ఆయన చాలా స్వీట్!
అందాల భరిణి కాజల్‌అగర్వాల్ కెరీర్ ప్రస్తుతం చాలా పీక్‌లో ఉందనే చెప్పాలి. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఏకకాలంలో ఇళయదళపతి విజయ్‌తో మెర్సల్ చిత్రంలోనూ, అజిత్‌లతో వివేగం చిత్రంలోనూ రొమాన్స్ చేస్తున్నారు. ఈ అమ్మడు గత 19వ తేదీన తన పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ట్విట్టర్లో అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు. వారితో కాజల్ ట్విట్టర్లోనే కాసేపు ముచ్చటించారు.
అభిమానులు అడిగిన ప్రశ్నలకు చాలా ఓపిగ్గా బదులిచ్చారు. అందులో వివేగం చిత్రం గురించి చెప్పమన్న అభిమాని ప్రశ్నకు ఈ చిత్రం గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేనని అన్నారు. అయితే అందులో తన పాత్రకు చాలా ప్రాముఖ్యం ఉంటుందని చెప్పారు. అజిత్ గురించి చెప్పమన్న ప్రశ్నకు ఆయన చాలా మంచి నటుడని పేర్కొన్నారు. వివేగం చిత్ర యూనిట్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు.
వెంటనే మరి విజయ్ గురించి అన్న ప్రశ్నకు విజయ్‌తో నటించిన తుపాకీ చిత్రంలో నటించిన పాత్ర తన మనసుకు చాలా దగ్గరగా ఉందని పేర్కొన్నారు. విజయ్ చాలా స్వీట్ పర్సన్ అని, అద్భుత నటుడని చెప్పింది. మెర్సల్ చిత్ర విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని కాజల్ పేర్కొన్నారు. పదేళ్ల నటన జీవితాన్ని పూర్తి చేసుకున్న కాజల్‌అగర్వాల్ తమిళం, తెలుగు, హిందీ మొదలగు భాషలతో కలిసి అర్ధ శత చిత్రాల మైలు రాయిని చేరుకున్నారన్నది గమనార్హం