employee suicide attempt
-
ప్రిన్సిపల్ వేధింపులు: ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం తాళ్ళమాడలోని గురుకులంలో ఓ ఉద్యోగిని ఆత్మహత్యకు యత్నించింది. సునీత అనే మహిళ గురుకులంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నది. అయితే ఆమెను ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న రమేష్ మూడు నెలలుగా వేధిస్తున్నాడు. ఈ వేధింపులు భరించలేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను సత్తుపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. -
కలెక్టరేట్ వద్ద ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
విజయవాడ: మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం మధ్యాహ్నం ఒక ఉద్యోగి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. తన కుటుంబానికి న్యాయం చేయమని మీ కోసం కార్యక్రమంలో ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో నూజివీడు ఉపాధి హామీ పనులు విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శివాజీ కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు అతనిని వారించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శివాజీని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు. -
ఆరోగ్యమిత్రలపై జులుం దుర్మార్గం
వారిని పునర్ నియమించాలి: వైఎస్సార్సీపీ సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాలు కోల్పోయి ఆందోళనకు సిద్ధమవుతున్న ఆరోగ్యమిత్ర ఉద్యోగులపై పోలీసులు జులుం చేయడం దుర్మార్గమైన చర్య అని తొలగించిన వారిని తిరిగి నియమించే విషయాన్ని పరిశీలించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. తమ పొట్టగొట్టొద్దని కోరుతూ విజ్ఞాపన పత్రం సమర్పించడానికి విజయవాడలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్లడానికి ప్రయత్నించిన ఆరోగ్యమిత్రలను పోలీసులు అడ్డుకుని అణ చి వేయడం హేయమైన చర్య అని విమర్శించారు. ఉద్యోగం పోయిందనే క్షోభతో నెల్లూరులో సుమలత అనే ఆరోగ్యమిత్ర ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఈ విషయం తెలుసుకుని చాలా ఆవేదన చెందారని తెలిపారు.