ఎలక్ట్రానిక్స్ దుకాణంలో చోరీ
ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని ఎలక్ట్రానిక్స్ దుకాణంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఆదివారం ఉదయం ఇది గుర్తించిన షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దుకాణం పై కప్పుకు రంద్రం చేసి ఉన్నట్లు గమనించడంతో.. దొంగలు అందులోంచే లోపలికి ప్రవేశించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దుకాణంలో ఉన్న సుమారు రూ. 50 వేల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపారు.