని, దాన్ని పూడ్చేసి ఉంటే ఇబ్బందులుండేవి కావని మార్గదర్శితో మందిని ముంచిన నిపుణుడి సలహా. ఎగువన స్పిల్ చానెల్ ద్వారా స్పిల్ వేకి ప్రవాహాన్నింకా అప్పటికి మళ్లించలేదు. అలా చేయకుండా కాఫర్ డ్యామ్ ఖాళీలు పూడ్చేస్తే మొత్తం నీరు నిండి కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయేది కాదా? కాఫర్ డ్యామ్ అంటే జస్ట్ మట్టి కట్ట. కిందకు పోయే దారి లేక అంతటి నీరు నిల్వ ఉంటే ఆ కాఫర్ డ్యామ్ తట్టుకోగలదా? ఇదేనా రామోజీ నీకు నిపుణులు చెప్పింది? ఇంతకీ ఎవరా నిపుణులు? పనుల్లో తీవ్ర జాప్యం చేసిందెవరు? ఈనాడు సరైన సమయంలో దిగువ కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తి చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని పీపీఏ తప్పు పట్టిన మాట వాస్తవం కాదా? వాస్తవం: ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేయలేక.. చంద్రబాబు సర్కార్ వదిలేసిన గ్యాప్‌ల వల్ల గోదావరి అధిక ఉద్ధృతితో ప్రవహించడం వల్ల దిగువ కాఫర్ డ్యామ్ 0 మీటర్ల నుంచి 640 మీటర్ల వరకూ కోతకు గురైంది. ఆ ప్రాంతంలో జెట్ గ్రౌటింగ్ చేస్తూ.. జియో మెంబ్రేన్ బ్యాగ్‌లలో ఇసుకను నింపి.. వాటిని అగాధం ఏర్పడిన ప్రాంతంలో వేసి.. వైబ్రో కాంపాక్షన్ చేస్తూ పూడ్చి.. 30.5 మీటర్ల ఎత్తుతో ఈ ఏడాది జూలై 31 నాటికి పూర్తి చేయాలని ఏప్రిల్ ఆఖరులో పీపీఏ, డీడీఆరీ్ప, సీడబ్ల్యూసీలు సూచించాయి. జియో మెంబ్రేన్ బ్యాగ్స్ వినియోగం తక్కువ. వాటి లభ్యత కూడా అంతంత మాత్రమే. అయినా సరే గుజరాత్, అస్సోంలలో వాటిని ఉత్పత్తి చేసే సంస్థలకు ఆర్డర్ ఇచ్చి.. 2.50 లక్షల జియో మెంబ్రేన్ బ్యాగ్స్‌ను సేకరించారు. జెట్ గ్రౌటింగ్ విఫలమవుతుండటంతో ఎక్కువ సమయం తీసుకోవడంతో పాటు కష్టమైన పాలీయురిథేన్ (పీయూ) గ్రౌటింగ్ చేస్తూ.. జూలై 9 నాటికే 20 మీటర్ల ఎత్తుకు దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేశారు. గోదావరికి అనుకోకుండా ఈ సారి వరదలు ముందే వచ్చాయి. దీంతో జూలై 10న అర్ధరాత్రి స్పిల్ వే నుంచి దిగువకు విడుదలైన వరద దిగువ కాఫర్ డ్యామ్ మీదుగా ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలోకి చేరి నిర్మాణ పనులను ముందుకెళ్లకుండా చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో జూలై 31 నాటికి దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేయడం ఎలా సాధ్యం రామోజీరావ్? ఇదే అంశాన్ని పీపీఏకు జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ వివరించారు. వరదలు తగ్గాక.. యుద్ధప్రాతిపదికన దిగువ కాఫర్ డ్యామ్ పూర్తి చేస్తామని ఇచ్చిన వివరణతో పీపీఏ సంతృప్తి చెందింది. వరదల్లోనూ పనులు చేస్తూ.. పూర్తి చేసినట్లు గ్రాఫిక్స్‌ను సృష్టించి.. అదే నిజమని నమ్మబలికే చంద్రబాబే అబద్ధాల్లో మీకు సరైన జోడీ. కళ్లుండి చూడలేకపోతే ఎలా? ఈనాడు అప్రోచ్ ఛానల్ పూర్తి చేశామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. కానీ.. ఇప్పటికీ పూర్తి కాలేదు. సులువుగా జరిగే మట్టి తవ్వకం పనులూ చేయలేదు. 2019లో సీఎం వైఎస్ జగన్ తొలి సమీక్ష నిర్వహించే నాటికే ప్రధాన డ్యామ్ పనులు 64.08 పనులు పూర్తయ్యాయి. తాజా నివేదికల ప్రకారం 76 శాతం పనులుపూర్తయ్యాయి. మూడేళ్లలో 12 శాతం పనులు చేయడాన్ని గణనీయమైన ప్రగతి అంటారా? వాస్తవం: చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దితూ పోలవరం ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసే దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. కరోనా వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ రికార్డు సమయంలో 48 గేట్లతోసహా స్పిల్ వేను పూర్తి చేశారు. అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేశారు. ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసి.. 2021, జూన్ 11న 6.1 కిమీల పొడవున గోదావరి ప్రవాహాన్ని మళ్లించారు. ఇది గణనీయమైన ప్రగతి కాదా? కళ్లుండి చూడలేకపోతే ఎలా రామోజీ..? అధికారంలో మీ బాబు ఉంటే ఇవన్నీ మీకు త్రీడీలో కనిపించేవేమో!!. మీ బాబు గ్రాఫిక్స్ చూపించినా ప్రాజెక్టును పూర్తి చేసినట్లు బాకాలూదటంలో ఆరితేరిన మీకు తస్మదీయుడు సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసిన పనులు కన్పించకపోవటంలో ఆశ్చర్యమేమీ లేదు. పునరావాసానికి పెద్దపీట.. ఈనాడు పీపీఏ లెక్కల ప్రకారం 9,229 మందికే పునరావాసం కల్పించారు. ఇంకా 9,390 మందిని తరలించాలి. ఇందుకు ఇంకా రూ.2173.61 కోట్లు అవసరం. నిజానికి పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్ 41.15 మీటర్ల స్థాయికి పూర్తి చేయడానికి ముందే వీరికి పునరావాసం కల్పించాలి. వాస్తవం: 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో 20,946 కుటుంబాల ప్రజలు నిర్వాసితులు అవుతారు. ఇందులో 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందే 207 కుటుంబాలకు రూ.44.77 కోట్ల వ్యయంతో పునరావాసం కల్పించారు. 2014 నుంచి 2019 వరకూ టీడీపీ సర్కార్ హయాంలో 3073 కుటుంబాలకు రూ.193 కోట్లతో పునరావాసం కల్పించారు. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని వారికి చంద్రబాబు సర్కార్ పునరావాసం కల్పించకుండా ఎగువ కాఫర్ డ్యామ్ పనులు చేస్తుంటే అప్పట్లో అది ‘ఈనాడు’కు కనిపించనే లేదు. నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తే కమీషన్లు రావన్న ఉద్దేశంతోనే చంద్రబాబు వాటిని పట్టించుకోలేదన్నది రామోజీ తప్ప జగమెరిగిన వాస్తవం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ మూడేళ్లలో 10,330 నిర్వాసితుల కుటుంబాలకు రూ.1773 కోట్లతో పునరావాసం కల్పించారు. మిగతా 6,836 కుటుంబాలకు పునరావాసం కల్పించే పనులు శరవేగంగా సాగుతుండటం కళ్లున్న కబోది రామోజీకి కన్పిస్తాయనుకోవడం అత్యాశే. -
ఇసుక కాదది.. ఎల్లో బురద
అయ్యా... రామోజీరావూ!! కాస్త సలహా చెప్పకూడదూ.. రాష్ట్రంలో ఇసుక ఎలా విక్రయించాలో? ఎవరిద్వారా విక్రయించాలో? ఎంతకు విక్రయించాలో? ఎందుకంటే మీ సలహా సూచనల ప్రకారం.. మీ అదుపాజ్ఞల్లో నడిచే చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు. కాబట్టి మీ వాటాలు మీకు రావు. ఆ కడుపుమంటతో రగిలిపోతూ మీరు రాసే కథనాలకు విశ్వసనీయత కాదు కదా... వాటిలో వీసమెత్తు విజ్ఞత కూడా ఉండటం లేదు. ఎందుకంటే జాతీయ స్థాయిలో టెండర్లు పిలిచి జేపీ సంస్థకు అప్పగిస్తే... ఇక్కడి సంస్థలు లేవా అంటూ వాపోయింది మీరే. ఆ సంస్థ చెన్నైకి చెందిన మరో సంస్థకు సబ్ కాంట్రాక్టుకిస్తే... రీచ్‌లన్నీ తమిళనాడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయని, లేబర్ కూడా కనీసం తెలుగువారు లేరని ఆక్రందనలు చేసిందీ మీరే. ఇప్పుడేమో ఏమీ లేకున్నా... చెన్నై సంస్థ తప్పుకుంటోందని, అంతా స్థానిక నేతల చేతుల్లోకి వెళ్లిపోతోందని గుండెలు బాదుకుని రోదిస్తున్నదీ మీరే!!. అసలేంటి మీ బాధ? ప్రభుత్వ వ్యతిరేకత అనే ఏకసూత్ర ఎజెండాతో రోజూ కాలాల కొద్దీ వార్తలు వండి వారుస్తున్న మీకు... మనస్సాక్షి ఉండదా? పోనీ మీ పాఠకులకైనా అది ఉంటుందని మీరనుకోరా? బాబుకు అధికారం లేకపోతే.. ఆయన, మీరు ఇలా పోటీపడి మరీ దిగజారిపోవాలా!? అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నివాసం సమీపంలో కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలు (ఫైల్) ఈ రాష్ట్రంలో ఏ మంచిపని జరిగినా ‘ఈనాడు’కు నచ్చదు. ‘వైఎస్సార్ కళ్యాణమస్తు’ పేరిట నిరుపేదల కళ్యాణానికి ప్రభుత్వం బాసటగా నిలవటమనేది రామోజీ ఒంటిపై తేళ్లూజెర్రులూ పాకించినట్లుంది. అందుకే ఆ వార్తకు ప్రాధాన్యమివ్వకుండా పాఠకుల్ని పక్కదోవ పట్టించడానికి ‘ఇక నేతలదే ఇసుక’ అనే బురద కథనాన్ని పతాక శీర్షికల్లో వార్చేశారు. అసలు చంద్రబాబునాయుడి హయాంలో జరిగిన ఇసుక దోపిడీని వర్ణించడం సాధ్యమా? ఉచితమనే పేరుతో టీడీపీ లీడర్లంతా దందా చేస్తూ... జనానికి భారీ రేట్లకు విక్రయిస్తూ సాగించిన అరాచకాలపై ‘ఈనాడు’ ఏనాడైనా ఒక్క అక్షరం ముక్క రాసిందా? అడ్డు వచ్చిన మహిళా అధికారిని టీడీపీ ఎమ్మెల్యే జుట్టుపట్టుకుని ఈడ్చేసినా... చంద్రబాబు ఇంటి పెరట్లో రాత్రీపగలూ లారీలకొద్దీ ఇసుకను కుమ్మేసినా అదంతా బాబు ఘనతేనని చెబుతూ తరించిపోయారు రామోజీరావు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక వీటన్నిటికీ అడ్డుకట్ట వేయడంతో పాటు... ఏటా ప్రభుత్వానికి రూ.750 కోట్లు... అంటే ఐదేళ్లలో దాదాపు రూ.4వేల కోట్లు ఆదాయం వచ్చేలా చేశారు. ఆ టెండర్లను కూడా జాతీయ స్థాయిలో... కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. నిజంగా ఇసుక విక్రయం తాను రాసినంత లాభసాటిగా ఉంటుందని భావిస్తే ఆనాడే రామోజీరావు నేరుగా రూ.120 కోట్లు డిపాజిట్ కట్టి టెండర్లలో పాల్గొని ఉండొచ్చు. అలా చేయకుండా విమర్శలు చేయటాన్ని ఏమనుకోవాలి? ఫైల్ ఫొటోలు మీకసలు కల్లోనైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా? ఇప్పుడు ఇసుకపై ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. పైపెచ్చు ప్రజలకు ఏ ధరకు విక్రయించాలో ప్రభుత్వమే నిర్దేశిస్తోంది. ఇందుకోసం ‘ఈనాడు’తో సహా పత్రికల్లో ప్రతి ఆదివారం ప్రకటనలిస్తోంది. దీన్లోనే ధరను నిర్దేశించటంతో పాటు... ఆ ధరకు విక్రయించకపోతే ఫిర్యాదు చేయాల్సిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) నెంబర్లూ ఇస్తోంది. ఫిర్యాదులొచ్చిన చోట ఎస్ఈబీ దాడులు చేయటమే కాక కేసులూ నమోదు చేస్తోంది. ఇవి చాలవా రామోజీ... ఇసుక విషయంలో ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందో చెప్పటానికి? అసలు చంద్రబాబు హయాంలో వీటిలో ఏ ఒక్కటైనా ఉందా? ప్రభుత్వ ఖజానాకు పైసా కూడా రాలేదు. అలాగని ప్రజలకూ ఫ్రీగా అందలేదు. ఇప్పటికన్నా ఎక్కువ ధరలకే విక్రయించారు. ఇక నేతల దందాపై ఫిర్యాదు చేసే అవకాశం లేదు. చేసినా పట్టించుకునే దిక్కూ లేదు. నేతలు చెలరేగిపోయి దౌర్జన్యాలకు పాల్పడినా... వాటన్నిటినీ హీరోగారి చర్యల్లానే చూస్తూ తాదాత్మ్యం చెందారు రామోజీరావు. ఇప్పుడు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా... వాటికి లేని రంధ్రాలు వెదుకుతూ మరీ దిగజారుడు కథనాలు అచ్చేయటమే ఘోరాతిఘోరం. సబ్ కాంట్రాక్టులకివ్వటం తప్పా? ప్రభుత్వమైనా, ప్రయివేటు సంస్థలైనా కాంట్రాక్టు ఇచ్చేటపుడు కొన్ని అర్హతలను నిర్దేశించి, కాంట్రాక్టు సంస్థకు కొన్ని నిబంధనలు విధిస్తారు. ఆ అర్హతలకు లోబడి కాంట్రాక్టును సాధించిన సంస్థ... సదరు నిబంధనలను పాటిస్తోందో లేదో పర్యవేక్షించటమే ప్రభుత్వ విధి. ఆ నిబంధనలకు లోబడి సదరు కాంట్రాక్టు సంస్థ ఎవరికైనా సబ్ కాంట్రాక్టుకి స్తే వద్దనే హక్కు ఎవరికీ ఉండదు. ఇవన్నీ రామోజీకి తెలియనివి కావు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను చంద్రబాబు నాయుడు టీడీపీ నేత శ్రీనివాస్‌కు అప్పగిస్తే... ఆయన సదరు పనులను సీఎం రమేష్ కంపెనీకి సబ్ కాంట్రాక్టుకిచ్చాడు. ఇక పోలవరం పనుల్లో ఏకంగా రూ.3వేల కోట్లకుపైగా పనుల్ని రామోజీ వియ్యంకుల కంపెనీ నవయుగకు కేవలం నామినేషన్‌పై ఇచ్చేశాడు చంద్రబాబు. ఇవన్నీ ‘ఈనాడు’కు సమయోచిత నిర్ణయాలుగా కనిపించటమే దౌర్భాగ్యం. నిరంతర పర్యవేక్షణ... అవసరమైన నిల్వలు జేపీ సంస్థ నిర్వహిస్తున్న ఇసుక రీచ్‌లు, ఇసుక డిపోలను గనుల శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఎప్పటికప్పుడు ఇసుక నిల్వలు, ఏ మేరకు అనుమతులకు దరఖాస్తు చేశారనే దానిని గనుల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకోవడం సాధారణం. దీనికి విరుద్ధంగా.. ఇప్పటివరకు గనుల శాఖ రీచ్‌లు, ఇసుక డిపోలను పరిశీలించనే లేదంటూ ‘ఈనాడు’ అచ్చేసిన కథనం లక్ష్యం ప్రభుత్వంపై విషం చిమ్మటమేననటానికి నిదర్శనం... ఆ శాఖ వివరణ కూడా తీసుకోకపోవటమే. మరో విశేషమేంటంటే చంద్రబాబు హయాంలో వర్షాకాలం 4 నెలల పాటు ఇసుక లభించక రాష్ట్రంలో భవన నిర్మాణ పనులు నిలిచిపోయేవి. కారి్మకులు ఉపాధి లేక ఇబ్బందులు పడేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దీనికి ప్రణాళికాబద్ధంగా అడ్డుకట్ట వేసింది. వర్షాకాలంలోనూ ఇసుక లభ్యమయ్యేందుకు దాదాపు 50 లక్షల టన్నులకుపైగా ఇసుకను డిపోల్లో నిల్వ చేయించారు. దీంతో ఎక్కడా నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడలేదు. ఇవన్నీ ‘ఈనాడు’ చెప్పదు. ఇసుక ఆపరేషన్స్‌పై పటిష్టమైన నిఘా రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్‌పై పటిష్టమైన నిఘా వ్యవస్థ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జేపీ వెంచర్స్ ఇసుక విక్రయాలకు క్యూఆర్ కోడ్‌తో ఉన్న రశీదులను జారీ చేస్తోంది. ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించకుండా సరిహద్దు చెక్ పోస్ట్‌ల వద్ద కట్టుదిట్టమైన నిఘా ఉంది. ఎస్ఇబి, గనుల శాఖ, రెవెన్యూ, స్థానిక పోలీస్ అధికారులకు అక్రమ తవ్వకాలు, రవాణాపై చర్యలు తీసుకునే అధికారమిచ్చింది. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా కేసుల్లో రెండు లక్షల జరిమానాతో పాటు రెండేళ్ళ పాటు జైలు శిక్ష కూడా విధించేలా చట్టంలో మార్పులు చేశారు. ప్రతి జిల్లాకు విజిలెన్స్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. ఇలాంటి వాస్తవాలతో పనిలేదు కాబట్టి రామోజీ తన మార్కు పాత్రికేయానికి పదునుపెడుతున్నారు. ఆ వేల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయి? ఇప్పుడు ఇసుకను కాంట్రాక్టుకు ఇవ్వటం ద్వారా ప్రభుత్వానికి ఐదేళ్లలో వచ్చే రూ.4వేల కోట్లు అప్పుడు ఐదేళ్లలో ఎవరి జేబుల్లోకి పోయాయన్నది జవాబులేని ప్రశ్నేమీ కాదు. చంద్రబాబు, ఆయన మీడియా మిత్రులైన ట్రిపుల్ ఆర్ (రామోజీ, రాధాకృష్ణ, టీవీ5 రవీంద్రనాథ్ నాయుడు) చేతుల్లోకేనన్నది ఎవరికీ తెలియనిదీ కాదు. ఈ చతుష్టయం బరి తెగించేసి దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) అంటూ చెలరేగి పోయిందని, అవన్నీ ఇప్పుడు సాగటం లేదు కనకే ఇసుకపై నిత్యం ఏదో ఒకటి రాస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారనేది జగమెరిగిన సత్యం. అందులో భాగమే... ఆదివారంనాటి కథనం. ఎక్కడో చెన్నైలోని హోటల్లో సమావేశం జరిగిందని, అందులో ఒక నిర్ణయం తీసేసుకున్నారని... అందులో పాల్గొన్నట్టుగా, బల్లకింద ఉండి గమనించినట్లుగా రామోజీ రాసి పారేయడాన్ని ఏమనుకోవాలి? కళ్యాణమస్తు అనే మంచి పథకానికి ప్రచారం కల్పించకుండా ఉండేందుకే ఇలా చేశారనుకోవాలి. అయినా సబ్ కాంట్రాక్టు ఎవరికివ్వాలనే దానిపై జేపీ సంస్థ అత్యంత రహస్యంగా, స్టార్ హోటల్లో చర్చలు జరపాల్సినంత అవసరం వుందా? ‘ఈనాడు’ రాసినట్లు నిజంగా వైసీపీ నాయకులే ఇసుక తవ్వకాలు, తరలింపులు చేస్తుంటే ప్రభుత్వం ఎస్ఈబీని ఎందుకు ఏర్పాటు చేస్తుంది? అక్రమంగా తరలించిన వారిపై కేసులెందుకు పెడుతుంది? ఇదంతా రామోజీరావు బుర్రకు తట్టదా? తట్టకేం... కావాలని నాలుగు రాళ్లు్ల విసిరితే సరి అనుకునే పాత్రికేయం మరి. ఇవీ... ఇసుక వెనక నిజాలు ► పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నిర్వహించిన టెండర్లలో.. రెండేళ్లపాటు రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ నిర్వహించే కాంట్రాక్టును జేపీ పవర్ వెంచర్స్ సంస్థ దక్కించుకుంది. దీనికోసం ఏటా ప్రభుత్వానికి రూ.750 కోట్లు చెల్లిస్తోంది. ► సబ్ కాంట్రాక్టుకు ఇవ్వాలా.. వద్దా? ఎవరికివ్వాలి? వంటివన్నీ పూర్తిగా కాంట్రాక్టు సంస్థ ఇష్టం. సబ్ కాంట్రాక్టరు ఎవరైనా బాధ్యత మాత్రం జేపీదే. ► ఇందులో భాగంగానే జేపీ సంస్థ టర్న్ కీని ఎంచుకుంది. దీంతో ప్రభుత్వానికెలాంటి సంబంధం ఉండదు. ఇదే విషయాన్ని పలుమార్లు ప్రభుత్వం చెప్పినా... రామోజీ బురద రాతలు మానలేదు. ► ఇప్పుడు టర్న్ కీ సంస్థ తప్పుకుందంటూ... అదికూడా ప్రభుత్వ పెద్దలతో పొసగకనే అంటూ అడ్డగోలు రాతలకు దిగజారారు. అసలు సబ్ కాంట్రాక్టరు విషయంలోనే జోక్యం చేసుకోని ప్రభుత్వం, ఆ సబ్ కాంట్రాక్టరు పనుల్లో ఎందుకు జోక్యం చేసుకుంటుంది?