కమెడియన్ ఫ్యాన్ అంటూ నవ్వుకున్నాక..!
ఓ నిందితుడు తప్పతాగి తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. ఏకంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి తాను సెన్సెషన్ రౌడీని, నన్ను అరెస్ట్ చేయండి అని అడిగితే.. అక్కడివారు నమ్మకపోగా, నువ్వు తమిళ స్టార్ కమెడియన్ వడివేలు అభిమానిలా ఉన్నాడంటూ నవ్వుకున్నారు. ఓ మూవీలో వడివేలు చేసిన తరహాలోనే ఆ నిందితుడు చేసేసరికి తాము పెద్దగా పట్టించుకోలేదని పోలీసులు చెప్పారు. నిందితుడి మాటతీరు, చెప్పే విషయాలను బట్టి అతడ్ని జోకర్ గా తేలికగా తీసుకున్నామని ఎగ్మోర్ పోలీసులు వెల్లడించారు.
దీపావళి పండుగరోజు నన్నాగి నగర్ లో జరిగిన ముగ్గురు యువకుల హత్య కేసులో నిందితుడిని అని సోమవారం రాత్రి చెప్పాడు. దీంతో అప్రమత్తమైన ఎగ్మోర్ పీఎస్ పోలీసులు కాస్త అప్రమత్తమై.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తన పేరు సంతోష్ కుమార్(28) అలియాస్ నందు అని చెప్పాడు. తాను ప్రస్తుతం మత్స్యకారుడిగా జీవనం సాగిస్తున్నానని, ఫ్యామిలీతో కలిసి పుడుపేట నుంచి కన్నాగి నగర్ మురికివాడకు ఈ మధ్య వచ్చామని తెలిపాడు.
ఎస్ కలియా అలియాస్ రంజిత్ కుమార్(22), టీ సెబాస్టియన్ అలియాస్ మిల్లర్(20), శక్తివేల్(22) అనే యువకుడు దీపావళి పండుగరోజు కన్నాగి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యకు గురయ్యారు. ఈ యువకుడు గంజాయి అక్రమ వ్యాపారం చేస్తుంటారని దర్యాప్తులో తేలింది. ఎగ్మోర్ పోలీసులు కన్నాగి నగర్ పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడు సంతోష్ నుంచి రాబట్టిన వివరాలతో ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేశామని కన్నాగి నగర్ పోలీసులు చెప్పారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటుచేసి ప్రధాన నిందితుడని పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటుమన్నామని కన్నాగి నగర్ పోలీసులు వివరించారు.