నాంపల్లి,న్యూస్‌లైన్:
నిర్లక్ష్యానికి చిరునామాగా మారిన నిలోఫర్‌లో మరోమారు సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. ప్రసవం కోసం వచ్చిన మహిళను సురక్షితంగా కాపాడాల్సిన వైద్యులు, సిబ్బంది పట్టించుకోకపోవడం.. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు గర్భసంచిని తొలగించడంతో చివరకు కన్నుమూసింది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి...జీడిమెట్ల షాపూర్‌నగర్‌లో నివాసముండే భారతి,వెంకటేష్‌లు దంపతులు. ఏడాది క్రితం వివామైంది. వెంకటేశ్ కారుడ్రైవర్. భార్య భారతి(20) గర్భం దాల్చడంతో వెంకటేష్ ఆమెను కాన్పుకోసం ఈనెల 5న నిలోఫర్ లో చేర్పించారు. లేబర్‌వార్డులో ఉన్న సిబ్బంది కనీసం పట్టించుకోకపోవడం, ఇంజక్షన్ వేయకున్నా భారతికి సాధారణ కాన్పు జరిగి మగశిశువు జన్మించాడు. అయితే షిప్టు మారే సమయం కావడంతో సిబ్బంది గర్భసంచి నుంచి మాయను తొలగించే క్రమంలో సిజేరియన్ కత్తులను ఉపయోగించారు. దీంతో ఆకత్తులు గర్భసంచికి తగిలి బాలిం తకు అధిక రక్తస్రావమైంది.
ఆస్పత్రిలో బ్లడ్‌బ్యాంకులో ఓ పాజిటివ్ రక్తం లేకపోవడంతో బయటనుంచి 15 బాటిల్స్ రక్తం తీసుకొచ్చినా రక్తంస్రావం ఆగలేదు. దీంతో సిబ్బందికి వణుకు పుట్టి వెంటనే రోగి బంధువులను బయటకు వెళ్లాలని ఆదేశించి ఏంచేయాలో తెలియక చివరకు గర్భసంచిని తొలగించారు. పరిస్థితి విషమంగా మారుతుండడంతో వెంటనే అంబులెన్స్‌లో ఉస్మానియాకు తరలించాలని చెప్పారు. పోలీసుల సాయంతో తరలిస్తుండగా భారతి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. చివరకు అక్కడచికిత్స పొందుతూ కన్నుమూసింది.
ఆస్పత్రి వద్ద ఆందోళన: చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడమే కాకుండా బాలింతను చూపించకపోవడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. వైద్యులు,సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా అయ్యిందంటూ శిశువును చేతపట్టుకొని నినాదాలు చేశారు. దీంతో ఆస్పత్రి వైద్యులు, నాంపల్లి పోలీసులు, ఎస్‌పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా రోగి బంధువులను తప్పిం చేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో పోలీసులు భారతి బంధువుల్లోని కొందరు మహిళలపై విచక్షణారహితంగా వ్యవహరించారు.
కేసు నమోదు చేయాలి: విధుల్లో ఉన్న ఆర్‌ఎంవో జానకి, డీఎంవో ఝాన్సీలక్ష్మీబాయి, స్టాఫ్‌నర్స్ విజయనిర్మలలపై కేసు నమోదు చే యాలని మృతురాలి బంధువులు డిమాండ్ చే శారు. వీరిపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చే యనున్నట్లు వెల్లడించారు. నిలోఫర్‌లో రక్తంలేక బయట అప్పుచేసి కొనుగోలు చేసి అందించామని, చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే రోగిని ఉస్మానియాకు మార్చారన్నారు. కాగా జరిగిన ఘటనపై పూర్తి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి సూపరింటెండెంట్ దేవరాజ్ పేర్కొన్నారు. అత్యవసర కేసులను ఆస్పత్రిలో చూడరని చెప్పారు.
ఉసురు తీసిన వైద్యం
Published Wed, Jan 8 2014 3:12 AM | Last Updated on Wed, Oct 17 2018 5:43 PM
Advertisement
Advertisement