ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్‌ బ్యూటీ! | Emma Roberts Cast as Jr NTR's Heroine in Rajamouli RRR | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్‌ బ్యూటీ!

Published Tue, Jul 23 2019 11:05 AM | Last Updated on Tue, Jul 23 2019 11:06 AM

Emma Roberts Cast as Jr NTR's Heroine in Rajamouli RRR - Sakshi

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా ఓ ఫారిన్‌ భామ నటించనున్నారు. ముందుగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సర్సన నటించేందుకు హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ ను ఎంపిక చేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో డైసీ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవటంతో మరో ఇంగ్లీష్‌ బ్యూటీని వెతికే పనిలో పడ్డారు ఆర్‌ఆర్‌ఆర్‌ టీం.

తాజాగా ఎన్టీఆర్‌కు జోడి సెట్ అయినట్టుగా తెలుస్తోంది. అమెరికన్‌ నటి, గాయని ఎమ్మా రాబర్ట్స్‌ను ఎన్టీఆర్‌ సరసన హీరోయిన్‌గా ఫైనల్ చేశారట. పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఈ భామ తొలిసారిగా ఓ భారతీయ చిత్రంలో నటించనున్నారు. ఈ మల్టీ స్టారర్‌ సినిమాలో మరో హీరోగా నటిస్తున్న రామ్‌ చరణ్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement