'రుణాలు చెల్లించకపోతే ఆస్తుల జప్తుచేస్తాం'
-రైతు సేవా సహకార సంఘం చైర్మన్ స్వామికురుమ
-ఘట్కేసర్లో పాలకవర్గ సమావేశం
ఘట్కేసర్ టౌన్(రంగారెడ్డి జిల్లా)
మొండి బకాయిలు చెల్లించని వారికి ఇప్పటికే నోటీసుల ఇచ్చామని.. అయినా చాల మంది రుణాలు చెల్లించేందుకు ముందుకు రావడం లేదని రైతు సేవా సహకార సంఘం చైర్మన్ గొంగల్ల స్వామికురుమ, ఉపాధ్యక్షుడు ఎలిమినేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మొండి బకాయిలను వసూలు చేసేందుకు సదరు వ్యక్తుల ఆస్తులను జప్తు చేయనున్నట్లు స్పష్టంచేశారు. మండల కేంద్రంలోని సంఘం కార్యాలయంలో మంగళవారం పాలకవర్గ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 ఎకరాల భూమి గల రైతులకు రూ.10 లక్షల వరకు రుణం సౌకర్యం కల్పిస్తామన్నారు. మొండి బకాయిల ఖాతాలను సెటిల్ చేయడానికి సంఘం చట్టం 71 ప్రకారం ప్రత్యేకాధికారి హరిని నియమించారన్నారు. కార్యక్రమంలో డెరైక్టర్లు పన్నాల విజయలక్ష్మి, లక్ష్మమ్మ, పన్నాల ప్రభాకర్‌రెడ్డి, కొంతం అంజిరెడ్డి, ఆకిటి నర్సింహ్మారెడ్డి, మహేందర్, జవాది సత్తయ్య, బొక్క ప్రభాకర్‌రెడ్డి, రాజునాయక్, ఎండీ వెంకట్‌నారాయణ పాల్గొన్నారు.