సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారు
ఏలూరు సిటీ : ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఈ నెల 18న జిల్లా పర్యటనకు రానున్నారు. స్మార్ట్ గ్రామాల్లో ఆయన పాదయాత్ర చేస్తారు. ఆదివారం ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10 గంటలకు రాజ మండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో ఉదయం 10.10 గంటలకు నిడదవోలు మండలం వేలివెన్ను వస్తారు. 10.30 గంటలకు వేలివెన్నులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, 11.30నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్మార్ట్ గ్రామాల్లో పాదయాత్ర చేస్తారు. శెట్టిపేట, తాళ్లపాలెం, శింగవరం, నిడదవోలు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ, గణేష్ చౌక్ మీదుగా చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం వరకు పాదయాత్ర సాగుతుంది. అనంతరం చంద్రబాబు బ్రాహ్మణగూడెం నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తారు.