దర్శకధీరుడు రాజమౌళిని కష్టాలు వెంటాడుతున్నాయి. బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా ఆర్‌ఆర్‌ఆర్‌ను మొదలు పెట్టిన రాజమౌళిని వరుసగా ఆటంకాలు ఎదురవుతున్నాయి. హీరోలిద్దరు గాయపడటంతో కొంతకాలం షూటింగ్‌కు బ్రేక్ పడింది. తరువాత ఎన్టీఆర్‌కు జోడిగా నటించాల్సిన డైసీ ఎడ్గార్ జోన్స్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.
ఇటీవల ఎన్టీఆర్‌కు జోడిగా మరో హాలీవుడ్ భామ ఎమ్మా రాబర్ట్స్‌ను ఫైనల్ చేసినట్టుగా వార్తలు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఎమ్మా కూడా ఆర్‌ఆర్‌ఆర్‌కు నో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఓ రీజినల్ సినిమాకు బల్క్ డేట్స్ ఇచ్చేందుకు ఎమ్మా ఆసక్తి చూపించటం లేదన్న టాక్ వినిపిస్తోంది. దీంతో మరోసారి హీరోయిన్ వేటలో పడ్డారు చిత్రయూనిట్.
Comments
Please login to add a commentAdd a comment