employee negligence
-
సరెండర్..సస్పెన్షన్..
పాలనపై పట్టుబిగిస్తున్న నగరపాలక సంస్థ కమిషనర్ పారిశుధ్య విభాగంపై డేగకన్ను ఆందోళనలో అవినీతి ఉద్యోగులు విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ ఉద్యోగుల నిర్లక్ష్యం, అవినీతిపై కమిషనర్ జి.వీరపాండియన్ కొరడా ఝుళిపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సుడిగాలి పర్యటనలు చేస్తున్న ఆయన అక్రమార్కులను సన్మార్గంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పాలనపై పట్టు బిగిస్తూ అవినీతిపరును బెంబేలెత్తిస్తున్నారు. పనిచేయని అధికారులను సరెండర్ చేసేందుకు వెనుకాడటం లేదు. సాకులు చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించే ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. మస్తర్ల మస్కాపై నిఘా పారిశుధ్య విభాగంలో మస్తర్ల మస్కాపై కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. నగర పర్యటనలో భాగంగా డివిజన్లలో పారిశుధ్య కార్మికుల హాజరును ఆయన నిశితంగా పరిశీలించారు. 30 నుంచి 40శాతం వరకు కార్మికులు విధులకు డుమ్మా కొడుతున్నారని గుర్తించారు. ఇటీవల పారిశుధ్య కార్మికుల జీతాల బిల్లు సుమారు రూ.2.30కోట్లు కమిషనర్ చాంబర్‌కు వెళ్లింది. 87 శాతం హాజరు చూపినట్లు సమాచారం. దీనిపై కమిషనర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. 60 నుంచి 70 శాతం మాత్రమే కార్మికులు విధుల్లో పాల్గొంటుంటే ఇంత మొత్తంలో బిల్లు ఎందుకు వచ్చిందో చెప్పాలని నిలదీశారు. అప్పటికే అకౌంట్స్ విభాగం చెక్కు తయారుచేయడంతో కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్, సూపరింటెండెంట్, అకౌంట్స్ అధికారి, అసిస్టెంట్ ఎగ్జామినర్లకు మెమోలు జారీ చేసినట్లు తెలిసింది. కథలు చెప్పొద్దంటూ క్లాస్..! పారిశుధ్య విభాగంలో 2,984 మంది డ్వాక్వా, సీఎంఈవై కార్మికులు పనిచేస్తున్నారు. మస్తర్ల మాయతో లక్షల రూపాయలను అక్రమార్కులు నొక్కే స్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి చెక్ పెట్టేం దుకు గతంలో పనిచేసిన కమిషనర్ సి.హరికిరణ్ బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. మొత్తం 55 శానిటరీ డివిజన్లు ఉండగా, మూడు సర్కిళ్ల పరిధిలో 12 డివిజన్లలో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇంతవరకు ఈ విధానం అందుబాటులోకి రాలేదు. దీంతో అక్రమార్కులు యథేచ్ఛగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. మస్తర్ల మస్కాపై ప్రస్తుత కమిషనర్ కన్నెర్ర జేయడ ంతో కంగుతిన్న అధికారులు కొందరు కార్మికులు దీర్ఘకాలిక సెలవులో ఉన్నారంటూ సర్ధిచెప్పేందుకు ప్రయత్నించగా.. కథలు చెప్పొద్దంటూ క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. పనిచేయకపోతే అవసరం లేదు.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగులపై కమిషనర్ వేటు వేస్తున్నారు. వెహికల్ డిపోలో పనిచేసే లోక్‌నాథ్ ఆయిల్ బిల్లు సకాలంలో బ్యాంక్‌లో జమ చేయకపోవడంపై సీరియస్ అయ్యారు. తాను ఈ నెల 14న బ్యాంక్‌కు వెళ్లానని, శనివారం కావడంతో మధ్యాహ్నం వరకే బ్యాంక్ పనిచేయడంతో నగదు చెల్లించలేకపోయానని వివరణ ఇచ్చారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కమిషనర్ బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడి సీసీ టీవీ వీడియో పుటేజ్‌ను తెప్పించారు. సంబంధిత ఉద్యోగి బ్యాంక్‌కు వెళ్లినట్లు పుటేజ్‌లో లేకపోవడంతో ఆయన్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. తరుచూ సెలవు పెడుతున్న యూసీడీ పీవో కె.శకుంతలను మాతృసంస్థకు సరెండర్ చేశారు. తద్వారా పనిచేయని ఉద్యోగులు అక్కర్లేదన్న సంకేతమిచ్చారు. పాలనను గాడిలో పెట్టేందుకు కమిషనర్ స్పీడ్ పెంచడంతో కొందరు ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. -
ఉసురు తీసిన వైద్యం
నాంపల్లి,న్యూస్‌లైన్: నిర్లక్ష్యానికి చిరునామాగా మారిన నిలోఫర్‌లో మరోమారు సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. ప్రసవం కోసం వచ్చిన మహిళను సురక్షితంగా కాపాడాల్సిన వైద్యులు, సిబ్బంది పట్టించుకోకపోవడం.. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు గర్భసంచిని తొలగించడంతో చివరకు కన్నుమూసింది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి...జీడిమెట్ల షాపూర్‌నగర్‌లో నివాసముండే భారతి,వెంకటేష్‌లు దంపతులు. ఏడాది క్రితం వివామైంది. వెంకటేశ్ కారుడ్రైవర్. భార్య భారతి(20) గర్భం దాల్చడంతో వెంకటేష్ ఆమెను కాన్పుకోసం ఈనెల 5న నిలోఫర్ లో చేర్పించారు. లేబర్‌వార్డులో ఉన్న సిబ్బంది కనీసం పట్టించుకోకపోవడం, ఇంజక్షన్ వేయకున్నా భారతికి సాధారణ కాన్పు జరిగి మగశిశువు జన్మించాడు. అయితే షిప్టు మారే సమయం కావడంతో సిబ్బంది గర్భసంచి నుంచి మాయను తొలగించే క్రమంలో సిజేరియన్ కత్తులను ఉపయోగించారు. దీంతో ఆకత్తులు గర్భసంచికి తగిలి బాలిం తకు అధిక రక్తస్రావమైంది. ఆస్పత్రిలో బ్లడ్‌బ్యాంకులో ఓ పాజిటివ్ రక్తం లేకపోవడంతో బయటనుంచి 15 బాటిల్స్ రక్తం తీసుకొచ్చినా రక్తంస్రావం ఆగలేదు. దీంతో సిబ్బందికి వణుకు పుట్టి వెంటనే రోగి బంధువులను బయటకు వెళ్లాలని ఆదేశించి ఏంచేయాలో తెలియక చివరకు గర్భసంచిని తొలగించారు. పరిస్థితి విషమంగా మారుతుండడంతో వెంటనే అంబులెన్స్‌లో ఉస్మానియాకు తరలించాలని చెప్పారు. పోలీసుల సాయంతో తరలిస్తుండగా భారతి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. చివరకు అక్కడచికిత్స పొందుతూ కన్నుమూసింది. ఆస్పత్రి వద్ద ఆందోళన: చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడమే కాకుండా బాలింతను చూపించకపోవడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. వైద్యులు,సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా అయ్యిందంటూ శిశువును చేతపట్టుకొని నినాదాలు చేశారు. దీంతో ఆస్పత్రి వైద్యులు, నాంపల్లి పోలీసులు, ఎస్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా రోగి బంధువులను తప్పిం చేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో పోలీసులు భారతి బంధువుల్లోని కొందరు మహిళలపై విచక్షణారహితంగా వ్యవహరించారు. కేసు నమోదు చేయాలి: విధుల్లో ఉన్న ఆర్ఎంవో జానకి, డీఎంవో ఝాన్సీలక్ష్మీబాయి, స్టాఫ్‌నర్స్ విజయనిర్మలలపై కేసు నమోదు చే యాలని మృతురాలి బంధువులు డిమాండ్ చే శారు. వీరిపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చే యనున్నట్లు వెల్లడించారు. నిలోఫర్‌లో రక్తంలేక బయట అప్పుచేసి కొనుగోలు చేసి అందించామని, చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే రోగిని ఉస్మానియాకు మార్చారన్నారు. కాగా జరిగిన ఘటనపై పూర్తి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి సూపరింటెండెంట్ దేవరాజ్ పేర్కొన్నారు. అత్యవసర కేసులను ఆస్పత్రిలో చూడరని చెప్పారు.