ఏ విషయాన్నీ ‘సహించొద్దు’: కమల్ హాసన్
బోస్టన్: అసహన వివాదంపై చర్చలో భాగమయ్యేందుకు ప్రముఖ నటుడు కమల్ హాసన్ నిరాకరించారు. సహనం అనే పదానికి వ్యతిరేకినని చెప్పుకొచ్చారు. అమెరికాలోని హార్వర్డ్ వర్సిటీలో ఆదివారం విద్యార్థులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అసహన వివాదంపై మాట్లాడుతూ.. భారత్‌ను చేతుల్లేని స్వెటర్గా అభివర్ణిస్తూ ‘‘అది (భారత్) ఆకుపచ్చ సహా ఇతర రంగులతో కలిపి అల్లిన స్వెటర్. అందులోంచి ఆకుపచ్చ దారాన్ని లాగలేం. అలా చేస్తే స్వెటర్ మిగలదు. బంగ్లా, పాక్‌ల రూపంలో చేతులను కోల్పోయింది. మిగిలింది చేతుల్లేని స్వెటరే.’’ అని వ్యాఖ్యానించారు.