Emma Roberts
-
నిర్వాహకుల పొరపాటుపై హీరోయిన్ స్పందన.. అది నేను కాదు కానీ
Emma Watson Reacts To Mistake Of Harry Potter Hogwarts Reunion: అప్పుడప్పుడూ సినీ సెలబ్రిటీలు, చిత్ర యూనిట్ సభ్యులు తెలిసో తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అవి గమనించిన నెటిజన్లు మాత్రం కావాలనే ట్రోల్ చేస్తుంటారు. సెటైర్లు వేస్తుంటారు. నెటిజన్ల క్రియేటివిటీని చూసి తారలు, చిత్ర బృంద తమదైన శైలీలో స్పందిస్తారు. ఇంతకుముందు ఆర్ఆర్ఆర్ సినిమాలో ఐటమ్ సాంగ్ గురించి కామెంట్ చేసిన ఒక యూజర్‌కు 'నువ్ యాక్ట్ చేస్తావా' అని ఆ ఆర్ఆర్ఆర్ ట్విటర్ గ్రూప్ అడ్మిన్ స్పందించిన తీరు ఎంతోమందికి నవ్వు తెప్పిచ్చింది. ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా హ్యారీ పోటర్ 20వ వార్షికోత్సవాన్ని (Harry Potter Reunion Special) హెచ్‌బీవో మ్యాక్స్ నిర్వహించింది. ఇదీ చదవండి: అది ఇది కాదు.. ఎమ్మా వాట్సన్‌కు బదులు మరో హీరోయిన్ 'హ్యారీ పోటర్ 20వ వార్షికోత్సవం: రిటర్న్ టు హాగ్వార్ట్' (Hogwarts Reunion) పేరుతో టెలీకాస్ట్ చేసిన స్పెషల్ ఎపిసోడ్లో ఎమ్మా వాట్సన్‌కు బదులు ఎమ్మా రాబర్ట్స్ చిన్నప్పటి ఫొటో పెట్టి పొరపాటు చేశారు నిర్వాహకులు. దీనిపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పొరపాటుపై స్పందించింది ఎమ్మా వాట్సన్. మీక్కీ మౌస్ చెవులను ధరించిన ఎమ్మా రాబర్ట్స్ చిన్నప్పటి పిక్‌ను తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేస్తూ 'ఈ క్యూట్‌గా ఉన్నది నేను కాదు' అని క్యాప్షన్ ఇచ్చింది. అలాగే #వాట్సన్సిస్టర్స్ఫరెవర్ అని హ్యాష్‌ట్యాగ్ యాడ్ చేసింది. View this post on Instagram A post shared by Emma Watson (@emmawatson) ఇదీ చదవండి: స్పానిష్ నటి ఇంట్లో వినాయకుడి చిత్రపటం.. వైరల్ -
యో చూస్కో బడలా.. ఆమెకు బదులు మరో హీరోయిన్.. నెటిజన్ల ట్రోలింగ్
Emma Watson Or Emma Roberts Trolled In Harry Potter Reunion Special: హాలీవుడ్ నుంచి వచ్చిన హ్యారీ పోటర్ చిత్రం అంటే తెలియని వారుండరు. సినిమాలోని వింతలు, అద్భుతాలు పిల్లల నుంచి పెద్దవారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. 2011లో ఈ సిరీస్‌లోని ఎనిమిదో చిత్రం 'హ్యారీ పోటర్ అండ్ ది డెత్లీ హాలోస్ పార్ట్ 2'తో ఈ ఫ్రాంచైజీ ముగిసింది. నూతన సంవత్సరం సందర్భంగా హ్యారీ పోటర్ 20 వార్షికోత్సవాన్ని (Harry Potter Reunion Special) నిర్వహించింది హెచ్‌బీవో మ్యాక్స్. దీనికి 'హ్యారీ పోటర్ 20వ వార్షికోత్సవం: రిటర్న్ టు హాగ్వార్ట్' స్పెషల్ ఎపిసోడ్‌ను టెలికాస్ట్ చేశారు. హెచ్‌బీవో మ్యాక్స్ అందిస్తున్న ఈ స్పెషల్ ఎపిసోడ్ ఇండియాలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది. ఈ ఎపిసోడ్లో డేనియల్ రాడ్‌క్లిఫ్, ఎమ్మా వాట్సన్, తదితర సహ నటులు మెమరీ లేన్‌లో తమ అనుభవాలను పంచుకున్నారు. అయితే ఇందులో నిర్వాహకులు ఒక పెద్ద తప్పు చేశారు. ఎమ్మా వాట్సన్ తన అనుభవాలను చెబుతున్న సెగ్మెంట్లో ఆమెకు బదులు ఎమ్మా రాబర్ట్స్ చిన్న నాటి ఫొటోను చూపించారు. ఇందులో రాబర్ట్స్ మాంటేజ్ మిన్నీ మౌస్ చెవులను ధరించి ఉంటుంది. ఆ పిక్ 2012లో తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది ఎమ్మా రాబర్ట్స్. ఇది చూసిన ఎమ్మా అభిమానులు రీయూనియన్ నిర్వాహకులపై 'యో.. చూస్కో బడలే, అది ఇది కాదు' అన్నట్లుగా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంకా 'దయచేసి నాకు సహాయం చేయండి. తను కచ్చితంగా ఎమ్మా వాట్సన్ కాదు.. ఎమ్మా రాబర్ట్స్ అని చెప్పండి' అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. అలాంటి మరికొన్ని పోస్టులను చూసేయండి. View this post on Instagram A post shared by Emma Roberts (@emmaroberts) GUYS HELP ME THATS LITERALLY EMMA ROBERTS NOT EMMA WATSON ☠️☠️☠️☠️☠️☠️☠️☠️☠️ #ReturnToHogwarts #HarryPotter20thAnniversary pic.twitter.com/bLbXcCUpnh — 𝕞𝕒𝕟𝕚𝕒 (@vee_delmonico99) January 1, 2022 Harry Potter 20th Anniversary how do u mess up putting an Emma Roberts child photo instead of an Emma Watson one? You think with such an icon series there would 2X & 3X check things for the reunion.😋 An American actress when we know American kids weren’t used. #ReturnToHogwarts — Krista (@BeatGrrl18) January 2, 2022 I tried to search "emma watson baby" on google and yes that emma roberts baby picture shows up at the top 😂#EmmaWatson #ReturnToHogwarts pic.twitter.com/rkGkqbDPYi — loony (@girlonquibbler) January 2, 2022 Wow. The editors / producers of #HarryPotter #ReturnToHogwarts seriously used a picture of a young Emma Roberts instead of Emma Watson. HOW did this get past everyone?!?! 😂😂😂 pic.twitter.com/kNm0ZkWOh5 — Tyler (@OldGoldenSnitch) January 2, 2022 -
‘ఆర్ఆర్ఆర్’కు షాక్!
దర్శకధీరుడు రాజమౌళిని కష్టాలు వెంటాడుతున్నాయి. బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా ఆర్ఆర్ఆర్ను మొదలు పెట్టిన రాజమౌళిని వరుసగా ఆటంకాలు ఎదురవుతున్నాయి. హీరోలిద్దరు గాయపడటంతో కొంతకాలం షూటింగ్‌కు బ్రేక్ పడింది. తరువాత ఎన్టీఆర్‌కు జోడిగా నటించాల్సిన డైసీ ఎడ్గార్ జోన్స్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఇటీవల ఎన్టీఆర్‌కు జోడిగా మరో హాలీవుడ్ భామ ఎమ్మా రాబర్ట్స్‌ను ఫైనల్ చేసినట్టుగా వార్తలు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఎమ్మా కూడా ఆర్ఆర్ఆర్కు నో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఓ రీజినల్ సినిమాకు బల్క్ డేట్స్ ఇచ్చేందుకు ఎమ్మా ఆసక్తి చూపించటం లేదన్న టాక్ వినిపిస్తోంది. దీంతో మరోసారి హీరోయిన్ వేటలో పడ్డారు చిత్రయూనిట్. -
ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్ బ్యూటీ!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా ఓ ఫారిన్ భామ నటించనున్నారు. ముందుగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సర్సన నటించేందుకు హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ ను ఎంపిక చేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో డైసీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటంతో మరో ఇంగ్లీష్ బ్యూటీని వెతికే పనిలో పడ్డారు ఆర్ఆర్ఆర్ టీం. తాజాగా ఎన్టీఆర్‌కు జోడి సెట్ అయినట్టుగా తెలుస్తోంది. అమెరికన్ నటి, గాయని ఎమ్మా రాబర్ట్స్‌ను ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా ఫైనల్ చేశారట. పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఈ భామ తొలిసారిగా ఓ భారతీయ చిత్రంలో నటించనున్నారు. ఈ మల్టీ స్టారర్ సినిమాలో మరో హీరోగా నటిస్తున్న రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్గా నటిస్తున్నారు.