వాటర్ సప్లై ఈఈ నివాసంపై ఏసీబీ దాడి
హైదరాబాబాద్ : ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. నిజామాబాద్ వాటర్ సప్లయ్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సిరాజుద్దీన్ నివాసంపై ఏసీబీ అధికారులు సోమవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. హైదరాబాద్ విజయ్‌నగర్ కాలనీ జానకీపురంలోని సిరాజుద్దీన్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అధికారుల తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమాస్తులు బయటపడ్డాయి. సిరాజుద్దీన్‌పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ ఈ దాడులు చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.