2017 నుంచి అన్ని ఫోన్లకూ పానిక్ బటన్
న్యూఢిల్లీ: ప్రమాద సమయాల్లో అత్యవసర ఫోన్‌కాల్స్‌ను మరింత సులభంగా చేసేందుకు వీలుగా 2017 జనవరి 1 నుంచి భారత్‌లో అమ్మే అన్ని ఫోన్లకు పానిక్ బటన్ ఉండాల్సిందేనన్న నిబంధనను తీసుకొచ్చినట్లు టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. 2018 జనవరి 1 నుంచి జీపీఎస్ కూడా కచ్చితంగా ఉండాలన్నారు. ఏప్రిల్ 22న విడుదలైన ఒక ప్రకటన ప్రకారం ఫీచర్ ఫోన్లలో 5 లేదా 9 నంబరు బటన్లను అత్యవసర కాల్స్ చేసే పానిక్ బటన్‌గా వాడాలి.