before elections
-
Elections 2024: ముందస్తు ఎంపిక వెనుక
ఇంకా ఎన్నికల వేడి రాజుకోలేదు.. నోటిఫికేషన్ నగారా మోగలేదు అయినా బీజేపీ అయిదు రాష్ట్రాల ఎన్నికల కసరత్తు ముందుగానే ప్రారంభించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల తొలి విడత అభ్యర్థుల జాబితా వెల్లడించింది. కమలనాథులకు ఎందుకీ తొందర? అభ్యర్థుల ఎంపిక వెనుక వ్యూహమేంటి? భారతీయ జనతా పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అభ్యర్థుల్ని ప్రకటించి అసెంబ్లీ ఎన్నికల సమర శంఖాన్ని పూరించింది. మధ్యప్రదేశ్‌లో 39 మందితో, ఛత్తీస్‌గఢ్‌లో 21 మందితో తొలిజాబితా విడుదల చేసి ప్రత్యర్థి పార్టీల్లో ఎన్నికల వేడి పెంచింది. వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావించే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో (రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ) రెండు రాష్ట్రాల్లో కమలం పార్టీ ముందస్తుగా అభ్యర్థుల్ని ప్రకటించడం వెనుక దాగి ఉన్న వ్యూహంపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ ప్రాతినిధ్యం వహిస్తున్న పటాన్ నియోజకవర్గం నుంచి ఆయన సమీప బంధువు, బీజేపీ ఎంపీ విజయ్ భగేల్‌ను రంగంలోకి దింపి ఈసారి పోటీ రసవత్తరంగా ఉంటుందనే సంకేతాలు పంపింది. గతంలో ఒకసారి భూపేష్ భగేల్‌ను ఓడించిన ఘనత విజయ్‌కు ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జే.పీ నడ్డా తదితరులు హాజరైన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలోనే ముందస్తుగా అభ్యర్థుల్ని ఖరారు చేయాలన్న నిర్ణయానికొచ్చారు. సీట్లలో ఏబీసీడీ వర్గీకరణ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు ముందు అసెంబ్లీ స్థానాలను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించింది. గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలు – ఏ కేటగిరీ మిశ్రమ ఫలితాలు వచి్చన స్థానాలు – బీ కేటగిరీ బలహీనంగా ఉన్న స్థానాలు – సీ కేటగిరీ ఇప్పటివరకు గెలవని స్థానాలు – డీ కేటగిరీ సీ, డీ కేటగిరీ సీట్లపై దృష్టి సారించిన కమలనాథులు ఆయా సీట్లకే తొలి జాబితా విడుదల చేశారు. ఆదివాసీ ప్రాంతాలే గురి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఆదివాసీల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఇప్పటివరకు బీజేపీ పాగా వెయ్యలేకపోయింది. ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ కాంగ్రెస్‌కే పట్టు ఉంది. వారి ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికే ముందస్తుగా కసరత్తు పూర్తి చేసి బీజేపీ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించిన 21 స్థానాల్లో 10 ఎస్టీలకు రిజర్వ్ చేయబడినవే. ఇక మధ్యప్రదేశ్ విషయానికొస్తే 13 స్థానాలు ఎస్టీ రిజర్వ్ సీట్లు. ఆదివాసీ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రచారం చేయడానికి వీలుగా అభ్యర్థుల్ని ముందుగానే ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికలు బీజేపీకి చేదు ఫలితాల్నే మిగిల్చాయి. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ కేవలం 15 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచి్చంది. ఇక మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్థానాలకు గాను 109 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 114 సీట్లతో మెజారీ్టకి ఒక్క సీటు దూరంలో మిగిలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2020లో జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. ఈ సారి అలాంటి పరిస్థితి రాకూడదనే అభ్యర్థుల ఎంపిక కసరత్తు ముందస్తుగా మొదలు పెట్టింది. అంతర్గత సర్వేలు ఏం చెబుతున్నాయి ? మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ అంతర్గత సర్వేలు కాస్త ఆందోళన పుట్టించేలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో 40% మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉందని వెల్లడైంది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో 90 స్థానాలకు గాను 30 నుంచి 32 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశముందని సర్వేలో తేలింది. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఓటమితో బీజేపీ ఇక ఏ ఒక్క రాష్ట్రాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అత్యంత కీలకమైన హిందీబెల్ట్‌లో ఒక్క రాష్ట్రంలో ఓడిపోయినా లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం పడుతుందన్న ఆందోళన పార్టీ అగ్రనాయకుల్లో ఉంది. ముందస్తు జాబితాతో మేలే బీజేపీ అగ్రనాయకులు ఎంతో కసరత్తు చేసి తాము బలహీనంగా ఉన్న సీట్లలో అభ్యర్థుల్ని ప్రకటించారు. ‘‘ఈసారి ఎన్నికల్లో కొత్త వ్యూహాలు అనుసరించాల్సిన అవసరం ఉంది. ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించడం వ్యూహంలో భాగమే. అభ్యర్థులు నియోజకవర్గంలో ఎక్కువ సమయం కేటాయించి ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.’’అని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. అయితే ఇలా ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించడం వల్ల రెబెల్స్ బెడద కూడా ఉంటుంది. ఆ రిస్క్ తీసుకొని మరీ కమలనాథులు ముందడుగు వేశారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Independence Day 2023: వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ప్రధాని
Updates ఎర్రకోటలో కన్నుల పండువగా పంద్రాగస్టు వేడుకలు మరో వెయ్యేళ్లు భారత్ వెలుగుతూనే ఉంటుంది: ప్రధాని మోదీ ►2 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యం ►2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ►దేశంలో ఉగ్రవాద దాడులు తగ్గాయి ►దేశంలో తీవ్రవాదం, నక్సలిజం తగ్గాయి ►భారత్ ఇప్పుడు సురక్షితంగా ఉంది ►ప్రపంచానికి మిత్రుడిగా భారత్ మారింది ►140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం ►దేశాభివృద్ధే కాదు.. ప్రపంచాభివృద్ధిని కూడా భారత్ కోరుకుంటోంది ►మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్ల శిక్షణ ►దేశ ప్రజలందరికీ ఇంటర్నెట్ను అందుబాలోకి తీసుకువచ్చాం ►వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంటుంది ►ఆర్థిక వ్యవస్థలో అమెరికా, చైనా తర్వాత భారత్ ఉంటుంది ►భారత్ అభివృద్ధిపై నాకు పూర్తి విశ్వాసం ఉంది ►జన ఔషధితో ప్రజలందరీ చౌకగా మందులు ►జన ఔషధి కేంద్రాల సంఖయ 10 వేల నుంచి 25 వేలకు పెంచాం ►జన్‌ధన్ ఖాతాలో పేదల బతుకుల్లో వెలుగులు నింపాం ►మారుమూల గ్రామాలకు విద్యుత్ సదుపాయం కల్పించాం ►భిన్నత్వంలో ఏకత్వమే భారత్ బలం ►ప్రతి నిర్ణయంలో దేశానికి మొదటి ప్రాధాన్యత ►దేశంలో సుస్థిరమైన, శక్తివంతమైన ప్రభుత్వం ఉంది. ►గత పదేళ్లలో ఎన్నో కీలక సంస్కరణలు తీసుకుచవచ్చాం ►అన్ని రంగాల్లో దేశం ముందుకు వెళ్తోంది. ►వ్యవసాయ రంగంలోనూ దేశం చాలా అభివృద్ధి చెందింది. ►ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్ అభివృద్ధి చెందుతోంది. ►రాబోయే కాలాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ శాసిస్తుంది. ►క్రీడా రంగంలో యువత సత్తా చాటుతోంది. ►స్టార్టప్స్ రంగంలో టాప్-3లో భారత్ ఉంది. ►జీ-20 నిర్వహించే అరుదైన అవకాశం భారత్‌కు లభించింది. ►కరోనా మనకు ఎన్నో పాఠాలను నేర్పింది. ►కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా మారింది ►కరోనా సమయంలో ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్లాం ►ప్రపంచాన్ని మార్చడంలో భారత్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోంది. ►ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తున్నాం ►దేశ ఆర్థిక వ్యవవస్త బాగుంటే దేశం బాగుంటుంది. ►రూ, 4 లక్షల కోట్లతో పేదలకు ఇళ్లు నిర్మించాం. ►140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం ►పేద, మధ్య తరగతి వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ►పీఎం స్వనిధి పథకం ద్వారా 50 వేల కోట్లు ఖర్చు చేశాం ►సైన్యంలో వన్ ర్యాంక్-వన్ పెన్షన్ అమలు చేశాం ►అవినీతి రాక్షసి దేశాన్ని వెనక్కి తీసుకెళ్లింది ►ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ►సుస్థిర ప్రభుత్వంతో అభివృద్ధి జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ►దేశంలో సుస్థిర ప్రభుత్వం ఉంది, దేశాన్ని ముందుకు నడిపిస్తోంది. ►డెమోగ్రఫీ, డెమోక్రసీ, బయోడైవర్సిటీ ఈ మూడు భారత్‌కు ఎంతో ముఖ్యం ►గత పదేళ్లలో భారత్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందింది. ►నారీ శక్తి, యువశక్తి భారత్‌కు బలం ►భారత్‌లో యువశక్తి ఎంతో అద్భుతంగా ఉంది. ►టెక్నాలజీ విషయంలో భారత్ ఎంతో మెరుగుపడింది. ►డిజిటల్ ఇండియా దిశగా భారత్ దూసుకెళ్తోంది. ►గత పదేళ్లుగా భారత్ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తిస్తోంది. ►శాటిలైట్ రంగంలో మనమే ముందున్నాం. ►రాబోయే కాలాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్తిఉంది. ►30 ఏళ్ల లోపు యువత భారత్‌కు ఆశాకిరణం. ►వ్యవసాయ రంగంలోనూ దేశం చాలా అభివృద్ధి చెందింది. ►దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ ►ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. ►దేశం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారు. ►అమరవీరుల త్యాగఫలమే స్వాతంత్ర్యం ►ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి. ►గత పదేళ్లలో భారత్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందింది. ►దేశం మణిపూర్ ప్రజలకు అండగా ఉంది: ప్రధాని మోదీ ►మణిపూర్‌లో శాంతిస్థాపనకు కృషి చేస్తున్నాం. ►మణిపూర్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ► ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ ► గౌరవ వందనం స్వీకరించిన ప్రధాని మోదీ ►పూలవర్షం కురిపించిన హెలికాప్టర్లు ► ఎర్రకోటపై వరుసగా పదోసారి నరేంద్రమోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎర్రకోటపై పదోసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. ►ఈ స్వాతంత్ర్య దినోత్సవంతో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు ముగియనున్నాయి. ►ఆ తర్వాత జాతినుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. సామాన్యులే అతిథులు ►దేశం నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన 1,800 మంది ప్రత్యేక అతిథులు. ప్రత్యేక అతిథులుగా 400 మంది సర్పంచులు ►10 వేల మంది పోలీసులతో నాలుగు అంచెల భద్రత.. భద్రత కోసం 1000 సెక్యూరిటీ కెమెరాలు ►దేశ వ్యాప్తంగా ఘనంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవం ►ఢిల్లీలో కన్నుల పండువగా పంద్రాగస్టు వేడుకలు ►కాసేపట్లో ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయనున్న ప్రధాని ►రాజ్‌ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ప్రధాని మోదీ ►వరుసగా పదోసారి ప్రధాని నరేంద్ర మోదీ నేడు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేయనున్నారు. ►2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇదే ఆయన చివరి ప్రసంగం కానుంది. ►ఈ వార్షిక ప్రసంగంలో ప్రధాని మోదీ తన ప్రభుత్వ ప్రగతి రిపోర్టు, కీలక కార్యక్రమాలను ప్రకటించడంతోపాటు రానున్న సంవత్సరాల్లో దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలనుకుంటున్నారో కూడా వివరిస్తారు. ►2014 మొదలుకొని వివిధ రంగాల్లో దేశం సాధించిన ప్రగతిని వివరించడంతోపాటు భవిష్యత్ కార్యాచరణను ప్రధాని ప్రకటించనున్నారు. రాజకీయ పరమైన అంశాలను కూడా ఆయన స్పృశిస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. -
ఎన్నికలకు ముందే తెలంగాణ: దిగ్విజయ్
సాక్షి, న్యూఢిల్లీ: 2014 సాధారణ ఎన్నికలకు ముందే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఖాయమని, ఎన్నికలకు ముందే టీ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందుతుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాష్ట్రపతిని కలసి అఫిడవిట్లు ఇచ్చే బదులు చర్చలో పాల్గొని అభిప్రాయాలు చెబితే బాగుంటుందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు, కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనానికి ఎటువంటి సంబంధమూ లేదన్నారు. కాంగ్రెస్ పాలనాంశాలకు, రాజకీయాలకు ముడిపెట్టొద్దని మీడియాకు సూచించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఇక్కడ మీడియాతో దిగ్విజయ్ మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ అధినాయకత్వం వెనక్కి తగ్గబోదని మరోమారు నొక్కిచెప్పారు. ‘తెలంగాణ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అది చేస్తాం. మేనిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని చేర్చినప్పుడు సీమాంధ్ర నేతలు అంగీకరించారు. అన్ని రాజకీయ పార్టీలూ తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెప్పాయి. ఇప్పుడు ఇతర పార్టీలు వెనక్కి తగ్గినా ఇచ్చిన మాటపై కాంగ్రెస్ మాత్రం వెనక్కి తగ్గదు’ అని అన్నారు. ముసాయిదా బిల్లులో లోపాల విషయం తనకు తెలియదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరిబంతి వరకు పోరాడతానన్న సీఎం కిరణ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘ఆయన క్రికెటర్ కాబట్టి చివరి బంతి గురించి బాగా తెలుసు’ అని బదులిచ్చారు. దిగ్విజయ్‌తో బొత్స భేటీ! గత కొన్ని రోజులుగా ఢిల్లీలోనే ఉన్న పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంగళవారం మధ్యాహ్నం సుమారు 15 నిమిషాల పాటు దిగ్విజయ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత్రి సోనియాపై ఇష్టానుసారం మాట్లాడిన సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చే విషయంపై చర్చించినట్టు తెలిసింది. పార్టీకి తీవ్ర నష్టం జరిగేలా జేసీ వ్యవహరిస్తున్నారని, ఆయనని ఉపేక్షించడం సరికాదని బొత్స పేర్కొన్నట్టు సమాచారం. ఇతర పార్టీలతో జేసీ ఇప్పటికే ఒప్పందం చేసుకున్నారనే అంశం కూడా బొత్స ప్రస్తావించినట్టు తెలిసింది. దీనిపై దిగ్విజయ్ స్పందిస్తూ, జేసీకి తొలుత షోకాజ్ నోటీసులు పంపి వివరణ తీసుకోవాలని సూచించినట్టు విశ్వసనీయ వర్గాల కథనం. -
ఎన్నికలకు ముందే 2రాష్ట్రాలు