పెట్రోల్ బంకులో దొంగల బీభత్సం
మేడ్చల్: పెట్రోల్‌బంక్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట వద్ద జాతీయ రహదారిపై ఉన్న భారత్ పెట్రోల్ బంక్‌పై సోమవారం ఉదయం దోపిడి దొంగలు దాడిచేశారు. బంక్‌లో విధులు నిర్వహిస్తున్న ఆరుగురు సిబ్బందిపై కత్తులతో దాడి చేసి గాయపర్చారు.
అనంతరం రూ. 12 లక్షల నగదుతో ఉడాయించారు. దోపిడీలో మొత్తం ఐదుగురు దుండగులు పాల్గొన్నట్లు గాయపడిన వారు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్యా సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.