తపాలా సేవలను విస్త్రృత పరుస్తాం
ఆలేరు : దేశవ్యాప్తంగా తపాలా సేవలను మరింత విస్తృతపరుస్తున్నట్లు జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ రమణారెడ్డి అన్నారు. ఆలేరులోని టీఎన్జీఓ భవనంలో ఆలేరు, యాదగిరిగుట్ట, రఘునాథపురం పరిధిలోని సిబ్బందికి పోస్టల్ సేవలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంక్‌ల మాదిరిగానే ఇక నుంచి తపాలా శాఖల ఆధ్వర్యంలో అన్ని సేవలు లభ్యమవుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఏఎస్పీఓ శ్రీనివాస్, ఆలేర్ బ్రాంచ్ మేనేజర్ రాములు, 3 మండలాల పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.