బీడీఎల్, ఈసీఐఎల్ మధ్య అవగాహన ఒప్పందం
హైదరాబాద్: భారత డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), భారత ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్(ఈసీఐఎల్)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. భారత రక్షణ రంగంలో క్షిపణులు, నీటి అడుగున ఆయుధ వ్యవస్ధ తయారీలో పరస్పర సహకారంతో పనిచేయాలని సోమవారం బీడీఎల్‌లో జరిగిన సమావేశంలో అంగీకారానికి వచ్చారు. ఈ మేరకు బీడీఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరక్టర్ వి. ఉదయ భాస్కర్, ఈసీఐఎల్ మేనేజింగ్ డైరక్టర్ పి. సుధాకర్‌లు అంగీకార పత్రా లపై సంతకాలు చేసినట్లు సీనియర్ డీజీఎం ఎసీ రావు తెలిపారు.