26న ఓపెన్ డిగ్రీ ప్రవేశ అర్హత పరీక్ష
అనంతపురం ఎడ్యుకేషన్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ)కోర్సులో ప్రవేశానికి ఈనెల 26న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ వై.శివచంద్ర తెలిపారు. ఆదివారం ఆర్ట్స్ కళాశాలలోని అధ్యయన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 16లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటర్, సమానమైన విద్యార్హత లేని వారు డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశానికి అర్హత పరీక్ష తప్పనిసరిగా రాయాల్సి ఉంటుందన్నారు.
అందుబాటులో ఉన్న నెట్కేంద్రానికి వెళ్లి ఠీఠీఠీ.bట్చౌఠౌn జీn్ఛ.జీn పోర్టల్‌ను ఓపెన్ చేస్తే అర్హత పరీక్ష దరఖాస్తు లింక్ ఉంటుందని వివరించారు. ఆ లింక్‌పై క్లిక్ చేయగానే దరఖాస్తు ఓపెన్ అవుతుందని, విద్యార్థి తన పూర్తి వివరాలు నమోదు చేసి ఫొటో స్కాన్ చేయాలని సూచించారు. అప్లోడ్ చేసిన దరఖాస్తును ప్రింట్ తీసుకుంటే దానిపై తొమ్మిది అంకెల సంఖ్య వస్తుందన్నారు. ఆసంఖ్య ఆధారంగా ఏపీ ఆన్లైన్ లేదా తెలంగాణ ఆన్లైన్ కేంద్రాల్లో కమీషన్‌తో కలిపి రూ. 310 ఫీజు చెల్లించి రశీదు పొందాలన్నారు. బ్యాంకు డెబిట్ కార్డు, క్రెడిట్‌కార్డు ద్వారా కూడా ఫీజు చెల్లించే వీలుందన్నారు. ఈ ఏడాది జూలై 1 నాటికి 18 ఏళ్లు పూర్తయ్యే వారు దరఖాస్తుకు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు 08554–222448, సెల్ 73829 29602 నంబర్లలో సంప్రదించాలని కోరారు.