యదార్ధ సంఘటన ఆధారంగా ‘ఎక్కడికో ఈ అడుగు’
గోపీకృష్ణ-ప్రియాంక చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎక్కడికో ఈ అడుగు’.రాజు బొనగాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 'స్కై లైన్ ఎంటర్ టైన్మెంట్స్' పతాకంపై అట్లూరి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. 1990లో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకం తమకుందని, సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న తమ చిత్రాన్ని నవంబర్ ద్వితీయార్ధంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు రాజు బొనగాని తెలిపారు.
నిర్మాత అట్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ...చిత్ర నిర్మాణంతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ "ఇనావర్స్ స్టూడియోకు అప్పగించాం. మాకు ప్రామిస్ చేసిన బడ్జెట్ లో... మాకు ప్రామిస్ చేసిన దానికంటే మంచి క్వాలిటీతో పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఇనావర్స్ స్టూడియో వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఈశ్వర్ ఎల్లుమహంతి, సంగీతం: దిలీప్ బండారి.