నేటి అర్ధరాత్రి నుంచి ఈహెచ్ఎస్ సేవలు బంద్
ఎంజీఎం : నెట్వర్క్ ఆస్పత్రుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ పథకం ద్వారా అందించే సేవలను శనివారం అర్ధరాత్రి నుంచి నిలిపివేస్తున్నట్లు ఆస్పత్రుల యాజమాన్యాలు ఒక ప్రకటనలో తెలిపాయి. గత ఏడాది జూలై నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి అందాల్సిన బకాయిలు రాకపోవడంతో తాము ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు సేవలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.